24, మార్చి 2024, ఆదివారం

తిరుపతిలో ఓపెన్‌ యూనివర్సిటీ! | Open University in Tirupati!


● హైదరాబాద్‌ నుంచి తరలింపునకు నిర్ణయం

● 16న ‘షార్ట్‌ సర్క్యులేషన్‌’తో కేబినెట్‌ ఆమోదం

● ఈసీ ఆమోదిస్తే వెంటనే అమల్లోకి ఆర్డినెన్స్‌

హైదరాబాద్‌లో ఉమ్మడిగా కొనసాగుతున్న బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీని యుద్ధప్రాతిపదికన రాష్ట్రానికి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నందున బిల్లు పెట్టే అవకాశం లేకపోవడంతో, ఆర్డినెన్స్‌ ద్వారా తిరుపతిలో వర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం షార్ట్‌ సర్క్యులేషన్‌ విధానంలో మంత్రులకు నోట్‌ పంపి ఆమోదముద్ర వేయించింది. సరిగ్గా ఎన్నికల షెడ్యూలు విడుదలైన ఈ నెల 16న ఆ ఫైలుకు కేబినెట్‌ ఆమోదం లభించగా, 19న ఈసీకి ఈ ప్రతిపాదనను పంపాలని కోరుతూ సాధారణ పరిపాలన శాఖకు ఉన్నత విద్యాశాఖ లేఖ రాసింది. ఈసీ అనుమతిస్తే వెంటనే ఫైల్‌ను గవర్నర్‌కు పంపి ఆర్డినెన్స్‌ జారీ చేస్తారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇక్కడ అడ్మిషన్లు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వర్సిటీ ఏర్పాటుకు అనుమతితో పాటు మొదట రూ.63.85 కోట్ల బడ్జెట్‌, 50 టీచింగ్‌, 68 నాన్‌ టీచింగ్‌ పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదించింది.

పదో షెడ్యూలులో వర్సిటీ

1982లో హైదరాబాద్‌లో స్థాపించిన ఓపెన్‌ యూనివర్సిటీ రాష్ట్ర విభజన సమయంలో పదో షెడ్యూలు పరిధిలోకి వెళ్లింది. రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్లు అవుతున్నా ఈ షెడ్యూలులో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు. అయినా ఉన్నత విద్యామండలి, తెలుగు అకాడమీ, ఇతర సంస్థలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఓపెన్‌ వర్సిటీకి ఏపీలో 76 స్టడీ సర్కిళ్లున్నాయి. 16 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, 500 మంది పార్ట్‌టైం సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ఏపీ ప్రభుత్వం జీతాలు ఇస్తుంటే, విద్యార్థులు చెల్లించే ఫీజులు మాత్రం హైదరాబాద్‌లోని యూనివర్సిటీకి వెళ్తున్నాయి. దూర విద్య ద్వారా ఏటా 30వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందుతున్నారు. వీరంతా కలిపి సంవత్సరానికి రూ.13కోట్లకు పైగా ఫీజులు కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దీనికి ఉన్న ఏపీ చట్టమే ఇప్పుడు ఏర్పాటు చేయబోయే దానికీ వర్తిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ విభజించకుండానే హైదరాబాద్‌లో ఉన్న వర్సిటీని ఏపీకి తరలిస్తే అది కొత్తదే అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఏపీలో వర్సిటీని ఏర్పాటుచేసినా, ఉమ్మడి వర్సిటీపై కొంతకాలం పాటు ఆధారపడాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు:

Recent

**🛑 NIOS Senior Executive Officer Recruitment** **🎓 Qualifications:** 1. **Senior Executive Officer (Instructor):** - Passed Class XII in any discipline - Diploma in Teaching Indian Sign Language (DTISL) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language 2. **Senior Executive Officer (Interpreter):** - Passed Class XII in any discipline - Diploma in Indian Sign Language Interpreting (DISLI) or an equivalent course recognized by RCI - Proficiency in Indian Sign Language **📅 Last Date for Application Submission:** **21 days** from the date of notification issuance. **🛑 NIOS సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల నియామకం** **🎓 అర్హతలు:** 1. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇన్‌స్ట్రక్టర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టీచింగ్ డిప్లొమా (DTISL) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం 2. **సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఇంటర్‌ప్రెటర్):** - 12వ తరగతి ఉత్తీర్ణం - ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటింగ్ డిప్లొమా (DISLI) లేదా RCI ద్వారా గుర్తించబడిన సమానమైన కోర్సు - ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో నైపుణ్యం **📅 దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ:** **21 రోజులు** (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి)