3, జనవరి 2025, శుక్రవారం

**నిరుద్యోగులకు ఉపాధి అవకాశం**

DRDA - సీడాప్ మరియు ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సంయుక్తంగా పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద నిరుద్యోగులకు మండల స్థాయిలో జిల్లా రీసోర్స్ పర్సన్ల (డీఆర్పీ)గా పని చేసే అవకాశాన్ని కల్పించనున్నాయి.  

ఈ మేరకు డీఆర్డీఏ పీడీ ఈశ్వరయ్య గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 31 మందిని భర్తీ చేయనున్నట్లు, ఒక్కొక్కరికి నెలకు ₹20,000 ప్రోత్సాహక వేతనం అందజేస్తారని తెలిపారు. ఎంపికైన వారు మండల స్థాయిలో ఎంటర్ప్రైజెస్ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.  

### **అర్హతలు:**  
- ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.  
- కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉపయోగంలో నైపుణ్యం ఉండాలి.  
- ఫుడ్ ప్రాసెసింగ్ లేదా సహజ అభివృద్ధి కార్యకలాపాల అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం.  
- అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.  

**పురుషులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.**  

### **ముఖ్య తేదీలు:**  
- **దరఖాస్తు చివరి తేదీ:** ఈ నెల 5వ తేదీ.  
- **ఇంటర్వ్యూ తేదీ:** ఈ నెల 8న ధర్మవరం పంగల్ రోడ్డులోని టీటీడీసీ ఆఫీస్‌లో.  

**ఇతర వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు:**  
89850 91256, 86394 39808, 86394 48535, 77309 3091955.  

కామెంట్‌లు లేవు: