అనంతపురం మెడికల్: కడప జోన్ పరిధిలోని 150 స్టాఫ్ నర్సు ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి కడప ప్రాంతీయ సంచాలకులు నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఈ. భ్రమరాంబ దేవి తెలిపారు. ఈ మేరకు గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ నెల 3వ తేదీ నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు https://cfw.ap.gov.in వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి