రాష్ట్రంలోని లాసెట్, ఎడ్సెట్-2024లో భాగంగా లా, బీఈడీ కోర్సుల్లో స్పాట్ మరియు బీ కేటగిరీ సీట్ల భర్తీకి ఉన్నత విద్యా మండలి గడువును పొడిగించింది. ఈనెల 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ గురువారం ప్రకటన విడుదలైంది.
**ఏయూలో పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్**
**విశాఖపట్నం:**
ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ (ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. యూజీసీ-నెట్-జేఆర్ఎఫ్, యూజీసీ-సీఎస్ఐఆర్-నెట్-జీఆర్ఎఫ్, గేట్, సీఈఈడీ, యూజీసీ-నెట్ (అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్/పీహెచ్డీ) అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ విషయాన్ని ఏయూ రీసెర్చ్ స్కాలర్స్ విభాగం డైరెక్టర్ డీఏ నాయుడు తెలిపారు. అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ (నాన్-క్రిమీలేయర్), మరియు విభిన్న సామర్థ్యం గల అభ్యర్థుల కోసం 50% మార్కులు సరిపోతాయి.
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం [https://www.andhrauniversity.edu.in/](http://www.audoa.andhrauniversity.edu.in) ని సందర్శించాలని సూచించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి