Alerts

--------

14, మే 2020, గురువారం

🎯డీఆర్‌డీఓ-ఆర్‌ఏసీలో 167 సైంటిస్టులు🎯



🏵డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ)కి చెందిన దిల్లీలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

🏵 సైంటిస్ట్‌-బి మొత్తం ఖాళీలు: 167

🏵విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

👉అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, వాలిడ్‌ గేట్‌ స్కోర్‌.

👉ఎంపిక విధానం: వాలిడ్‌ గేట్‌ స్కోర్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

👉దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

👉దరఖాస్తుకు చివరి తేది: జులై 10, 2020.

⭕వెబ్‌సైట్‌: https://rac.gov.in/

ఐఐటీ కౌన్సెలింగ్‌ రౌండ్ల తగ్గింపు!!



హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే జేఈఈ-మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు వాయిదా పడటంతో తరగతుల ప్రారంభం కూడా ఆలస్యమవడం అనివార్యంగా మారింది. దీంతో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్‌ ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఐఐటీ, నీట్‌లలో ప్రవేశాలకుగానూ జేఈఈ కౌన్సెలింగ్‌కు ఈ ఏడాది తక్కువ రౌండ్లు నిర్వహించాలని యోచిస్తోంది. 2019లో సీట్ల భర్తీకి జోసా 7 రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించింది. ఈసారి రౌండ్లు తగ్గించాలని ఐఐటీలు మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపాయి. దీంతో ఈ ఏడాది ఐదు లేదా ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. జేఈఈ-మెయిన్‌ పరీక్షను జూలై 18 నుంచి 23 వరకు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఆగస్టు 23న నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...