21, మే 2020, గురువారం

హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 21-05-2020

దాదాపుగా రెడ్ జోన్ లోనే హిందూపురం, పురంలో 53 రోజులలో 120 కేసులు రాగా అందులో 7 గురు చనిపోయారు, ఇప్పటికీ రెడ్ జోన్ లలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముక్కటి పేట, త్యాగరాజనగర్, ఆర్టీసీ కలనీ, నింకంపల్లి, సత్యనారాయణపేట, ఆజాద్ నగర్, హస్నాబాద్, బాలాజీ నగర్,రహమత్ పురంలలో ఈ వైరస్ జాడలు అంతమయ్యేలా కనిపించడం లేదు. ఈ రోజు విడుదల చేసిన ఆర్ టి సి బస్సు రూట్లలో హిందూపురం నుండి కాని హిందూపురానికి వచ్చే బస్సులకు అనుమతులు లేకపోవడం హిందూపురం మొత్తం ఏ జోన్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

నేటి నుండి ఆర్ టి సి బస్సుల ప్రయాణం మొదలైనా సీటు సీటుకు మధ్య దూరం, అలాగే బస్సుల్లో వృద్దులు, దివ్యాంగులు, విద్యార్థులు, పాత్రికేయులు తదితరులకు కల్పిస్తున్న వివిధ రాయితీ పాసులను తాత్కాలికంగా నిలిపివేశారు. కడప కర్నూలు మదనపల్లి రూట్ల బస్సులకు మాత్రమే ఆన్ లైన్ రిజర్వేషన్ కోసం WWW.APSRTCONLINE.IN ద్వారా చేసుకోవచ్చు. రూట్ల వారీగా ప్రయాణికులకు స్టెజి పాయింట్ల కండెక్టర్ల వద్ద నేరుగా టికెట్ తీసుకోవచ్చు. బస్సు రూట్లు, రిజర్వేషన్ అంశాల పై సందేహాలుంటే 9959225866 నెంబరుకు కాల్ చేయవచ్చు. కాగా పల్లెవెలుగులో 35 మంది ఎక్స్ ప్రెస్ లో 30, అల్ట్రాడీలక్స్ లో 29, సూపర్ లగ్జరీలో 26 మందిని మాత్రనే అనుమతిస్తారు.

రిజిస్ట్రేషన్ తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని విద్యార్థులందరికి గేట్ ఆన్ లైన్ తరగతులను అందుబాటులోకి తేనున్నట్టు జె ఎన్ టి యు వి సి ప్రొఫెసర్ శ్రీనివాస కుమార్ పేర్కొన్నారు. రెండో విడత ఈ నెల 26 నుంచి  ప్రారంభిస్తున్నట్లు ఇందుకోసం యూట్యూబ్ లింక్ ద్వారా తరగతులు వినవచ్చన్నారు.

శ్రీ ఆది జాంబవంతుడు డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో హిందూపురం లోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు విటమిన్ సి లభించే పండ్లను 400 మంది పారిశుద్ధ్య కార్మికులకుపంపిణీ చేయడం జరిగిందిపెంచిన తన తండ్రి కీర్తిశేషులు కే ప్రేమ్ కుమార్ గారు స్థాపించిన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం తమకు సంతోషం కలిగిస్తోందని  సందర్భంగా  సతీష్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులు సేవలను కొనియాడారు రెడ్ జూనో కంటోన్మెంట్ జోన్ అనే  బేదాలు లేకుండా ప్రతి చోటా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు దైవంతో సమానం అని వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమవారికి వారి పాదాలు శుభ్రం చేసి వారి వారి పట్ల తమకున్న గౌరవాన్ని వ్యక్తం చేశారు తరువాత మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ సార్ గారి చేతులమీదుగా పారిశుద్ధ్య కార్మికులకు పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు విమల్ కుమార్ ప్రవీణ్ కుమార్ మరియు బాపూజీ నగర్ యువత పాల్గొన్నారు.

ఆర్ డి టి సహకారంలో ఆన్ లైన్ లో స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణ అందిస్తున్న గురుకుల్ హెడ్ అడ్మిషన్స్ శివశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణకు 20 నుంది 30 ఏళ్ళ లోపు ఉండి ఇంటర్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికేట్లు అందజేసి, బెంగళూరు వండి నగరాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తామని వివరాలకు 9000487423 / 6305334287 / 7780752418 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీసెట్ 2020) నోటిఫికేషన్ విడుదలయింది. ఆన్ దరఖాస్తుకు చివరి తేది జూన్ 5 https://cse.ap.gov.in లేదా https://apdeecet.apcfss.in


నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
సంఖ్య - 48
అర్హతలు - సివిల్ ఇంజినీరింగ్
దరఖాస్తుకు చివరి తేది - జూన్ 15





20, మే 2020, బుధవారం

Private Vacancies






















డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు



సంఖ్య :48
అర్హతలుసివిల్ ఇంజనీరింగ్‌
విడుదల తేదీ:20-05-2020
ముగింపు తేదీ:15-06-2020
వేతనం:రూ.15,600 - 39,100 / - నెలకు
ఉద్యోగ స్థలం:భారతదేశం

మరింత సమాచారం:

పోస్ట్ పేరు:
డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)
---------------------------------------------------------
అర్హతలు:
సివిల్ ఇంజనీరింగ్‌
---------------------------------------------------------
వయసు పరిమితి :
30 సంవత్సరాలు.
---------------------------------------------------------
వేతనం:
రూ.15,600 - 39,100
/ - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ: 
Interview.
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://nhai.gov.in/
వద్ద 20-05-2020 నుండి 15-06-2020
వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: https://nhai.gov.in/
---------------------------------------------------------
Notification :-https://nhai.gov.in/current-vacancies.htm
---------------------------------------------------------








లాక్ డౌన్ ప్రభావంతో హిందూపురం నుండి వెనక్కు వెళ్ళిపోయిన వలస కార్మికులు తిరిగి రాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు ఎన్నో ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ ఒకటే అని కాదు దేశంలోని ప్రతి ప్రాంతంలోని పరిస్థితి ఇదే. పారిశ్రామిక వాడల్లో ఖాళీ అయిన ఖాళీలు, పట్టణంలోని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు అలాగే వ్యాపారుల వద్ద పని చేసే వారి స్థానాన్ని ఏ మాత్రం భర్తీ చేస్తారో హిందూపురం వాసులు చూద్దాం. అన్నీ బాగానే ఉన్నా కష్టించి పని చేసే తత్వం హిందూపురం యువతకు ఉంటే ఈ అవకాశాలన్నీవారికే అన్నది నిజం. ఉద్యోగాలనీ, ప్రభుత్వాలను ఆడిపోసుకునే వారు ఉన్నంతకాలం నిరుద్యోలుగా ఉండిపోతారు అదే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ కాళ్ళ పై నిలబడి సమాజానికి బరువు కాకుండా ఉండటమన్నది అసలైన పౌరుని లక్షణం. లాక్ డౌన్ తరువాత కొత్త ఉద్యోగాలు కొత్త ఉపాధి అవకాశాలు కష్టమే కాక పోతే, జీవితానికి ఉద్యోగమే పరమావధి కాదు.

Telangana Agriculture Outsourcing Jobs 2020 | తెలంగాణ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ లో ఉద్యోగాల భర్తీ

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ : 17 మే 2020
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 21 మే 2020

మొత్తం ఖాళీలు:

194

జిల్లా వారీగా ఖాళీలు:

నల్గొండ – 22
మహబూబ్‌నగర్-26
రంగా రెడ్డి-29
మెదక్-26
నిజామాబాద్-15
ఖమ్మం-20
వరంగల్-21
కరీంనగర్-10
అదిలాబాద్-25

అర్హతలు:

B.Sc అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ డిప్లొమా లేదా
బీటెక్ అగ్రికల్చర్ పాస్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

జీతం:

17500 వరకు జీతం ఉంటుంది.

వయస్సు:

18-34 ఏళ్ల మధ్య ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. బీసీ,ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, PWD వారికి 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

ఫలితాలు ఎప్పుడు:

మే 22 వ తేదీ సాయంత్రం మెరిట్ జాబితాను విడుదల చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. మే 21 సాయంత్రం నాలుగు గంటల్లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అందజెయ్యవలసి ఉంటుంది.

చిరునామ:

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ హైదరాబాద్ తెలంగాణ
Website

హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 20-05-2020

హిందూపుర పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లి లో గల రూప శ్రీ వృద్దాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు నిత్యావసర సరుకులు (బియ్యం, కందిబేడలు, చక్కెర, రవ్వ, నూనె, అటుకులు, బిస్కెట్లు) తదితర సరుకులను వైఎస్ఆర్ సీపీ నాయకులు మారుతి రెడ్డి అందించారు.

వెస్ట్రన్ రైల్వే లో ఉద్యోగాలు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 42, దరఖాస్తుకు చివరి తేదీ 10-06-2020 విద్యా అర్హత: పోస్ట్ వైజ్ అర్హత తదితర వివరాలకోసం నోటిఫికేషన్ను చూడవచ్చు.

రవాణా మరియు రెడ్ జోన్ ప్రభావం దృష్ట్యా చదివిన స్కూల్ లోనే పదవ తరగతి పరీక్షల నిర్వహించే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది.

ప్రభుత్వం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టుల దరఖాస్తుకు ఆలస్య రుసుము లేకుండా జూన్ 15 వరకు గడువు పెంచినట్లు మండలి  కార్యదర్శి బి సుధీర్ ప్రేమ్ కుమార్ తెలిపారు.

ఎపీ నిట్ లో బిటెక్ చివరి సంవత్సరం విద్యార్థులకు జూన్ 1తేదీ నుండి ఆన్ లైన్ పరీక్షర్లు నిర్వహించనున్నట్టు నిట్  డైరెక్టర్ సూర్యప్రకాశ్ రావు తెలిపారు.

ఇప్పటి వరకు మెయిన్స్ కు దరఖాస్తు చేసుకోని వారి కోసం, జె ఇ ఇ మెయిన్స్ దరఖాస్తులను రీ ఓపెన్ చేసింది ఎన్ టి ఎ. ఈ అప్లికేషన్ లు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. ఫీజును 24వ తేదీ రాత్రి 11.00 వరకు చెల్లించవచ్చు. నిజానికి ఈ అవకాశం విదేశాలకు వెళ్ళి చదుకుకోవాలనుకుని లాక్ డౌన్ కారణంగా వెళ్ళాలేక పోయిన విద్యార్థులకు కల్పించినది.

బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రి నుండి 15 మంది హిందూపురం పట్టణ వాసులు కారోనా నుండి కోలుకుని హిందూపురం వచ్చారు. అయితే వీరిని 14 రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు  అధికారులు ఇందులో ఒక్కొక్కరికి 2 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు అధికారులు.


ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం ఆగస్టు 3వ తేదీ నుండి పాఠశాలలను ప్రారంభించాలనే సూచనతో కొత్త క్యాలెండర్ మరియు విధి విధానాల రూపకల్పనలో పాఠశాల విద్యాశాఖ పలు నిర్ణయాలు తీసుకుంది అందులో భాగంగా 9 రకాల సదుపాయలతో, స్కూల్స్ గేట్ల వద్ద శానిటాజర్లు, మాస్కులు, గ్లౌజులు, విద్యార్థుల మధ్య భౌతిక దూరం తదితర అంశాల్లో ఖచ్చితత్వం పాటించాలని పాఠశాలలకు విధివిధానాలు రూపొందించింది.

వార్తా పత్రికల ద్వారా చేకరించిన, మారిన పదవ తరగతి పరీక్షా నమూన పత్రాలను స్పీడ్ జాబ్ అలర్ట్స్ . బ్లాగ్ స్పాట్ .కామ్ లో చూడవచ్చు

వ్రాత పరీక్ష ఆధారంగా UCIL లో ట్రైనీ ఖాళీలు
ఆన్ లైన్ ద్వారా  దరఖాస్తుకు చివరి తేది జూన్ 22
అర్హత  SSC/INTER/ Degree
వయసు 37 ఏళ్ళ లోపు
వేతనం 40 వేల నుండి 2 లక్షల వరకు
http://www.ucil.gov.in/

Notification
















No Exam Railway Jobs | పరీక్ష లేకుండా రైల్వే లో వివిధ ఉద్యోగాల భర్తీ

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ18 మే 2020
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది24 మే 2020

విభాగాల వారీగా ఖాళీలు:

CMP-GDMO9
CMP స్పెషలిస్ట్ అబ్స్ట్ & గైనే / ఇంటెన్సివిస్ట్ / ఫిజిషియన్ / అనస్థెట్ ద్వీపాలు / రేడియాలజిస్ట్ / రేడియాలజిస్ట్11
మూత్రపిండ పున lace స్థాపన / హిమోడయాలసిస్ టెక్నీషియన్2
హాస్పిటల్ అటెండర్లు65
హౌస్ కీపింగ్ అసిస్టెంట్.

90

అర్హతలు:

CMP-GDMOMCI లేదా MMC తో గుర్తించబడిన యూనివర్సిటీ నుండి MBBS పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
CMP స్పెషలిస్ట్ అబ్స్ట్ & గైనే / ఇంటెన్సివిస్ట్ / ఫిజిషియన్ / అనస్థెట్ ద్వీపాలు / రేడియాలజిస్ట్ / రేడియాలజిస్ట్ఎంబిబిఎస్, పిజి డిగ్రీ/ డిప్లొమా సంబంధిత ప్రత్యేకంలో చేసి ఉండాలి. ( MCI చేత గుర్తించబడి ఉండాలి), అభ్యర్థులు MCI / MMC తో నమోదు చేయబడి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
మూత్రపిండ పున lace స్థాపన / హిమోడయాలసిస్ టెక్నీషియన్హిమోడయాలసిస్‌లో బి.ఎస్.సి ప్లస్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.OR
ప్రఖ్యాత సంస్థలో హిమోడయాలసిస్ పనిలో రెండు సంవత్సరాల సంతృప్తికరమైన అంతర్గత శిక్షణ / అనుభవం (జతచేయవలసిన రుజువుగా చెప్పడం జరుగుతుంది)
హాస్పిటల్ అటెండర్లుమెట్రిక్ పాస్ అయి ఉండాలి, ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
హౌస్ కీపింగ్ అసిస్టెంట్.హాస్పిటల్ సెటప్‌లో పనిచేసిన అనుభవంతో మెట్రిక్ పాస్ ఉండాలి ( ప్రిపరెన్స్ ఇవ్వడం జరుగుతుంది)

వయస్సు:

CMP-GDMO53
CMP స్పెషలిస్ట్ అబ్స్ట్ & గైనే / ఇంటెన్సివిస్ట్ / ఫిజిషియన్ / అనస్థెట్ ద్వీపాలు / రేడియాలజిస్ట్ / రేడియాలజిస్ట్53
మూత్రపిండ పున lace స్థాపన / హిమోడయాలసిస్ టెక్నీషియన్20-33
హాస్పిటల్ అటెండర్లు18-33
హౌస్ కీపింగ్ అసిస్టెంట్.18-33

జీతం:

CMP-GDMO75,000/-
CMP స్పెషలిస్ట్ అబ్స్ట్ & గైనే / ఇంటెన్సివిస్ట్ / ఫిజిషియన్ / అనస్థెట్ ద్వీపాలు / రేడియాలజిస్ట్ / రేడియాలజిస్ట్95,000/-
మూత్రపిండ పున lace స్థాపన / హిమోడయాలసిస్ టెక్నీషియన్35,400/-
హాస్పిటల్ అటెండర్లు18,000/-
హౌస్ కీపింగ్ అసిస్టెంట్.18,000/-

ఎలా ఎంపిక చెయ్యడం జరుగుతుంది:

వాట్సప్ / టెలిఫోన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది
నోటిఫికేషన్ లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
Website
Notification
Apply Now