Sakshi
♦దూరదర్శన్‌లో అన్ని తరగతులకు రోజూ వీడియో పాఠాలు
♦ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో..
♦కోవిడ్ కారణంగా ఇంటి నుంచే నేర్చుకునేలా ఏర్పాట్లు
♦వారానికి ఒకరోజు స్కూళ్లకు టీచర్లు
🌻సాక్షి, అమరావతి: పాఠశాలలు ఆగస్టు 3 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోగా విద్యార్థులను ఆంగ్ల మాధ్యమానికి సన్నద్ధం చేసేందుకు వీలుగా బుధవారం నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. దూరదర్శన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ వీడియో పాఠాలు బోధించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. బ్రిడ్జి కోర్సులను విద్యార్థులకు వసతి సదుపాయాలతో నిర్వహించాలని తొలుత భావించినా కరోనా కారణంగా నిలిచిపోయింది. 2020–21 విద్యాసంవత్సరం నుంచి 1 – 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించి తదుపరి తరగతులను ఆపై ఏడాదుల్లో ఆంగ్ల మాధ్యమాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి విద్యాశాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే టీచర్లకు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై శిక్షణ కూడా పూర్తయింది.
♦నిర్దేశిత తేదీల్లో స్కూలుకు రావాలి..
► మొబైల్ నెట్‌వర్క్, టీవీలో పాఠాలు చూసే అవకాశం లేని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల ద్వారా బ్రిడ్జి కోర్సులు నేర్చుకొనేందుకు వీలుగా ప్రాథమిక పాఠశాలల టీచర్లు ప్రతి మంగళవారం పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభించి ప్రతి మంగళవారం పాఠశాలల్లో విద్యార్థుల నోట్ పుస్తకాలు, వర్కు పుస్తకాలను సరిచూసేందుకు తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీలకు సమాచారం అందించాలి. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా బ్రిడ్జి కోర్సు లెవెల్ – 1 లేదా బ్రిడ్జి కోర్సు లెవెల్ – 2 పుస్తకాలను విద్యార్థులకు అందించాలని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు.
► 6, 7వ తరగతి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు టీచర్లు 17 నుంచి ప్రతి బుధవారం హాజరు కావాలి.
► 8, 9వ తరగతుల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలలకు హాజరు కావాలి.
► పదో తరగతి బోధించే టీచర్లు ప్రతి బుధ, శుక్రవారాల్లో పాఠశాలలకు హాజరు కావాలి.
► వీడియో పాఠాలు నేర్చుకునే విద్యార్థుల నోట్ బుక్స్, వర్క్ బుక్స్‌ను టీచర్లు తనిఖీ చేసి మూల్యాంకనం చేయాలి.
♦రేపట్నుంచి ‘సప్తగిరి’లో..
► ఈ నెల 10 నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్లు అందుబాటులో ఉండనందున దూరదర్శన్ సప్తగిరి చానల్ ద్వారా బ్రిడ్జి కోర్సు పాఠాలను ప్రసారం చేయనున్నారు.
► దూరదర్శన్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు 1 – 5వ తరగతి విద్యార్థులకు, ఆ తర్వాత 2 గంటల నుంచి 3 వరకు 6, 7 తరగతులకు పాఠాలు ఉంటాయి. 3 నుంచి 4 గంటల వరకు 8, 9, 10వ తరగతులకు నిపుణులతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను రోజూ ప్రసారం చేయనున్నారు.
► జూలై నెల సిలబస్‌కు సంబంధించిన అంశాలన్నీ వీటిలో ఉంటాయి. రోజువారీ పాఠ్యాంశాల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది.
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
9, జూన్ 2020, మంగళవారం
🌻ఈనాడు, అమరావతి: Door Darshan Classes for Bridge Course
కరోనా నేపథ్యంలో విద్యార్థుల బోధనకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బుధవారం నుంచి 1-10తరగతులకు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. 1-5 తరగతులకు బ్రిడ్జి కోర్సు, 6-9 తరగతులకు సబ్జెక్టు పాఠాలను బోధిస్తారు. పిల్లలకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు వారానికోసారి ఉపాధ్యాయులు పాఠశాలలకు రానున్నారు. టీవీ పాఠాలపై ఏవైనా సందేహాలు వస్తే విద్యార్థులు ఆ రోజుల్లో పాఠశాలలకు రావచ్చు. 1-5 విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జి కోర్సు పుస్తకాలను మంగళవారం వారికి అందించనున్నారు. ఆంగ్ల మాధ్యమం విధానంలోనే ఆంగ్లం, గణితం, తెలుగు సబ్జెక్టులు బోధిస్తారు. 1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటలు, 3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు ఉంటాయి. 6-9 తరగతులకు అన్ని సబ్జెక్టులను బోధిస్తారు. 6, 7 తరగతులకు మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు, 8, 9 తరగతులకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు ప్రసారమవుతాయి. జూన్ నెల చివరి వరకు ఈ తరగతులు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు గంటల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
* 1-5 తరగతులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరుకావాలి.
* 6-7 తరగతుల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలలకు వెళ్లాలి.
* 8-9 తరగతులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలకు హాజరు కావాలి.
* పదో తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం బడులకు వెళ్లాల్సి ఉంటుంది.
* ఉపాధ్యాయులు విద్యార్థుల వర్క్‌షీట్లను మూల్యాంకనం చేయాలి.
* 1-5 తరగతులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరుకావాలి.
* 6-7 తరగతుల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలలకు వెళ్లాలి.
* 8-9 తరగతులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలకు హాజరు కావాలి.
* పదో తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం బడులకు వెళ్లాల్సి ఉంటుంది.
* ఉపాధ్యాయులు విద్యార్థుల వర్క్‌షీట్లను మూల్యాంకనం చేయాలి.
🌻అమరావతి, ఆంధ్రప్రభ: | Degree Colleges Should submit their details
రాష్ట్రంలో ఉన్న డిగ్రీ కళాశాల నీ తమ వివరాలను ఉన్నత విద్యామండలికి సమర్పించాలని కార్యదర్శి ప్రొ. బి. సుధీర్ ప్రేమ్ కుమార్ సూచించారు. వివరాలు కళాశాలలకు సమర్పించిన మాత్రమే అడ్మిషన్లు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ వివరాలు సమర్పించేందుకు ఈ నెల పదో తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 130 ప్రభుత్వడి గ్రీ కళాశాలలు, 105 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, 1015 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు వివరాలు సమర్పించాయని వివరించారు. ఇంకా 21 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 23 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, 188 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కళాశాలలు వివరాలు అందజేయాల్సి ఉందని పేర్కొన్నారు. కళాశాలలను ఆన్ లైన్ లో సూచించిన ఫార్మాట్ మేరకు తప్పనిసరిగా వివరాలు అందజేయాల్సి ఉంటుందని సూచించారు. అటానమస్ కళాశాలలు, మైనారిటీ కళాశాలలు కూడా ఈ నెల పదో తేదీ లోపు వివరాలు అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. అలా చేయని కళాశాలలు 2020- 21 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేపట్టడానికి వీలు ఉండదని ప్రొబి. సుధీర్ ప్రేమ్ కుమార్ స్పష్టం చేశారు.
🌻సాక్షి, అమరావతి: PG Medical Admission Date Extended
దేశవ్యాప్తంగా పీజీ వైద్య విద్య అడ్మి షన్ల గడువు జూలై 31 వరకు పొడిగించారు. కోవిడ్ కార లంగా తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో భారతీ య వైద్య మండలి అడ్మిషన్ల గుడువు పొడిగించాలని కో రుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ సుప్రీం కోర్టు ఆదేశించినట్టు భారతీయ వైద్య మండలి సోమవారం ప్రకటించింది.తాజా ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూడా పీజీ వైద్య విద్య అడ్మిషన్ల గడువు జూలై 31 వరకు పెంచారు.
🌻 అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి): | Food Safety Selection List
ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాను ఏపీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. అలాగే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ప్రొవిజినల్ అడ్మిటెడ్ జాబితాను కూడా విడుదల చేసింది. ఆయా అభ్యర్థులకు 1:2 నిష్ఫత్తిలో నడక, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. కమిషన్ వెబ్‌సైట్ తో పాటు నోటీసు బోర్డులో అభ్యర్థుల జాబితా ఉంచామని, వాకింగ్, మెడికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగేదీ త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్ కార్యదర్శి పి.ఎ్‌స.ఆర్.ఆంజనేయులు తెలిపారు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ప్రొవిజినల్ అడ్మిటెడ్ జాబితాను కూడా విడదుల చేసినట్లు పేర్కొన్నారు. ఆయా జాబితాలను కమిషన్ వెబ్‌సైట్ (https://psc.ap.gov.in)లో అందుబాటులో ఉంచారు.
☝️అమరావతి, జూన్ 8(ఆంధ్రజ్యోతి) | One Fee Structure in Degree Colleges
రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో ఒకే తరహా ఫీజు విధానం అమల్లోకి రానుంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల కాలానికి కొత్త ఫీజులను ఖరారు చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సిద్ధమవుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఫీజుల్లో వ్యత్యాసం ఉండరాదన్న ఉద్దేశంతో కమిషన్ ఏకరూప ఫీజును నిర్ణయించాలని నిశ్చయించింది. మరో వారం రోజుల్లో కొత్త ఫీజుల నిర్ణయ ప్రక్రియ పూర్తి చేయనుంది. రాష్ట్రంలో మొత్తం 1,441 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 1,153 ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ కాలేజీలు, 137 ఎయిడెడ్ కాలేజీలు, 151 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ఎయిడెడ్, ప్రభుత్వ కాలేజీలకు కళాశాల విద్య కమిషనరేట్(సీసీఈ) ఫీజులను నిర్ణయిస్తుంది. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలకు మాత్రం తొలిసారిగా ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ ఫీజులను నిర్ణయించనుంది. ఒకేతరహా ఫీజు ఎలా ఉండాలన్న దానిపై రెండు రకాలుగా ఆలోచనలు పరిశీలనలో ఉన్నాయని కమిషన్ సెక్రెటరీ ఎన్.రాజశేఖరరెడ్డి తెలిపారు. ఒకటి.. రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు ఒకే రకమైన ఫీజును నిర్ణయించడం. రెండోది.. కాలేజీలను రెండు లేదా మూడు కేటగిరీలుగా విభజించి ఫీజులను నిర్ణయించడమని చెప్పారు.
🤝♦సంక్షేమం’లో సరికొత్త ఒరవడి | AP Govt. Services becoming fast
🔸సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలపరిమితితో అర్హులందరికీ అందించే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు
🔹ఈ కొత్త విధానం ప్రకారం..దరఖాస్తు చేసిన పదిరోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తారు.
► ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందనున్నాయి. లబ్ధిదారుల జాబితా, అర్హతలు, లబ్ధిపొందే విధానం వంటి వివరాలను అక్కడ ఏర్పాటుచేస్తారు.
► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితిలో పరిశీలన పూర్తిచేస్తారు. వాటికి సంబంధించిన సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందజేస్తారు.
► ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులను 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చు.
► వ్యవసాయ అనుబంధ సేవలకు 1907కు, టెలి మెడిసిన్ సేవలకు 14410, అవినీతిపై ఫిర్యాదులు 14400, దిశ 181, మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా, ఇసుకపై ఫిర్యాదులను 14500కు ఫోన్ చేయవచ్చు.
🔹ఈ కొత్త విధానం ప్రకారం..దరఖాస్తు చేసిన పదిరోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి అప్పగిస్తారు.
► ప్రధాన సేవలతోపాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందనున్నాయి. లబ్ధిదారుల జాబితా, అర్హతలు, లబ్ధిపొందే విధానం వంటి వివరాలను అక్కడ ఏర్పాటుచేస్తారు.
► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వలంటీర్లు నిర్దిష్ట కాలపరిమితిలో పరిశీలన పూర్తిచేస్తారు. వాటికి సంబంధించిన సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందజేస్తారు.
► ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులను 1902 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చు.
► వ్యవసాయ అనుబంధ సేవలకు 1907కు, టెలి మెడిసిన్ సేవలకు 14410, అవినీతిపై ఫిర్యాదులు 14400, దిశ 181, మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా, ఇసుకపై ఫిర్యాదులను 14500కు ఫోన్ చేయవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...