Alerts

Loading alerts...

11, డిసెంబర్ 2020, శుక్రవారం

*✍️NIRDPR- హైద‌రాబాద్‌లో 510 జాబ్స్‌.✍️*


 
హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ ‌(ఎన్ఐఆర్‌డీపీఆర్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 510 స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌, యంగ్ ఫెలో, క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. దేశ‌వ్యాప్తంగా క్ల‌స్ట‌ర్ మోడ‌ల్ గ్రామ‌పంచాయ‌తీలను అభివృద్ధి చేయడంలో భాగంగా భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఎన్ఐఆర్‌డీపీఆర్ ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 29 తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు http://nirdpr.org.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 *మొత్తం ఖాళీలు: 510* 

 *1) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్ ‌- 10 పోస్టులు* 

 *2) యంగ్ ఫెలో - 250 పోస్టులు* 

 *3) క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ ‌- 250 పోస్టులు* 

 *1) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌:* 

 *విధులు:* ఈ పోస్టులకు ఎంపికైన వారు క‌్ల‌స్ట‌ర్‌ మోడ‌ల్ గ్రామ‌పంచాయ‌తీల ఏర్పాటులో భాగంగా ఎంపిక చేసిన గ్రామ‌పంచాయ‌తీల‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను క్షేత్ర స్థాయిలో మానిట‌రింగ్ చేయాల్సి ఉంటుంది.

 *అర్హ‌త‌:* సోష‌ల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ (ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీస అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం. ప‌దో త‌ర‌గ‌తిలో 60%, ఇంట‌ర్మీడియ‌ట్‌లో 50%, గ్రాడ్యుయేష‌న్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో 50% మార్కులు ఉండాలి.

 *వ‌య‌సు:* 01.11.2020 నాటికి 30-50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ&ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

 *జీతభ‌త్యాలు:* నెల‌కు రూ.55 వేలు ఉంటుంది. దీనితో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ‌, ఇత‌ర ఖర్చుల‌ను చెల్లిస్తారు.

 *2) యంగ్ ఫెలో:* 

 *విధులు:* క్షేత్రస్థాయిలో గ్రామ‌పంచాయ‌తీల‌కు వెళ్లి వివిధ శాఖ‌ల‌ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి వారికి గ్రామ‌పంచాయ‌తీ ప‌నుల‌ను వివ‌రిస్తూ.. వారితో క‌లిసి అభివృద్ధి ప‌నుల్లో పాల్గొన‌డం వీరు చేయాల్సిన పని.

 *అర్హ‌త‌:* సోష‌ల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీస అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం. ప‌దో త‌ర‌గ‌తిలో 60%, ఇంట‌ర్మీడియ‌ట్‌లో 50%, గ్రాడ్యుయేష‌న్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో 50% మార్కులు ఉండాలి.

 *వ‌య‌సు:* 01.11.2020 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎస్సీ & ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

 *జీతభ‌త్యాలు:* నెల‌కు రూ.35 వేలు ఉంటుంది. దీనితో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ‌, ఇత‌ర ఖర్చుల‌ను చెల్లిస్తారు.

 *3) క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్‌:* 

 *విధులు:* వీళ్లు వార్డు స్థాయిలో ప్ర‌జల్ని గ్రామంచాయ‌తీ విధుల్లో (గ్రామ ‌స‌భ‌, వార్డ్ స‌భ‌, మ‌హిళా స‌భ‌)పాల్గొనేలా వారిని చైత‌న్య‌వంతుల్ని చేయ‌డం.

 *అర్హ‌త‌:* ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో ప‌ని చేసిన అనుభ‌వం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా ప‌ని చేసి ఉండ‌డం/ ఎన్ఐఆర్‌డీపీఆర్‌/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత స‌ర్టిఫికెట్ ప్రోగ్రాములు చేసి ఉండాలి.

 *వ‌య‌సు:* 01.11.2020 నాటికి 25-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎస్సీ & ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

 *జీతభ‌త్యాలు:* నెల‌కు రూ.12,500 ఉంటుంది. దీనితో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ‌, ఇత‌ర ఖర్చుల‌ను చెల్లిస్తారు.

 *ముఖ్య సమాచారం:* 

 *ద‌ర‌ఖాస్తు విధానం:* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

 *ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది:* డిసెంబర్‌ 29, 2020.

 *ఎంపిక:*  ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

 *వెబ్‌సైట్‌* : http://nirdpr.org.in/


TTD News

వయోవృద్ధులకు,చంటి పిల్లకు టీటీడీ శుభావార్త

         కోవిడ్-19 నేప‌థ్యంలో లాక్‌డౌన్ అనంత‌రం 2020 జూన్ 8వ తేదీ నుండి వివిధ సంస్థ‌ల‌ను తిరిగి తెర‌వ‌డానికి భార‌త ప్ర‌భుత్వం ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. 65 సంవ‌త్స‌రాలు పైబ‌డిన‌వారు, అనారోగ్యంతో ఉన్నవారు, గ‌ర్భిణులు, ప‌దేళ్ల కంటే త‌క్కువ వ‌య‌సుగ‌ల వారు అత్య‌వ‌స‌రమైతే త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించింది.

        అయితే, 65 ఏళ్లు పైబ‌డినవారికి, 10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని భారీ సంఖ్య‌లో మెయిల్స్ ద్వారా టిటిడికి అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్నాయి. డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో కూడా అనేక మంది ఈ విష‌యంపై అభ్య‌ర్థిస్తున్నారు. ద‌ర్శ‌నానికి సంబంధించిన అభ్య‌ర్థ‌న‌ల్లో చాలావ‌ర‌కు చిన్న‌పిల్ల‌ల కేశఖండ‌న‌, చెవిపోగులు కుట్టడం, అన్న‌ప్రాస‌న‌, ష‌ష్టిపూర్తి చేసుకున్న‌వారు, 70-80 సంవ‌త్స‌రాల శాంతి చేసుకున్నవారు ఉంటున్నారు. ఇది భ‌క్తుల ఆచారాలు, సంప్ర‌దాయాలు, మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉన్న అంశం. ఈ కార‌ణాల రీత్యా 65 ఏళ్లు పైబ‌డిన వారు, ప‌దేళ్ల లోపు వారు కోవిడ్‌-19 సూచ‌న‌లు పూర్తిగా దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్యప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుని త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో వారి సొంత నిర్ణ‌యం మేర‌కు స్వామివారి ద‌ర్శ‌నానికి రావ‌చ్చు. అయితే, ముంద‌స్తుగా ద‌ర్శ‌న టికెట్ల బుక్ చేసుకోవాలి. ద‌ర్శ‌న టికెట్లు క‌లిగిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు. ఇలాంటి వారి కోసం ఎలాంటి ప్ర‌త్యేక క్యూలైన్లు ఉండ‌వని తెలియ‌జేయ‌డ‌మైన‌ద

Name of the Post: AP Grama/ Ward Volunteer (West Godavari & Vizag) Online Form 2020


Post Date: 28-08-2020

Latest Update: 11-12-2020

Total Vacancy: 7444

Brief Information: Dept of Gram/ Ward Volunteers & Village/ Ward Secretariat, AP has announced notification for the recruitment of GramaWard Volunteer vacancies. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.

Interested Candidates Can Read the Full Notification Before Apply Online
Important Links
Interview Date & InformationClick here
Download Submitted ApplicationClick here
Apply OnlineClick here
Detailed NotificationClick here
Newspaper NotificationClick here
Official WebsiteClick Here

G K Bits

 

1). ఈ క్రింది తేదీలలో ఏ తేదీని  ఐక్య రాజ్య సమితి దినోత్సవం గా పరిగణిస్తారు?

A). అక్టోబర్ 21

B). అక్టోబర్ 22

C). అక్టోబర్ 23

D). అక్టోబర్ 24

సమాధానం : D ( అక్టోబర్ 24 ).

2). పంచశీల ఒప్పందం 1954 వ సంవత్సరంలో  మే 29వ తేదీన  జరిగింది.అయితే ఈ పంచశీల ఒప్పందం ఏ యే దేశాల మధ్య జరిగినది?

A) భారత్ – అమెరికా

B). భారత్ – చైనా

C). భారత్ – రష్యా

D). భారత్ – పాకిస్తాన్

సమాధానం : B ( భారత్ – చైనా ).

3). ఈ క్రింది వానిలో బంగ్లాదేశ్ కరెన్సీ ఏది?

A). డాలర్

B). యెన్

C). రూపాయి

D). టాకా

సమాధానం : D ( టాకా ).

4). దేవనాం ప్రియ, ప్రియదర్శి అనే బిరుదులు క్రింది వారిలో ఎవరికీ కలవు?

A).అశోకుడు

B). కనిష్కుడు

C).వసుమిత్రుడు

D). అశ్వఘోషుడు

సమాధానం : A ( అశోకుడు ).

5). క్రింది వారిలో ‘ ప్లాస్టిక్  సర్జరీ ‘ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?

A). చరకుడు

B). సుశ్రుతుడు

C). సిసిరో

D). ముత్తుస్వామి దీక్షితార్

సమాధానం : A ( చరకుడు ).

6). 1919 వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన స్థలం?

A).అలెప్పి (కేరళ )

B). అమర్ కంటక్ (మధ్యప్రదేశ్ )

C). అంబాలా ( హర్యానా )

D). అమృత్ సర్ ( పంజాబ్ )

సమాధానం : D ( అమృత్ సర్ -పంజాబ్ ).

7). ఈ క్రింది నగరాలలో పింక్ సిటీ అని ఏ నగరమును పిలుస్తారు?

A). మదురై ( తమిళనాడు )

B). జంషెడ్ పూర్ ( జార్ఖండ్ )

C). జై పూర్ ( రాజస్థాన్ )

D). సారనాధ్ ( ఉత్తరప్రదేశ్ )

సమాధానం : C ( జైపూర్ – రాజస్థాన్ ).

8). భారత జాతీయ గీతం జనగణమన ను పూర్తిగా ఆలపించడానికి పట్టే పూర్తి సమయం?

A).20 సెకన్లు

B).52 సెకన్లు

C).60 సెకన్లు

D).118 సెకన్లు

సమాధానం : B ( 52 సెకన్లు )

9). ఈ క్రింది వానిలో భారతదేశ జాతీయ నది?

A). గోదావరి

B). కృష్ణా

C). బ్రహ్మపుత్ర

D). గంగా

సమాధానం : D ( గంగా ).

10).రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు?

A). సచిన్ టెండూల్కర్ ( క్రికెట్ )

B). విశ్వనాథన్ ఆనంద్ ( చెస్ )

C). అభినవ్ బింద్రా ( షూటింగ్ )

D). పుల్లెల గోపీచంద్ ( బాడ్మింటన్ )

సమాధానం : B ( విశ్వనాథన్ ఆనంద్ ).

11). ఈ క్రింది వారిలో పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికీ కలదు?

A). భగత్ సింగ్

B). సుభాష్ చంద్ర బోస్

C). లాలా లజపతి రాయ్

D). దాదాబాయ్ నౌరోజీ

సమాధానం : B ( సుభాష్ చంద్ర బోస్ ).

12).క్రింది వానిలో డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు చెందినది?

A). క్రికెట్

B). వాలీబాల్

C). బాడ్మింటన్

D). ఫుట్ బాల్

సమాధానం : D ( ఫుట్ బాల్ ).

13). ధ్యాన్ చంద్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది?

A). ఫుట్ బాల్

B). హాకీ

C). క్రికెట్

D). బాడ్మింటన్

సమాధానం : B ( హాకీ ).

14). ప్రపంచంలో అతి లోతైన సరస్సు పేరు బైకాల్ సరస్సు. ఈ  బైకాల్ సరస్సు  ఏ దేశంలో కలదు?

A).రష్యా

B).ఇరాన్

C). కెనడా

D). టాంజనియా

సమాధానం : A ( రష్యా ).

15). గిర్ జాతీయ పార్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది?

A). గుజరాత్

B). మహారాష్ట్ర

C). అస్సాం

D). మేఘాలయ

సమాధానం : A ( గుజరాత్ ).

కరెంట్ అఫైర్స్ -2020 మోడల్ బిట్స్ :

1).అస్సాం రాష్ట్రంలోని గువాహటి లో జనవరి 10వ తేదీన ప్రారంభం అయిన మూడవ సీజన్ ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో మొదటి స్థానమును దక్కించుకున్న రాష్ట్రం?

A). ఆంధ్రప్రదేశ్

B). బీహార్

C). సిక్కిం

D). మహారాష్ట్ర

సమాధానం : D ( మహారాష్ట్ర ).

2).50 వ ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ )వార్షిక సదస్సు 2020 జనవరి 21 నుండి 24వరకూ ఏ దేశంలో నిర్వహించారు?

A). అమెరికా

B). రష్యా

C). చైనా

D).స్విట్జర్లాండ్

సమాధానం : D ( స్విట్జర్లాండ్ ).

3).రైల్వే ఆస్తులను, భద్రతను పర్యవేక్షించే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) పేరును ఇటీవల భారతీయ రైల్వే ఏ విధంగా మార్చినది?

A). రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్

B).రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్

C).రైల్వే ప్రొటెస్ట్ సర్వీస్

D). రైల్వే ప్రొటెక్షన్ బోర్డ్ సర్వీస్

సమాధానం : A ( రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ -RPFS ).

4). భారత వాయుసేనలో బహదూర్ గా పేరు పొందిన అతి శక్తివంతమైన యుద్ధ విమానాలకు భారత వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈ అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం పేరు?

A). మిగ్ -21

B). మిగ్ -25

C). మిగ్ -27

D). మిగ్ -29

సమాధానం :  D ( మిగ్ -27 ).

5).భారత దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత రెండవ అతిపెద్ద మెట్రో రైల్ నెట్ వర్క్ గా క్రింది ఏ నగరపు మెట్రో రికార్డు సృష్టించింది?

A). బెంగళూరు మెట్రో

B). హైదరాబాద్ మెట్రో

C). చెన్నై మెట్రో

D). కలకత్తా మెట్రో

సమాధానం : B ( హైదరాబాద్ మెట్రో ).

6). ఇటీవల టామ్ 2 అనే సంస్థ వెల్లడించిన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో ఈ క్రింది ఏ భారతదేశ నగరం తొలిస్థానంలో నిలిచింది?

A). హైదరాబాద్

B). న్యూ ఢిల్లీ

C). చెన్నై

D). బెంగళూరు

సమాధానం : D (బెంగళూరు ).

7). రష్యా దేశాధ్యక్ష పీఠంపై ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుదీర్ఘ కాలం వరకూ కొనసాగేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సంస్కరణలకు ఇటీవలే రష్యా ప్రజలు తమ ఆమోదాన్ని తెలిపారు.ఈ క్రమంలో పుతిన్ ఏ సంవత్సరం వరకు రష్యా దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు?

A).2025

B).2035

C).2036

D).2042

సమాధానం : C ( 2036 ).

8).భారతదేశ 13వ రాష్ట్రపతిగా సేవలు అందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో ఆగష్టు 31వ తేదీన మరణించారు. అయితే భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ కీ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ను ప్రకటించింది?

A).2015

B).2017

C).2019

D).2020

సమాధానం : C ( 2019 ).

9). జమ్మూ కాశ్మీర్ లో నిర్మిస్తున్న  ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఆగష్టు 2022 కు పూర్తయ్యే అవకాశం ఉంది.అయితే ఈ వంతెనను జమ్మూ కాశ్మీర్ లో ఏ నది పై నిర్మిస్తున్నారు?

A). గంగోత్రి

B). రావి

C). చీనాబ్

D). సట్లైజ్

సమాధానం : C ( చీనాబ్ ).

10).ఇటీవల పుస్తక విక్రయ రంగంలో ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన పుస్తకంగా ” ఏ ప్రామిస్డ్ ల్యాండ్ ” అనే పుస్తకం నూతన రికార్డులను సృష్టిస్తోంది. అయితే క్రింది వారిలో ఎవరు “ఏ ప్రామిస్డ్ ల్యాండ్” పుస్తకాన్ని రచించారు?

A). డోనాల్డ్ ట్రంప్

B). జో బైడెన్

C). జై శంకర్

D). బరాక్ ఒబామా

సమాధానం : D ( బరాక్ ఒబామా ).

11.మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్ లో  ఇటీవల 10 లక్షల ట్విట్టర్ ఫాలోయర్స్ కలిగిన  తొలి బ్యాంకుగా  రికార్డును సృష్టించిన బ్యాంకు ఏది?

A).రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా

B). మెక్సికో సెంట్రల్ బ్యాంకు

C). బ్యాంకు ఆఫ్ ఇండోనేషియా

D). అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు

సమాధానం : A ( రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ).

12). సముద్రయాన రంగంలో దేశీయ సాంకేతిక ప్రాబల్యాన్ని పెంచేలా  నూతనంగా హైటెక్ ఓడను ఆవిష్కరించిన పరిశోధకులు ఏ ఐఐటీ కీ చెందినవారు?

A). ఐఐటీ ఖరగ్ పూర్

B). ఐఐటీ బెంగళూరు

C). ఐఐటీ మద్రాస్

D). ఐఐటీ ఢిల్లీ

సమాధానం : C ( ఐఐటీ మద్రాస్ ).

13).2023 వ సంవత్సరంలో G-20 సమ్మిట్ ను ఈ క్రింది వానిలో ఏ దేశం నిర్వహించబోతుంది?

A). రష్యా

B). ఇండియా

C). యూ ఎస్ ఏ

D). యూ ఏ ఈ

సమాధానం : B ( ఇండియా ).

14). నవంబర్ 23,2020 న WWE కు వీడ్కోలు పలికిన ప్రముఖ ప్లేయర్ ఎవరు?

A).ట్రిపుల్ హెచ్

B). కాన్ విల్లియమ్స్

C). అండర్ట్  కేర్

D).జాన్ సేనా

సమాధానం : C ( అండర్ట్ కేర్ ).

15). ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్( ఐఎస్ఎల్ ) 7వ సీజన్  నవంబర్ 20,2020 న భారత్ లో  ఎక్కడ ప్రారంభం అయ్యాయి?

A). మధ్య ప్రదేశ్

B). ఉత్తర ప్రదేశ్

C). ఆంధ్రప్రదేశ్

D). గోవా

సమాధానం : D ( గోవా ).

 

🔳ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

 (India Exim Bank) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ).
పని విభాగాలు :    ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్‌, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ,కార్పొరేట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌/ ప‌్రాజెక్ట్ ట్రేడ్‌/ క‌్రెడిట్ ఆడిట్‌, లా, హ్యూమ‌న్ రిసోర్సెస్‌.
ఖాళీలు :    60
అర్హత :    మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ):క‌నీసం 60% మార్కుల‌తో కంప్యూట‌ర్ సైన్స్‌/ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌లో బీఈ/ బీటెక్/ క‌నీసం 60% మార్కుల‌తో ఏదైనా గ్రాడ్యుయేష‌న్ అండ్ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ (లా):క‌నీసం 60% మార్కుల‌తో లా/ ఎల్ఎల్‌బీలో డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్‌‌): క‌నీసం 60% మార్కుల‌తో ఎక‌న‌మిక్స్‌లో పీజీ డిగ్రీ (ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రేడ్‌/ ఫైనాన్షియ‌ల్ ఎక‌న‌మిక్స్‌/ ఇండ‌స్ట్రియ‌ల్ ఎక‌న‌మిక్స్‌/ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎక‌న‌మిక్స్‌) ఉత్తీర్ణ‌త‌.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ (హ్యూమ‌న్ రిసోర్సెస్‌) క‌నీసం 60% మార్కుల‌తో ఏదైనా పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు డిప్లొమా/ డిగ్రీ(హెచ్ఆర్‌/ ప‌ర్స‌న‌ల్ మేనేజ్‌మెంట్‌) ఉత్తీర్ణ‌త‌.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ(కార్పొరేట్ లోన్స్/ క‌్రెడిట్ ఆడిట్):ఫైనాన్స్ స్పెష‌లైజేష‌న్‌తో ఎంబీఏ/ పీజీడీబీఏ‌/ చార్టెడ్ అకౌంట్స్‌(సీఏ) ఉత్తీర్ణ‌త.
వయసు :    జనరల్ : 25 ఏళ్లు మించకుడదు.
ఓబీసీ: 28 ఏళ్లు మించకుడదు.
ఎస్సీ/ ఎస్టీ:30 ఏళ్లు మించకుడదు.
వేతనం :    రూ. 40,000 /- 1,80,000/-
ఎంపిక విధానం:    రాత‌ప‌రీక్ష‌ / ‌ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:    ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 600/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    డిసెంబర్ 19, 2020.
దరఖాస్తులకు చివరితేది:    డిసెంబర్ 31, 2020.

https://www.eximbankindia.in/

APSSDC Jobs Recruitment 2020 || ఆర్చ్ లేబరటరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొండపల్లిలో ఉద్యోగాలకు ఉచిత ఉపాధి శిక్షణకు ప్రకటన జారీ

 

ఆర్చ్ లేబరటరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొండపల్లి లో ఉద్యోగాలకు ఉచిత ఉపాధి శిక్షణకు ప్రకటన :

APSSDC ఇండస్ట్రీ కస్టమైజ్డ్  ట్రైనింగ్ ప్లేస్ మెంట్ కార్యక్రమం లో భాగంగా  ఏపీ  లో ఉన్న కొండపల్లి ఫార్మా సెక్టార్ కీ చెందిన ఆర్చ్ లేబరటరీ ప్రయివేట్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో  ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణను ఇవ్వనున్నారు.

అభ్యర్థులు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్ కు చివరి తేదీడిసెంబర్ 13,2020

విభాగాల వారీగా ఉద్యోగాలు :

ప్రొడక్షన్ కెమిస్ట్

క్వాలిటీ కంట్రోలర్ / క్వాలిటీ అనలిస్ట్

సర్టిఫైడ్ బాయిలర్ ఆపరేటర్

అర్హతలు :

ఈ ఉద్యోగాల ఉపాధి శిక్షణలకు హాజరు కాబోయే అభ్యర్థులు కెమిస్ట్రీ విభాగంలో బీ. ఎస్సీ / ఎం. ఎస్సీ లను పూర్తి చేయాలి. సంబంధిత విభాగాలలో ఐటీఐ / డిప్లొమో కోర్సులను పూర్తి చేయాలి.

వయసు :

ఈ ఉచిత  ఉపాధి శిక్షణలకు 30సంవత్సరాలు లోపు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

ఉచిత శిక్షణ వ్యవధి :

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులకు రెండు వారాల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ వ్యవధిలో అభ్యర్థులకు ఉచిత భోజన మరియు వసతి సౌకర్యం కల్పించనున్నారు.

Register Link

అభ్యర్థులు ఈ ఉద్యోగ ఉపాధి శిక్షణలకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ క్రింది ఫోన్ నంబర్స్ ను సంప్రదించవచ్చు.

ఫోన్ నంబర్స్ :

18004252422

8501896034

6305004318

Railway Exam Admit Cards Download Link || రైల్వే పరీక్షకు సంబందించి హల్‌టికెట్లు విడుదల

 

రైల్వే మినిస్టిరియల్ ఐసోలెటెడ్ కేటగిరికి సంబందించిన హల్‌టికెట్లు విడుదల కావడం జరిగింది.

క్రింద ఇవ్వబడిన లింక్ ని ఉపయోగించి అభ్యర్థులు హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.

మరింత సమాచరం అభ్యర్థులు లాగిన్ అయిన తరువాత తెలుస్తుంది.

హల్‌టికెట్లు వచ్చినప్పుడు క్రింద ఇవ్వబడిన వెబ్‌సైట్ లోనికి వెళ్ళి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.

Website Link

Hall Ticket Download Link

NTPC కి సంబందించి అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రెండు రాష్ట్రాల అభ్యర్థులు NTPC పరీక్ష పై ఏ ప్రకటన వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

అయితే వారికి హల్‌టికెట్ల డౌన్‌లోడ్ పై ప్రకటన రావడం జరిగింది.

రైల్వే NTPC పరీక్ష డిసెంబర్ 28 న జరగనుంది. అయితే పరీక్షకు 10 రోజుల ముందు నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అంటే డిసెంబర్ 18 ( శుక్రవారం) నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.


Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...