అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
21, జనవరి 2021, గురువారం
SKUCET Update
*💁♀️పజీ ప్రవేశాలకు పాత రుసుములే..*
🍁ఎస్.కె.విశ్వవిద్యాలయం:
*🔰శరీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్, రుసుములు ఖరారు చేశారు. బుధవారం ఎస్కేయూ ప్రవేశాల సలహామండలి సమావేశం ఉపకులపతి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన గడువు ముగిసింది. ఎస్కేయూ సెట్ ద్వారా మొత్తం 4,142మంది విద్యార్థులు అర్హత సాధించగా 2,178మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,964 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. ఎస్కేయూ సెట్-2020 ద్వారా అర్హత పొంది ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ కోర్సులకు గతంలో (ఎస్కేయూ సెట్-2019) ఉన్న ఫీజులు ఖరారు చేశారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఆయా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్ఛు వెబ్ ఆప్షన్లు www.skudoa.in వెబ్‌సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకోవాలి. సమావేశంలో రిజిస్ట్రార్ వెంకటరమణ, సైన్సు, ఆర్ట్స్ కళాశాలల ప్రధానాచార్యులు శంకర్‌నాయక్, విజయ్‌కుమార్, ప్రవేశాల సంచాలకులు తిమ్మానాయక్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్స్ చింతా సుధాకర్, సీడీసీ డీన్ విజయకృష్ణనాయుడు, పాలకమండలి సభ్యులు శోభాలత, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసన్ పాల్గొన్నారు.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
APEAMCET 2nd Phase Weboptions
*🔰ఎంసెట్-2020 ఇంజనీరింగ్ విభాగపు రెండో దశ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభంకానుంది. ఎంసెట్ ర్యాంకర్లు ఈ నెల 21 నుంచి 23 వరకు వెబ్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 25న సీట్లు కేటాయిస్తారు. ఎంసెట్-2020 (ఎంపీసీ స్ట్రీమ్) మొదటి విడత సీట్ల కేటాయింపు ఈ నెల 3న పూర్తయింది. తొలిదశలో భర్తీ కాకుండా మిగిలిన సీట్లు, సీటు దక్కినా రిపోర్టు చేయని వారి సీట్లను రెండో దశ కౌన్సెలింగ్‌లో చూపిస్తారు.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
*💁♀️25 నుంచి ఏపీ ఐసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్..*
*🔰ఏపీ ఐసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ ఈ నెల 25న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ గురువారం వెలువడనుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు గడువు 31గా నిర్ణయిం చారు. ఫిబ్రవరి రెండో తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. వివరాలకు https//apicet.nic.in 'ను సందర్శించాలని కన్వీనర్ నాయక్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
*2️⃣💁♀️బపీటీ, బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్..*
🍁లబ్బీపేట (విజయవాడ తూర్పు) :
*🔰డక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పరిధి లోని కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ (నర్సింగ్) నాలుగేళ్ల డిగ్రీ కోర్సు, బీపీటీ(ఫిజియోథెరపీ), బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ, పోస్ట్ బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) రెండేళ్ల డిప్లమో కోర్సుల్లో అడ్మిషన్లకు గాను బుధవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు గురువారం సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి ఐదో తేదీ సాయంత్రం 4 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు వర్సిటీ వెబ్ సైట్ ను సంప్రదించాలి.*
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...