ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో ఉన్న అమర్ రాజా గ్రూప్స్ లో ఖాళీగా ఉన్న మెషిన్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి గాను ప్రకటన విడుదల అయ్యింది
ఎటువంటి పరీక్షలు లేకుండా, అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేది | ఫిబ్రవరి 7,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
మెషిన్ ఆపరేటర్స్ | 700 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తిర్ణులు అయి ఉండవలెను. ఇంటర్మీడియట్ పాస్ /ఫెయిల్ మరియు ఐటీఐ (ఎనీ గ్రేడ్ ) అర్హతలు గా గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
డిప్లొమా /డిగ్రీ /బీ. టెక్ కోర్సు లను మధ్యలో నిలిపివేసిన డ్రాప్ఔట్స్ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు గల పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
హెచ్ ఆర్ ఇంటర్వ్యూ విధానం ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 10,500 రూపాయలు వరకూ జీతం లభించునున్నది.
జీతము తో పాటు భోజన మరియు వసతి, ట్రాన్స్ పోర్ట్ సౌకర్యలను కూడా కల్పించనున్నారు.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :
అమర్ రాజా గ్రోత్ కారిడార్,
మూర్తన పల్లి (గ్రామం ),
బంగారు పాలెం (మండలం ),
చిత్తూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్స్ :
6303578886
9676165850
1800-425-2422