10, ఆగస్టు 2021, మంగళవారం

APPECET 2021 ఏపీపీఈసెట్‌–2021 ప్రవేశాలు | ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 06.08.2021 | పరీక్ష తేది: 24.09.2021



గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ.. ఆంధ్రప్రదేశ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీపీఈసెట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
Adminissions  
ప్రవేశం కల్పించే కోర్సులు: బీపీఈడీ(రెండేళ్లు), యూజీడీపీఈడీ(రెండేళ్లు).

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 06.08.2021

పరీక్ష తేది: 24.09.2021

పూర్తి వివరాకలు వెబ్‌సైట్‌: www.sche.ap.gov.in

ఏఎన్‌యూలో టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ).. టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 07

పోస్టుల వివరాలు: టీచింగ్‌ పోస్టులు – 03, నాన్‌ టీచింగ్‌ పోస్టులు – 04.
టీచింగ్‌ పోస్టులు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(రూరల్‌ డెవలప్‌మెంట్, కంప్యూటర్‌ సైన్స్‌) అసోసియేట్‌ ప్రొఫెసర్‌(ఇంగ్లిష్‌).
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌/స్లెట్‌/సెట్‌ అర్హత ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

నాన్‌ టీచింగ్‌ పోస్టులు: స్వీపర్, క్లీనర్, యుటెన్సిల్‌ క్లీనర్, మార్కర్‌.
అర్హత: మార్కర్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. మిగతా పోస్టులకు సంబంధిత పని అనుభవంతోపాటు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వేతనం: నెలకు రూ.13,000 నుంచి రూ.40,270 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.anu.ac.in.

గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజ్, నెల్లూరులో ఖాళీలు | దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఏపీ ప్రభుత్వ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజ్‌.. అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs  
మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: వాచ్‌మెన్‌–02, క్లీనర్‌/వ్యాన్‌ అటెండెంట్‌–01, ఆయాలు–01, స్వీపర్లు–01, ల్యాబ్‌ అటెండెంట్లు–01, కుక్స్‌–03, కిచెన్‌ బాయ్‌/టేబుల్‌ బాయ్‌–02, తోటీ/స్వీపర్‌–02.
అర్హత: ల్యాబ్‌ అటెండెంట్‌ పోస్టుకు పదో తరగతి, మిగతా అన్ని పోస్టులకు ఐదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తును ఆఫీస్‌ ఆఫ్‌ ది ప్రిన్సిపల్, గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్, నెల్లూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://spsnellore.ap.gov.in/

ఆంధ్రా యూనివర్సిటీలో యోగా డిప్లొమా కోర్సులో ప్రవేశాలు | దరఖాస్తులకు చివరి తేది: 11.08.2021


విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌.. యోగాలో ఆరు నెలల పార్ట్‌టైం ఆన్‌లైన్‌ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Adminissions 
కోర్సు వ్యవధి: ఆరు నెలలు
మొత్తం సీట్ల సంఖ్య: 60.
అర్హత: ఇంటర్మీడియట్‌/10+2/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: వయసుతో సంబంధం లేదు.

ఎంపిక విధానం: ఇంటర్‌లో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్, ఆంధ్రా యూనివర్సిటీ, విజయనగర్‌ ప్యాలెస్, పెద్ద వాల్తేరు, విశాఖపట్నం –530003 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 11.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.audoa.in

DMHO, Kurnool Recruitment 2021 Medical Officer, Lab Technician, Specialist MO & Other – 36 Posts Last Date 12-08-2021



Name of Organization Or Company Name :District Medical & Health Officer,Kurnool , Kurnool


Total No of vacancies: – 36 Posts


Job Role Or Post Name:Medical Officer, Lab Technician, Specialist MO & Other


Educational Qualification:10+2, GNM/ Degree, MBBS, PG Degree/ Diploma (Relevant Discipline)


Who Can Apply:Andhra Pradesh


Last Date:12-08-2021


Click here for Official Notification


బీఈసీఐఎల్‌–ఏఐఐఏ, న్యూఢిల్లీలో 162 పోస్టులు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.08.2021 | ఎంపిక విధానం: టెస్ట్‌/రాతపరీక్ష/ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు


న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బీఈసీఐఎల్‌).. ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ) లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 162
పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, రీసెర్చ్‌ అసోసియేట్, రీసెర్చ్‌ కోఆర్డినేటర్, సైంటిస్ట్, బయో మెడికల్‌ ఇంజనీర్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజిస్ట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌(పీఆర్‌ఓ) తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.15,492 నుంచి రూ.1,23,100 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: టెస్ట్‌/రాతపరీక్ష/ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.08.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.becil.com

బెల్, బెంగళూరులో 511 ఖాళీలు | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021| ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.


బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 511
పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్లు–308, ప్రాజెక్ట్‌ ఇంజనీర్లు–203.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్‌టైం బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులకు ఫ్రెషర్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 01.08.2021 నాటికి ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులకుS 25ఏళ్లు, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు 28ఏళ్లు మించకూడదు.
వేతనం: ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులకు మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది నెలకు రూ.28,000, మూడో ఏడాది నెలకు రూ.31,000 చెల్లిస్తారు. ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులకు మొదటి ఏడాది నెలకు రూ.35,000, రెండో ఏడాది నెలకు రూ.40,000, మూడో ఏడాది నెలకు రూ.45,000, నాలుగో ఏడాది నెలకుS రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మెరిట్‌ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021
 
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bel-india.in