19, అక్టోబర్ 2021, మంగళవారం

SSC Recruitment 2021: రూ.85,500 వేతనంతో 3261 జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే

SSC Recruitment 2021: రూ.85,500 వేతనంతో 3261 జాబ్స్... సెలెక్షన్ ప్రాసెస్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

SSC Recruitment 2021 | ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 3261 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారో (Exam Pattern), సిలబస్ ఎలా ఉంటుందో తెలుసుకోండి.


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఫేజ్ 9 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3261 పోస్టుల్ని భర్తీ చేస్తోంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 25 లోగా అప్లై చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలతో పాటు దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 10+2, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. 2021 జనవరి 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్నవారు అర్హులు. ఎంపికైనవారికి రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.85,500 వేతనం లభిస్తుంది. మరి ఈ పోస్టులకు ఎలా ఎంపిక చేస్తారు? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఏం చదవాలి? తెలుసుకోండి.

SSC Phase 9 Recruitment 2021: ఎంపిక విధానం ఇదే...

Exam Pattern: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 3261 పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 2022 జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఎగ్జామ్ ప్యాటర్న్ వేర్వేరుగా ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ 60 నిమిషాలకు ఉంటుంది. నాలుగు సబ్జెక్ట్స్‌లో 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ప్రతీ సెక్షన్‌కు 50 మార్కులు ఉంటాయి. అంటే మొత్తం 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. 60 నిమిషాల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.


Subjects: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50 మార్కులు, క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్ (బేసిక్ ఆర్థమెటిక్ స్కిల్) సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ (బేసిక్ నాలెడ్జ్) సబ్జెక్ట్‌కు 25 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారికి ఈ సబ్జెక్ట్స్‌లో ప్రశ్నల స్థాయి వేర్వేరుగా ఉంటుంది. ప్రతీ తప్పు సమాధానానికి సగం మార్కు తగ్గుతుంది. అంటే రెండు సమాధానాలు తప్పైతే ఒక మార్కు తగ్గుతుంది.


Skill Test: కొన్ని పోస్టులకు స్కిల్ టెస్టులు కూడా ఉంటాయి. ఆ పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్‌లో ఈ వివరాలు ఉంటాయి. టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ లాంటివి ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయినవారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఓబీసీ అభ్యర్థులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. ఇతర కేటగిరీలు 25 శాతం మార్కులు సాధించాలి. స్కిల్ టెస్ట్ విజయవంతంగా పూర్తి చేసినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

IGNOU Recruitment 2021: ఇగ్నోలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. జీతం రూ.35,000 ద‌ర‌ఖాస్తుకు ఈ రోజే ఆఖరు తేది (19-10-2021)

ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ (Indira Gandhi National Open University)లో పలు నాన్ టీచింగ్ (Non Teaching) పోస్టుల భర్తీకి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఆయా పోస్టుల ఆధారంగా రూ.35,000 వేత‌నం అందించ‌నున్నారు.

ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ యూనివర్సిటీ (Indira Gandhi National Open University)లో పలు నాన్ టీచింగ్ (Non Teaching) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ (Technical Assistant) , టెక్నికల్ మేనేజర్ (Technical Manager) విభాగంలో 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ (Skill test) అనంతరం ఇంటర్వ్యూ (Interview) ద్వారా ఉంటుంది. ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.9300-రూ.34800 జీతం అందిస్తారు. అలాగే టెక్నికల్ మేనేజర్‌కు జీతం రూ.15600- రూ.39100 వ‌ర‌కు అందిస్తారు.  దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్ లైన్ లోనే ఉంటుంది. నోటిఫికేషన్ అప్లికేషన్ విధానం సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ http://ignou.ac.in/ లోని జాబ్స్ విభాగాన్ని సందర్శించాలి.

అర్హతలు.. ఖాళీల వివరాలు
పోస్టు పేరుఅర్హతలుఖాళీలు
టెక్నికల్ అసిస్టెంట్కంప్యూర్ సైన్స్/ఐటీలో 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంసీఏ/బీటెక్/బీఈ/ఎంఎస్ఈ పూర్తి చేసి ఉండాలి. పరిశ్రమలు/పీఎస్‌యూ/జీఓఐ ప్రాజెక్ట్‌లు లేదా ప్రైవేట్‌లో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.05
టెక్నికల్ మేనేజర్కంప్యూర్ సైన్స్/ఐటీలో 55 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంసీఏ/బీటెక్/బీఈ/ఎంఎస్ఏ పూర్తి చేసి ఉండాలి. లేదా బీసీఏ/ బీఎస్సీ(మల్టీమీడియా)/ B.Voc (మల్టీమీడియా)/ బీఏ చేసి ఉండాలి. పరిశ్రమలు/పీఎస్‌యూ/జీఓఐ ప్రాజెక్ట్‌లు లేదా ప్రైవేట్‌ సెక్టార్లో కనీసం 4 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.02

ఎంపిక విధానం..

Step 1 : ముందుగా అభ్యర్థికి రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ (Skill Test) నిర్వహిస్తారు.

Step 2 : అనంతరం సెలక్టయిన అభ్యర్థికి ఇంటర్వ్యూ (Interview) నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం..

Step 1: అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ (Online) ద్వారానే ఎంపిక చేస్తారు.

Step 2: ముందుగా అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ http://ignou.ac.in/ లోని జాబ్స్ పోర్టల్ కు వెళ్లాలి.



Step 3: అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)

Step 4: అనంతరం ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి ( ఆన్ లైన్ అప్లికేషన్ కోసం క్లిక్ చేయండి)

Step 5: దరఖాస్తు ఫాం తప్పులు లేకుండా నింపాలి.

Step 6: అప్లికేషన్ నింపిన తరువాత దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

Step 7: జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళలకు రూ.600 ఫీజు చెల్లించాలి.

Step 8: దరఖాస్తు పూర్తయిన తరువాత హార్డు కాపీ డౌన్లోడ్ చేసుకోవాలి.

Step 9:  దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 19, 2021 వరకు అవకాశం ఉంది

 

Daily Updates 19-10-2021
























Gemini Internet

Ananthapuramu | Kurnool | Cuddappah | Chittoor District Classifieds 19-10-2021

Gemini Internet








విద్యా ఉద్యోగ సమాచారం | Education and Jobs Info.







Gemini Internet

18, అక్టోబర్ 2021, సోమవారం

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా

APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC). ఏపీ శాసనసభలో ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసేందుకు వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) పలు ఖాళీల భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. ఇప్పటికే 151 మెడికల్ ఆఫీసర్ (Medical Officer) పోస్టులకు, 39 హార్టికల్చర్ ఆఫీసర్ (Horticulture Officer) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 18న ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సర్వీస్‌లో తెలుగు రిపోర్టర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 8 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోండి.

APPSC Recruitment 2021: నోటిఫికేషన్ వివరాలు


భర్తీ చేసే పోస్టు పేరుతెలుగు రిపోర్టర్
మొత్తం ఖాళీలు5
దరఖాస్తు ప్రారంభం2021 అక్టోబర్ 18
దరఖాస్తుకు చివరి తేదీ2021 నవంబర్ 8

APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.

ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం- రూ.37,100 బేసిక్ వేతనంతో మొత్తం రూ.91,450 వేతనం లభిస్తుంది.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.


APPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా


Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.

Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.

Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.

Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.

Step 8- Online Application Submission పైన క్లిక్ చేయాలి.

Step 9- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.

Step 10- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Step 11- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

ONGC Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి ఓఎన్‌జీసీలో 309 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

ఈ పోస్టులే కాకుండా 4 డీపీఆర్‌ఓ పోస్టులకు 2021 అక్టోబర్ 19న, 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు 2021 అక్టోబర్ 22న, 6 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, 29 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, 1 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, 2 హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు నవంబర్ 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఫాలో కావాలి.

 

Online Course : ఇంటి నుంచే చ‌దివేయండి.. ఉపాధి అవ‌కాశ‌లిచ్చే ఆన్‌లైన్ కోర్సుల వివ‌రాలు

Online Courses : కోవిడ్ త‌రువాత విద్యావిధానంలో చాలా మార్పులు వ‌చ్చాయి. ఆన్‌లైన్ విద్య సౌల‌భ్యం అంద‌రికీ అర్థం అయ్యింది. ప్ర‌ముఖ కంపెనీలు, యూనివ‌ర్సీటీలు (Universities) ఆన్‌లైన్ కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. ప్ర‌స్తుతం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే ఆన్‌లైన్ కోర్సుల‌ను ఇంటి నుంచే నేర్చుకొనే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. వాటి వివ‌రాలు తెలుసుకోండి

Online Course : ఇంటి నుంచే చ‌దివేయండి.. ఉపాధి అవ‌కాశ‌లిచ్చే ఆన్‌లైన్ కోర్సుల వివ‌రాలు

Online Courses : కోవిడ్ త‌రువాత విద్యావిధానంలో చాలా మార్పులు వ‌చ్చాయి. ఆన్‌లైన్ విద్య సౌల‌భ్యం అంద‌రికీ అర్థం అయ్యింది. ప్ర‌ముఖ కంపెనీలు, యూనివ‌ర్సీటీలు (Universities) ఆన్‌లైన్ కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టాయి. ప్ర‌స్తుతం ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే ఆన్‌లైన్ కోర్సుల‌ను ఇంటి నుంచే నేర్చుకొనే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. వాటి వివ‌రాలు తెలుసుకోండి

ప్రస్తుత ఆకర్షణీయమైన కెరీర్ ఆప్షన్స్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌ (Cloud Computing) ఒకటిగా నిలుస్తోంది. వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో.. భవిష్యత్తులో మనుషుల అవసరాలకు తగినట్లుగా సాంకేతికతను తీసుకురావడంలో క్లౌడ్ కంప్యూటింగ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకోవడం ద్వారా అపరిమితమైన ఉద్యోగావకాశాలు పొందొచ్చు. తాజాగా అమెజాన్ వెబ్ (Amazon Web) సర్వీసెస్ (AWS) కూడా క్లౌడ్ కంప్యూటింగ్‌ ప్రాముఖ్యతను నిరుద్యోగులకు తెలియజేసేందుకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఎడబ్ల్యుఎస్ (AWS) రీ/స్టార్ట్ ప్రోగ్రాంలో భాగంగా 12 వారాల క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ ఉచితంగా అందిస్తున్నట్టు అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే ఆసక్తి గల అభ్యర్థులకు ఎలాంటి టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌/స్కిల్స్ అవసరం లేదు.

 కోర్సుకు అర్హతలు

1. అభ్యర్థులు 12 వారాల కోర్స్‌ వ్యవధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు హాజరు కావడానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి.

2. ట్రైనింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత ఫుల్ టైం జాబ్ చేయగలగాలి.

3. దరఖాస్తుదారుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ లో కెరీర్ ని తప్పకుండా ప్రారంభించాలనే ఆసక్తి ఉండాలి.

TCS Careers : "టీసీఎస్ పిలుస్తోంది".. నిరుద్యోగుల‌కు ఉచిత శిక్ష‌ణ‌.. ఉపాధి అవ‌కాశాలు


4. అభ్యర్థులు హైస్కూల్ డిప్లొమా లేదా జనరల్ ఎక్వివలెన్సీ డిప్లొమా (GED) కలిగి ఉండాలి.

అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్.. పార్టిసిపెంట్లను క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ పరీక్షకు సిద్ధం చేస్తుంది. ఈ ఎగ్జామ్ ఖర్చులను కూడా భరిస్తుంది. ఇక్కడ నేర్చుకున్న క్లౌడ్ స్కిల్స్ సర్టిఫికేషన్ ఎక్కడైనా సరే వాలీడ్ గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ చెన్నై, కోల్కతా, ముంబై, పూణే, తిరువనంతపురం సిటీల నుంచి నిర్వహిస్తారు. ఎడ్యూబ్రిడ్జి లెర్నింగ్, ఎడ్యూజాబ్స్ అకాడమీ వంటి ఐదు స్థానిక విద్యా సంస్థలతో కలిసి వర్చువల్ ట్రైనింగ్ అందించనున్నారు.

ఈ కోర్సు గురించి మరిన్ని వివరాల కోసం https://aws.amazon.com/training/restart/ లింక్ ను విజిట్ చేయవచ్చు.

IIIT ఢిల్లీలో కంప్యూట‌ర్ సైన్స్‌ ఉపాధ్యాయుల‌కు ప్ర‌త్యేక కోర్సు


సైన్స్‌ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Indraprastha Institute of Information Technology) ప్రొఫెసర్‌ల కోసం కంప్యూటర్ సైన్స్‌లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ కోర్సు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా వ‌ర్చువ‌ల్ విధానంలో యూనివ‌ర్సిటీ అందిస్తుంది. ఈ కోర్సు బీఈ/ బీటెక్ అండ్ నాన్- ఇంజ‌నీరింగ్  విభాగాలు బీఎస్సీ/ బీసీఏ / ఎంసీఏ నేప‌థ్యాల నుంచి వ‌చ్చివారు చేసేందుకు రూపొందించిన స‌ర్టిఫికెట్ ప్రోగ్రామ్ (Certificate Program) ముఖ్యంగా కంప్యూట‌ర్ సైన్స్ (Computer Science) విభాగాల్లో ఉపాధ్యాయులు బోధ‌నా సామర్థ్యాలు మెరుగు ప‌ర్చుకొనేందుకు రూపొందించిన కోర్సుగా యూనివ‌ర్సిటీ తెలిపింది. ఈ కోర్సు చేసేందుక ఇత‌ర యూనివ‌ర్సిటీలు త‌మ అధ్యాప‌కుల‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. అంతే కాకుండా అసోసియేష‌న్ ఫ‌ర్ కంప్యూటింగ్ మిష‌న‌రీ (Association for Computing Machinery) ఈ కోర్సు చేసేందుకు అధ్యాప‌కుల‌ను పాక్షిక‌ ఆర్థిక చేయూత అందించ‌నుంది.

వారానికి 6 నుంచి 8 గంట‌ల బోధ‌న‌..

  • ఈ కోర్సు బోధించేందుకు ఆయా రంగాల్లో స్పెష‌లిస్టుల‌ను ఎంపిక చేసి బోధ‌న అందించ‌స్తారు. ముఖ్యంగా ఏఐసీటీ (AICTE) సెల‌బ‌స్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా పాఠ్యాంశాల‌ను బోధిస్తున్నారు.
  • ఈ మాడ్యుల్ బోధ‌న‌కు ఐఐటీ, ఐఐఐటీ విద్యావేత్త‌ల‌ను నియమించ‌నున్నారు. ఈ కోర్సు మొద‌టి మాడ్యూల్ జ‌న‌వ‌రి 2022న ప్రారంభ‌మ‌వుతుంది. ఈ కోర్సు రెగ్యులర్ సెమిస్టర్‌లో పాఠ్యాంశాలు ఆన్‌లైన్ మాడ్యూల్‌ (Online Module)లను కలిగి ఉన్నందున ఫ్యాకల్టీ ఎప్పుడైనా సెలవు తీసుకోవాల్సిన అవసరం లేదు.

  • -ప్రతి వారం, ప్రతి వారం దాదాపు 5 నుంచి 6 గంటల మొత్తం ప్రయత్నం కోసం, కొన్ని వారపు ప్రాక్టీస్ పనితో పాటు ఒక సింగిల్ సెషన్ జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ పూర్తి చేసిన తర్వాత హాజరైనవారు సర్టిఫికెట్ పొందుతారు.

  • ఈ కోర్సులో ప్రతీ మాడ్యూల్ ధర రూ. 10,000 అద‌నంగా జీఎస్‌టీ చెల్లించాలి. ఈ ఫీజులోనే ఆన్‌లైన్ క్లాస్‌లు, మెటీరియ‌ల్ (Material) అందిస్తారు.

  • మాడ్యూల్ పూర్తి చేసుకొన్న వారు వారి డిపార్ట్‌మెంట్‌/ ఇన్‌స్టిట్యూట్ ద్వారా నిమినేట్ చేయ‌బ‌డ‌తారు. వారానిఇక 6 నుంచి 8 గంట‌ల పాటు కోర్సు విధానాన్ని నిర్ణ‌యిస్తారు.

ట్రిపుల్​ఐటీ హైదరాబాద్​లో కొత్త కోర్సు..


మారుతున్న టెక్నాలజీ, మార్కెట్​ అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక సంస్థలు. తాజాగా హైదరాబాద్​లోని ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ (ట్రిపుల్​ఐటీ) సరికొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల ఎంటెక్ ప్రోగ్రామ్​ను​ ప్రారంభించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ హైదరాబాద్​ అధికారిక వెబ్‌సైట్ www.pdm.iiit.ac.in ద్వారా నవంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.​ టెక్నాలజిస్ట్​లు, ప్రొడక్ట్ డిజైనర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, స్టార్టప్ ఫౌండర్లు, ఎంటర్​ప్రెన్యూర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కోర్సును ఆవిష్కరించింది.

ఈ ప్రోగ్రామ్ కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్‌ (Startup) లు లేదా కొత్త ఐటీ కొలువుల సృష్టికి దారి తీస్తుంది. ఎంటెక్ ప్రోగ్రామ్‌ మొదటి సంవత్సరంలో నూతన టెక్నాలజీపై అవగాహన, టెక్నాలజీ కన్వర్జెన్స్, డిజైన్, మార్కెట్లు & బిజినెస్, ప్రొడక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్, మేనేజ్‌మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్​పైలోతైన అవగాహన కల్పిస్తారు. ఇక, రెండో సంవత్సరంలో క్రియేటింగ్ ప్రొడక్ట్స్, డీప్​టెక్నాలజీస్​లోకి ఐడియాలు ట్రాన్స్​లేట్​ చేసుకోవడం, ​ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మార్కెట్‌ వంటి సబ్జెక్ట్​లపై అవగాహన కల్పిస్తారు.

ఇలా దరఖాస్తు చేసుకోండి..
Step 1 : ముందుగా www.pdm.iiit.ac.in క్లిక్ చేసి వెబ్ సైట్ కు వెళ్లాలి.
Step 2 : అందులో టాప్ లో అడ్మిషన్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయాలి.
Step 3 : కొత్త పేజీ ఓ పెన్ అయిన తర్వాత బాటమ్ లో అప్లై(Apply)అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : తదనంతరం New Users click here to register పైన క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.