అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
21, అక్టోబర్ 2021, గురువారం
తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు.
నవంబరు నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచనున్నట్లు టీటీడీ తెలిపింది. సర్వదర్శనం 10వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ.300) టికెట్లు 12వేలు జారీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. నవంబరు నెలకు ప్రత్యేక సర్వదర్శన టికెట్ల విడుదల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లు.. 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. రూ.300 టోకెన్లు, సర్వ దర్శనం టోకెన్లు శుక్ర, శనివారాల్లో విడుదల కానుండటంతో భక్తులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రూ.300 టోకెన్లు దొరక్కపోయినా సర్వ దర్శనం టోకెన్లు తీసుకోవాలని భావిస్తున్నారు.
మరోవైపు తిరుమల వెళ్లే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలి. కొవిడ్ నియంత్రణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని కోరారు.
APPSC Jobs Recruitment 2021: అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు అర్హతలు..ఎంపికైతే ప్రారంభ జీతమే..రూ.31,460–రూ.84,970
నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీనిద్వారా పలు శాఖల్లో 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులు ఏఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే చక్కటి ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ గైడెన్స్..
మొత్తం పోస్టులు : 190
తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో..
ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది
విభాగాల్లో 190 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్‌లలో 155 తాజా
పోస్ట్‌లు కాగా, 35 పోస్ట్‌లను క్యారీ ఫార్వర్డ్ పోస్ట్‌లు(గత
నోటిఫికేషన్‌లో భర్తీ కానివి)గా పేర్కొన్నారు.
ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460–రూ.84,970 లభిస్తుంది.
అర్హతలు ఇవే..:
ఏపీ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోని ఈ ఏఈ పోస్ట్‌లకు దరఖాస్తు
చేసుకునేందుకు డిప్లొమా, బీఈ/బీటెక్ అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు
చేసుకుంటున్న పోస్ట్‌ను అనుసరించి ఆయా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ లేదా
డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి :
జూలై 1,2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ
అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం :
రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)
పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, దరఖాస్తు
చేసుకున్న పోస్ట్‌లు, అందుబాటులో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను
పరిగణనలోకి తీసుకొని.. తుది విజేతల జాబితా విడుదల చేసి.. నియామకాలు ఖరారు
చేస్తారు.
ముఖ్యమైన సమాచారం:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 21–నవంబర్ 11,2021
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 10, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in
తిరుమల దర్శనం RTC ప్రకటన
ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును.
ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు. కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది. ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ప్రయాణికులకు ఇది చాలా మంచి సౌకర్యం.
*చివరిగా ఒక మనవి :--*
ఈ పోస్టు చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయడం మరవద్దు. మీకు అవసరం లేకపోవచ్చు,కానీ మరొకరికి అవసరమవుతుంది అందుకే దయచేసి షేర్ చేయం డి (సేకరణ)
20, అక్టోబర్ 2021, బుధవారం
HDFC Scholarship : రూ.75,000 స్కాలర్‌షిప్ పొందే అవకాశం.. దరఖాస్తు వివరాలు
కరోనా మహమ్మారి (Covid-19 pandemic) కారణంగా దెబ్బతిన్న కుటుంబాల విద్యార్థులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చేయూతనందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్‌షిప్ పేరుతో విద్యార్థులకు రూ.75,000 అందించనుంది. కరోనా కారణంగా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి ఇది చక్కని అవకాశం. ఈ స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది
కరోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా
వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి
చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు హెచ్‌డీఎఫ్‌సీ చేయూత
నందిస్తోంది. వారికి కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank)
పరివర్తన్ కోవిడ్ క్రైసిస్ సపోర్ట్ స్కాలర్‌షిప్‌ను ప్రవేశ
పెట్టింది. కరోనా కారణంగా తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు.
జీవనోపాధి కోల్పోయిన కుటంబ విద్యార్థలుకు ఈ స్కాలర్‌షిప్(Scholarship)
ను అందించనున్నారు. ఈ కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఒకసారి ఆర్థిక
సాయం రూపంలో రూ.15,000 నుంచి రూ.75,000 వరకు హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తోంది. ఈ
స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31, 2021 వరకు
అవకాశం ఉంది.
స్కాలర్‌షిప్ వివరాలు..
- 1 నుంచి 5 తరగతులకు రూ. 15,000
- 6 నుంచి 8 తరగతులకు రూ.25,000
- డిప్లమా కోర్సులకు రూ. 20,000
- గ్రాడ్యుయేషన్ కోర్సులు (బీకామ్, బీఎస్సీ, బీఏ, బీసీఏ తదితర) - రూ.30,000
- పోస్టు గ్రాడ్యుయేషన్ (ఎంకామ్, ఎంఏ తదితర) - రూ.35,000
- ప్రొఫెషనల్ (బీటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్‌బీ, బీఆర్కె, నర్సింగ్ ) రూ. 50,000
- పోస్టు గ్రాడ్యుయేషన్ ( ఎంటెక్, ఎంబీఏ) కోర్సులు - రూ. 55,000 నుంచి రూ. 75,000
విద్యార్థుల తమ చదువుకు ట్యూషన్ ఫీజు, ఇంటర్నెట్ సదుపాయం కోసం, ఆన్‌లైన్ లర్నింగ్, స్టేషనరీల కోసం వినియోగించుకోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) పేర్కొంది. ఈ స్కాలర్‌షిప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంది.
స్కాలర్‌షిప్ కోసం అందించాల్సి డాక్యుమెంట్స్
- 2019-2020 చదివిన కోర్సుకు సంబంధించి డాక్యుమెంట్స్ (Documents) అంతే కాకుండా 2018-2019 సంవత్సరానికి సంబంధించిన కోర్సు వివరాలు కూడా సమర్పించవచ్చు. ప్రస్తుతం సంవత్సరం చదివేందుకు అవసరమైన రసీదు వివరాలు అడ్మిషన్ సమాచారం అందించాలి.
- ఆధార్ (Aadhar)/ ఓటర్ / పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) ఏదో ఒకటి సమర్పించాలి.
- తల్లిదండ్రుల్లో ఎవరు మృతి చెందారో వారి డెత్ సర్టిఫికెట్. అంతే కాకుండా జీవనోపాధి కోల్పోయిన ధ్రువీకరణ పత్రం సర్పించాలి.
- దరఖాస్తు దారు లేదా తల్లిదండ్రి బ్యాంక్ ఖాతా అందించాలి.
దరఖాస్తు చేసే విధానం..
Step 1 : ఈ స్కాలర్‌షిప్‌కు కేవలం ఆన్‌లైన్ (Online) ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
Step 2 : ముందుగా https://www.buddy4study.com/scholarships వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
Step 3 : రిజిస్ట్రేషన్ (Registration) పూర్తి చేసిన తరువాత హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్ కోవిడ్ కోర్సుల లింక్‌లోకి వెళ్లాలి.
Step 4 : హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్ కోవిడ్ కోర్సు లింక్
https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-covid-crisis-support-scholarship-program
Step 5 : దరఖాస్తు ఫాం పూర్తిగా నింపాలి.
Step 6 : స్టార్ట్ బటన్ నొక్కడం ద్వారా అప్లికేషన్ ఫాం (Application Form) లో అడిగిన వివరాలు అందించాలి.
Step 7 : అవసరమైన డాక్యుమెంట్లు పూర్తిగా అందించాలి.
Step 7 : దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 31, 2021 వరకు అవకాశం ఉంది.
AIIMS Recruitment 2021 : ఎయిమ్స్ బీబీ నగర్‌లో 68 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే ఎంపిక
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్
ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences),
బీబీనగర్ లో పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ (Notification)
విడుదలైంది. దీని ద్వారా నాన్ అకడామిక్ విభాగంలో 68 పోస్టులను భర్తీ
చేయనున్నారు. దరఖాస్తుకు నవంబర్ 9, 2021 వరకు
ఎయిమ్స్ బీబీనగర్
ఆల్
ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of
Medical Sciences), బీబీనగర్ లో పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్
(Notification) విడుదలైంది. దీని ద్వారా నాన్ అకడామిక్ విభాగంలో 68
పోస్టుల సమాచారం.. అర్హతలు
పోస్టు పేరు | అర్హతలు | ఖాళీలు |
సీనియర్ రెసిడెంట్లు | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో మైక్రోబయోలజీ, ఫార్మకాలజీ, రేడియాలజీ, ఆప్తమాలజీ తదితర విభాగాల్లో ఎండీ/ఎంఎస్/ డీఎం/ఎంసీహెచ్ /డీఎన్‌బీ మెడికల్ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. దరఖాస్తుదారు వయసు 45 ఏళ్లు మించి ఉండకూడదు. | 38 |
జూనియర్ రెసిడెంట్లు | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా ఎంసీఐ లేదా రాష్ట్రలో గుర్తింపు పొంది ఉండాలి. | 25 |
ఎంపిక విధానం..
- పోస్టుల కన్నా దరఖాస్తు మూడు రెట్లు ఎక్కువ వస్తే రాత పరీక్ష (Written Test) నిర్వహిస్తారు.
- తక్కువ అప్లికేషన్‌లు వస్తే మెరిట్ (Merit) ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూ (Interview) చేసి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ (Online) ద్వారా ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aiimsbibinagar.edu.in/seniorresident.html ను సందర్శించాలి.
Step 3 : సీనియర్ రెసిడెంట్లు.. జూనియర్ రెసిడెంట్లకు వేర్వేరుగా నోటిఫికేషన్‌లు ఉన్నాయి వాటిని చదవాలి. (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేషన్‌ను చివరన అప్లికేషన్ ఫాం (Application Form) ను డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ నింపాలి.
Step 5 : అనంతరం అప్లికేషన్‌ను స్కాన్ చేసి అవసరమై దరఖాస్తులను మెయిల్ (Mail) ద్వారా పంపాలి.
Step 6 : దరఖాస్తు చేయాల్సిన మెయిల్ ace.aiimsbbnagar@gmail.com
Step 7 : దరఖాస్తుకు నవంబర్ 9, 2021 వరకు అవకాశం ఉంది.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...