అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
27, అక్టోబర్ 2021, బుధవారం
26, అక్టోబర్ 2021, మంగళవారం
IBPS Clerk Recruitment 2021: తెలంగాణ, ఏపీలోని ప్రభుత్వ బ్యాంకుల్లో 720 క్లర్క్ ఉద్యోగాలు. 2021 అక్టోబర్ 27 లోగా అప్లై చేయాలి
IBPS Clerk Recruitment 2021 | ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా 7855 క్లర్క్ పోస్టుల్ని (Bank Clerk Jobs) భర్తీ చేస్తోంది. అందులో 720 పోస్టులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ బ్యాంకులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోండి.
తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్
(IBPS) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా
క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 7855 క్లర్క్ పోస్టుల
భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే 720 పోస్టులున్నాయి. తెలంగాణలోని 333, ఆంధ్రప్రదేశ్‌లో 387 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 2021 అక్టోబర్ 27 లోగా అప్లై చేయాలి.
తెలంగాణలోని అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో,
ఆంధ్రప్రదేశ్‌లోని అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో ఎగ్జామ్
రాయొచ్చు. ఐబీపీఎస్ రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏఏ బ్యాంకుల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకోండి.
IBPS Clerk Recruitment 2021: తెలంగాణలో క్లర్క్ పోస్టుల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు | 333 |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 5 |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 10 |
కెనెరా బ్యాంక్ | 1 |
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 34 |
ఇండియన్ బ్యాంక్ | 60 |
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ | 16 |
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ | 2 |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 205 |
IBPS Clerk Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని క్లర్క్ పోస్టుల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు | 387 |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 9 |
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర | 4 |
కెనెరా బ్యాంక్ | 3 |
ఇండియన్ బ్యాంక్ | 120 |
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ | 3 |
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 248 |
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఐబీపీఎస్ జూలైలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌లో ఈ పోస్టుల సంఖ్య తక్కువగా ఉండేది. తెలంగాణలో 263, ఆంధ్రప్రదేశ్‌లో 263 పోస్టుల భర్తీకి అప్పుడు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పుడు పోస్టుల సంఖ్యను పెంచుతూ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్.
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అభ్యర్థులకు కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. అభ్యర్థులకు సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికార భాషలో నైపుణ్యం ఉండాలి. అంటే ఆ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.
ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, తెలంగాణలోని హైదరాబాద్,కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి.
డాక్టర్ వై ఎస్ ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ గురించిన సమాచారం | Dr.YSR Architecture and Fine Arts University Info.

మనసులోని భావాలకు దృశ్యరూపం ఇచ్చే అరుదైన కోర్సు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్‌లోని యానిమేషన్ కోర్సు. పెద్ద నగరాలకే పరిమితమైన ఈ కోర్సు డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో అందుబాటులోకి వచ్చింది. 100 శాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలున్న ఈ కోర్సు ప్రత్యేకతలపై కథనం.
సాక్షి,కడప(వైవీయూ): కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి స్పెషలైజ్డ్ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయం. వందశాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పెద్ద నగరాలకే పరిమితమైన యానిమేషన్ కోర్సును బీఎఫ్‌ఏ యానిమేషన్ కోర్సుగా కడప విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం, భవిష్యత్ అవసరాలను తీర్చేవిధంగా తీర్చిదిద్దిన ఈ కోర్సు పూర్తి చేయడం ద్వారా సొంతగా, వివిధ సంస్థల్లో పనిచేసి పేరుప్రఖ్యాతులు, ఆకర్షణీయమైన వేతనాలు పొందవచ్చును.
అర్హత : ఇంటర్మీడియట్‌లో ఏదైనా కోర్సు పూర్తిచేసిన ఇందులో చేరడానికి అర్హులు. ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2021 ద్వారా ప్రవేశాలు పొందచ్చు. నాలుగు సంవత్సరాల ఈ కోర్సుకు గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఓపెన్ ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. కోర్సులో ప్రవేశం పొందిన వారికి వివిధ రకాల సాంకేతికతను వినియోగించి ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతారు.
అవకాశాల వెల్లువ..
ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయన్నది నిపుణుల మాట. చదువకుంటూ వివిధ సంస్థల్లో ఫ్రీలాన్స్‌గా కూడా ఉద్యోగం చేసుకునే సౌకర్యం ఉంది. ఆన్‌లైన్ ద్వారా గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్, ఫిల్మ్‌మేకింగ్, గేమ్ డిజైనింగ్ ప్రోగ్రామింగ్ చేసే అవకాశాలు లభిస్తాయి. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు యానిమేషన్, గేమ్ డిజైనింగ్, కార్టూన్, టీవీఛానల్స్, బుక్ మేగజైన్స్, వెబ్ మాధ్యమాల్లో అపారంగా అవకాశాలు ఉన్నాయి.
2డీ, 3డీ యానిమేటర్‌లుగాను, లైటింగ్, రిగ్గింగ్
ఆర్టిస్ట్‌గాను, కేరక్టర్ డిజైనర్‌గాను, స్క్రిప్ట్ రైటర్, వీడియో, ఆడియో
ఎడిటర్‌గా, పోస్ట్ ప్రొడక్షన్‌లో వీఎఫ్‌ఎక్స్ ఆర్టిస్ట్, డిజైనర్‌గా,
గ్రాఫిక్ డిజైనర్, టాయ్ యానిమేటర్, స్టోరీబోర్డు ఆర్టిస్టుగా,
ఇలస్ట్రేటర్‌గా, టైటిల్ డిజైనర్, కంపోస్టర్, విజువల్ డెవలపర్,
ఫ్లాష్‌న్యూస్‌మేకర్స్, ప్రొడక్షన్ డిజైనర్, లేఅవుట్ ఆర్టిస్ట్, 3డీ
మోడులర్, కీ ప్రైమ్ యానిమేటర్, ఇమేజ్ ఎడిటర్‌గా, ఫోరెన్సిక్ యానిమేటర్
వంటి వివిధ రకాల ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. MPC స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లేదా డిప్లొమా ఉన్న వారికి EAPCET ద్వారా ప్రవేశాలు ఉంటాయి. ఈ సంస్థలో మొత్తం 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి, వీటిలో 15 మేనేజ్‌మెంట్ కోటా కింద ఉన్నాయి. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్‌సైట్, drysrafu.ac.in సందర్శించడం ద్వారా మరింత తెలుసుకోవచ్చు.

Gemini Internet
25, అక్టోబర్ 2021, సోమవారం
Engineering Students: ఇంజినీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రతి నెలా రూ. 7500 స్టైపెండ్ పొందే అవకాశం.. 31 అక్టోబర్ 2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
Engineering Students: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఇంటర్న్‌షిప్(Internship) 2021కింద ఇంజినీరింగ్ విద్యార్థులకు తీపికబురు అందించింది. ఉజ్జ్వలా కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ (Ujjawala Chemical and Fertilizers) లో 100 లాబరేటరీ ఇంటర్న్‌ల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఇంటర్న్‌షిప్ చేయడం ద్వారా అభ్యర్థులు నిజజీవిత వర్క్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. అంతేకాదు, నిపుణులతో పని చేస్తూ అనేక కొత్తవిషయాలు తెలుసుకోవచ్చు. ఫీల్డ్ లో ప్రయోగాలు కూడా చేయొచ్చు. మొత్తం ఆరు నెలల కాలం పాటు అందుబాటులో ఉండే ఈ ఇంటర్న్‌షిప్‌కు సెకండ్ లేదా థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విద్యార్థులు సంబంధిత స్కిల్స్ తో పాటు అనుభవం కలిగి ఉండాలి.
Gemini Internet
ఎంపికైన విద్యార్థులు ఉజ్జ్వల కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ సంస్థలో చేయాల్సిన పని
1. ఎరువులు, పురుగుమందులను విశ్లేషించాలి.
2. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్పెరిమెంట్స్ నిర్వహించాలి. అలాగే వీటికి సపోర్ట్ చేయాలి.
3. నియంత్రిత ప్రయోగాలను ప్లాన్ చేయాలి. ట్రయల్స్ చేపట్టాలి. ఈ ప్రయోగాలను ఏర్పాటు చేయాలి.
4. డేటాను రికార్డ్ చేయాలి. అలాగే విశ్లేషించాలి.
5. పరికరాలను శుభ్రపరచాలి, పరీక్షించాలి, కాలిబ్రేట్(calibrate) చేయాలి. పరికరాల శుభ్రంగా ఉన్నాయో లేదో పరీక్షించాలి.
6. సంబంధిత సైంటిఫిక్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి.
7. వనరులను ఆర్డర్ చేయాలి.. అలాగే వాటిని మెయింటైన్ చేయాలి.
ఎఐసీటీఈ ఇంటర్న్‌షిప్ 2021కి దరఖాస్తు చేసుకోండిలా
ఆసక్తిగల విద్యార్థులు https://internship.aicte-india.org అధికారిక వెబ్‌సైట్‌లో
31 అక్టోబర్ 2021 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు మొదటగా వారు
చదువుతున్న యూనివర్సిటీపేరు, విద్యార్థి ఐడీ, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లతో
తులిప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత ఇంటర్న్‌షిప్ కోసం
దరఖాస్తు చేసుకోవడానికి వారి ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్
అవ్వాలి.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...