14, నవంబర్ 2021, ఆదివారం

Currency Notes: చిరిగిన నోట్లను ఏం చేయాలో తెలియడం లేదా.? బ్యాంకులో ఇస్తే కొత్త నోట్లు ఇస్తారని మీకు తెలుసా?

కరెన్సీ నోట్లు చిరగడం సర్వ సాధారణమైన విషయం. 

కరెన్సీ నోట్లు చిరగడం సర్వ సాధారణమైన విషయం. మనలో చాలా మంది చిరిగిన నోట్లను ఏం చేయాలో తెలియక ప్లాస్టర్‌లాంటివి అతికిస్తూ ఎవరికో ఒకరికి తెలియకుండా అంటగట్టడానికి ప్రయత్నిస్తుంటాం. అయితే తీసుకునే వారు గమనించి ఇవి చెల్లవు అంటూ తిరస్కరించే సందర్భాలు కూడా ఉంటాయి. దీంతో చేసేదేమీ లేక నోటును పడేయడమో, నిరుపయోగంగా ఇంట్లోనే ఉంచడమో చేస్తుంటాం. అయితే చిరిగిన నోట్లను బ్యాంకుల్లో ఎక్సేంజ్‌ చేసుకోవచ్చనే విషయం తెలుసా.? తాజాగా ఈ విషయమై ఎస్‌బీఐ ఖాతాదారుడు ఒకరు చేసిన ట్వీట్‌కు బదులుగా ఎస్‌బీఐ వివరణ ఇచ్చింది.

అమిత్‌ కుమార్‌ అనే ఓ ఖాతాదారుడు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ట్విట్టర్‌ ఖాతాను ట్యాగ్ చేస్తూ.. ‘సార్‌.. నా దగ్గర చిరిగిన రూ. 2000 వేల నోటు ఉంది. నేను దానిని రీప్లేస్‌ చేసుకోవాలనుకుంటున్నాను. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌ ఆధారంగా చిరిగిన నోటును ఎలా మార్చుకోవాలి.? దీనికి సంబంధించిన వివరాలను తెలపండి’ అంటూ ఓ పోస్ట్‌ చేశాడు. దీనిపై స్పందించిన ఎస్‌బీఐ సమాధానంగా మరో ట్వీట్ చేసింది. ‘ఎస్‌బీఐకి చెందిన అన్ని రకాల బ్రాంచీల్లో చిరిగిన నోట్లను ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతాదారులతో పాటు ఇతరులు కూడా ఇలాంటి నోట్లను మార్చుకోవచ్చు. చెల్లుబాటులో ఉన్న చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకోవచ్చని ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చింది. అయితే నోట్లలో తేడా కనిపించినా.? దొంగ నోట్లని తేలినా.. బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లో వాటిని స్వీకరించవు’ అని స్పష్టతనిచ్చింది.

Gemini Internet

ఆర్‌బీఐ మార్గదర్శకాలు ఏంటంటే..

నోటుకు రెండు వైపులా స్పష్టంగా నెంబర్లు కనిపిస్తూ రెండుగా చిరిగిన నోటునైనా ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. ఇలాంటి నోట్లను ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా ప్రైవేటు రంగ బ్యాంకునైనా సంప్రదించి కరెన్సీని ఎక్సేంజ్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా ఇష్యూ కార్యాలయంలో ఎక్కడైనా నోట్లను మార్చుకోవచ్చు. దీని కోసం ఎలాంటి అప్లికేషన్‌ ఫామ్‌ను నింపాల్సిన అవసరం లేదు.
 

 

13, నవంబర్ 2021, శనివారం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ 2021 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-I (సూపర్‌వైజర్) – 22 పోస్టులు psc.ap.gov.in చివరి తేదీ 08-12-2021


Name of Organization Or Company Name :Andhra Pradesh Public Service Commission


Total No of vacancies:– 22 Posts


Job Role Or Post Name:Extension Officer Grade-I (Supervisor) 


Educational Qualification:Degree (Relevant Discipline)


Who Can Apply:Andhra Pradesh


Last Date:08-12-2021


Website: psc.ap.gov.in


Click here for Official Notification


తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో క్యాలెండర్‌ డైరీలు అందుబాటులోకి

టీటీడీ 2022 సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్లు, డైరీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. క్యాలెండర్లు కావాల్సిన భక్తులు దేవస్థానం వెబ్‌సైట్‌లోని పబ్లికేషన్స్‌ నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. పోస్టల్‌ ఛార్జీలు చెల్లించి కావాల్సినన్ని డైరీలు, క్యాలెండర్లను అడ్రస్‌కు పంపిస్తారు. భారతదేశంతో పాటు అంతర్జాతీయంగా వీటిని పొందే అవకాశాన్ని టీటీడీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. పెద్ద డైరీ రూ.150 కాగా.. చిన్న డైరీ రూ.120కు లభిస్తుంది. క్యాలెండర్‌ రూ.130గా ఉంది. టేబుల్‌ క్యాలెండర్‌ రూ.75తో పాటు పోస్టల్‌ ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.

మరోవైపు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని సూచించింది. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావొచ్చు.. భక్తుల సంఖ్యను పెంచడంతో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ఇటు టీటీడీ దర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో మాత్రమే విడుదల చేస్తోంది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన టోకెన్ల సంఖ్యను కూడా పెంచింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు.. రోజుకు 12వేల చొప్పున.. సర్వదర్శన టోకెన్లు రోజుకు 10వేల చొప్పున విడుదల చేశారు. అలాగే అద్దె గదులు కూడా విడుదలయ్యాయి.

Andhra Pradesh Job Notification ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ నోటిఫికేషన్ 2021

ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం కొత్త నోటిఫికేషన్ను విడుదల చేసింది. నోటిఫికేషన్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ - I పోస్టులను రిక్రూట్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ నోటిఫికేషన్ 2021 వివరాలు:

సంస్థ పేరు       ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం

పోస్ట్ పేరు        ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ - I పోస్టులు

మొత్తం ఖాళీలు           22 ఖాళీలు

అప్లికేషన్           ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే

 

పోస్ట్ - వైజ్ ఖాళీలు:

పోస్ట్ పేరు                                              ఖాళీలు

ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ - I పోస్టులు            22 ఖాళీలు

 

విద్యా అర్హత:

పోస్ట్ పేరు                                              అర్హతలు

ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ - I పోస్టులు            సంబంధిత రంగంలో డిగ్రీ

 

వయో పరిమితి:

పోస్ట్ పేరు                                              వయో పరిమితి

ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ - I పోస్టులు            18-42 సంవత్సరాలు

 

నెలసరి జీతం:

పోస్ట్ పేరు                                              నెలసరి జీతం

ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ - I పోస్టులు            రూ.35,000/-

 

దరఖాస్తు రుసుము:

వర్ణాలు                                                  దరఖాస్తు రుసుము

Gen/OBC అభ్యర్థులు                            రూ.250/- + రూ.80/-

SC/ST అభ్యర్థులు                                  రూ.80/-

 

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ ప్రారంభ తేదీ                         18.11.2021

నోటిఫికేషన్ ముగింపు తేదీ                      07.12.2021

 

ముఖ్యమైన లింకులు:

అప్లికేషన్ల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధన్మలక్ష్మి రోడ్, హిందూపురం

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి:        ఇక్కడక్లిక్ చేయండి

నోటిఫికేషన్ లింక్:                       ఇక్కడ క్లిక్ చేయండి