ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Andhra Pradesh: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి.  విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ పెట్టడం అవసరమని విద్యాశాఖ మంత్రి సురేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని మంత్రులు తెలిపారు.  కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఎగ్జామ్స్ కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తంగా  మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. 1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు. మ...

CA Results 2021: సీఏ ఫైనల్‌, ఫౌండేషన్‌ జూలై 2021 పరీక్షల ఫలితాలు విడుదల

ICAI CA Result July 2021 Results: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫౌండేషన్‌, ఫైనల్‌ (old and new courses) జూలై 2021 పరీక్ష ఫలితాలను ఈరోజు (ఫిబ్రవరి 10) విడుదలచేసింది. అభ్యర్థులు తమ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ icaiexam.icai.org లేదా caresults.icai.org లేదా icai.nic.inలలో తనిఖీ చూసుకోవచ్చు. అభ్యర్ధులకు సంబంధించిన రోల్ నంబర్‌ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పిన్ నంబర్‌లతో లాగిన్‌ అయ్యి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్ధులకు కూడా సీఏ ఫౌండేషన్‌, సీఏ ఫైనల్‌ పరీక్షల ఫలితాలను వారి వారి మెయిల్‌లకు పంచించింది. కాగా ఐసీఏఐ అధికారిక ట్విటర్‌ అకౌంట్ ద్వారా ఈ రోజు సీఏ ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 2021లో జరిగిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్ ఎగ్జామినేషన్, సీఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ఫలితాలు ప్రకటించినట్లు ట్విటర్‌ పోస్టులో పేర్కొంది. ICAI CA జూలై  2021 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే.. మొదటిగా icaiexam.icai.org లేదా caresults.icai.org లేదా icai.nic.in ఏదైనా ఒక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చెయ్య...

Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..

Central Bank Of India Jobs: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం.. భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.. * నోటిఫికేషన్‌లో భాగంగా ఇన్నర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో ఉన్న మొత్తం 19 సీనియర్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. * ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి. * అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు. ముఖ్యమైన విషయాలు.. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 63,480 నుంచి రూ. 78,230 వరకు చెల్లిస్తారు. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-02-2022న మొదలు కాగా చివరి తేదీగా 02-03-2022ని నిర్ణయించారు. * రాతపరీక్షను మార్చి 27న నిర్వహించనున్నా...

Indian Coast Guard Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్! పదో తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు

Indian Coast Guard Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు పోస్టు ద్వారా ఆఫ్‌లైన్‌ మోడ్‌ (offline application)లో దరఖాస్తులు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 80 పోస్టుల వివరాలు: సివిలియన్ పోస్టులు ఖాళీ వివరాలు: ఇంజిన్ డ్రైవర్: 8 సారంగ్ లాస్కర్: 3 స్టోర్ కీపర్ గ్రేడ్ II: 4 సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 24 ఫైర్‌మ్యాన్: 6 ICE ఫిట్టర్: 6 స్ప్రే పెయింటర్: 1 MT ఫిట్టర్/ MT టెక్/ MT టెక్: 6 MTS: 19 షీట్ మెటల్ వర్కర్: 1 ఎలక్ట్రికల్ ఫిట్టర్: 1 లేబర్: 1 వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. దీనితోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అర్హతలు కూడా ఉండాలి. వయోపరిమితి: అభ్య...

Army School Teacher: టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు, అర్హతల వివ‌రాలు ...

బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్నవారి ముందున్న మరో అద్భుత అవకాశం..ఆర్మీ స్కూల్‌ టీచర్‌. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలోని టీచర్‌ పోస్టుల నియామకానికి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ సిద్ధమైంది. తాజాగా పలు ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌–2022కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, పరీక్ష ప్యాట్రన్, ప్రిపరేషన్‌ తదితర వివరాలు... దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో సీబీఎస్‌ఈకి అనుబంధంగా 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ను ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ నిర్వహిస్తోంది. ఆయా పాఠశాలల్లో దాదాపు 8700 మంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. వివిధ కారణాల వల్ల ఏటా భారీ సంఖ్యలో ఏర్పడుతున్న ఖాళీల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ.. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తదుపరి దశలో ఆయా పాఠశాలలు ఇంటర్వ్యూలను నిర్వహించి.. ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి. పోస్టుల వివరాలు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ) ట్రైన్డ్‌ ...

UPSC Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్ తో పాటు ఇతర ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 78 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. Gemini Internet పోస్టు ఖాళీలు అసిస్టెంట్ ఎడిటర్ (Oriya): 1 అసిస్టెంట్ డైరెక్టర్ (Cost): 16 ఎకనామిక్ ఆఫీసర్: 4 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 1 మెకానికల్ మెరైన్ ఇంజనీర్: 1 లెక్చరర్: 4 సైంటిస్ట్: 2 కెమిస్ట్: 5 జూనియర్ మైనింగ్ జియోలజిస్ట్: 36 రీసెర్చ్ ఆఫీసర్: 1 అసిస్టెంట్ ప్రొఫెసర్: 7 మొత్తం: 78 వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా విద్యార్హతలను నిర్ణయించారు. విద్యార్హతలు, వయో పరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థ...

IBPS Exam Calendar 2022: నిరుద్యోగులకు అలర్ట్... ఈ ఏడాది రాబోయే బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్

బ్యాంక్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) కోసం కోచింగ్ తీసుకుంటున్నారా? అయితే అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఈ ఏడాది నిర్వహించబోయే పరీక్షల వివరాలను వెల్లడించింది. 2022-23 ఎగ్జామ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబెషనరీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది. మరి ఏ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఏ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? తెలుసుకోండి. IBPS Exam Calendar 2022: ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ వివరాలివే... పరీక్ష పేరు  తేదీలు  ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్  2022 ఆగస్ట్ 7, 13, 14, 20, 21  ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్  2022 సెప్టెంబర్ 24  ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్  2022 సెప్టెంబర్ 24  ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన...