11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Project Assistant Jobs: బీఎస్సీ చేసి ఖాళీగా ఉన్నారా? రాత పరీక్ష లేకుండానే సీఎస్‌ఐఆర్‌లో ఉద్యోగాలు.

CSIR – IPU Recruitment 2022: న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ – ఇన్నోవేషన్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (IPU) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ (Project Assistant posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టులు

విభాగాలు: కెమికల్‌, మయోటెక్‌, కెమిస్ట్రీ, ఐటీ, సివిల్‌, మెకానికల్

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

10, ఫిబ్రవరి 2022, గురువారం

AWES Recruitment 2022 : టీజీటీ, పీజీటీ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.

AWES Army School Admit Card 2022: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) దేశవ్యాప్తంగా వివిధ సైనిక పాఠశాలల్లో TGT, PGT, PRT టీచర్ పరీక్షల కోసం హాల్‌ టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్మీ స్కూల్ టీజీటీ, పీజీటీ, పీఆర్టీ రిక్రూట్‌మెంట్ 2022 ద్వారా మొత్తం 8700 పోస్ట్‌లు రిక్రూట్ చేయనున్నారు. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పేరు, సబ్జెక్ట్ పేరు, రోల్ నంబర్, చిరునామా, పరీక్షా కేంద్రం, తేదీలను తనిఖీ చేసుకోవల్సి ఉంటుంది. కాగా ఆర్మీ స్కూల్‌లో ఉపాధ్యాయుల నియామకం కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 7 నుంచి 28 వరకు జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ awesindia.com ను తనిఖీ చేయవచ్చు. ఈ పరీక్ష ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, ఆగ్రా, వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో, మీరట్, బరేలీ, నోయిడా, ఢిల్లీ, ఝాన్సీ, డెహ్రాడూన్, జైపూర్, జబల్‌పూర్, భోపాల్‌లలో నిర్వహించబడుతుంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత అభ్యర్ధులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత టీచింగ్‌ ఎబిలిటీని అంచనా వేస్తారు. ఈ దశలన్నింటి తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.

అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్- awesindia.com ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్ పేజీలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ ఓఎస్టీపై క్లిక్ చెయ్యాలి.
  • న్యూ పేజీ ఓపెన్‌ అవుతుంది. దీనిలో రిజిస్టర్డ్ ఐడీని నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • స్క్రీన్‌పై హాల్‌టికెట్‌ ఓపెన్‌ అవుతుంది.
  • సేవ్‌ చేసుకుని, డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

 

Gemini Internet

AP EAPCET 2022: ఏపీ ఈఏపీ 2022 పరీక్ష ‘మే’ లో..

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2022 ఈ ఏడాది మేలో నిర్వహించనున్నట్లు JNTU Kakinada నోటీసు జారీ చేసింది..

Gemini Internet

AP EAPCET 2022: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2022 ఈ ఏడాది మేలో నిర్వహించనున్నట్లు JNTU Kakinada నోటీసు జారీ చేసింది. ఏపీ ఈఏపీ 2022 పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్షలో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలి. ఇందులో ఉత్తీర్ణులైన వారు సంబంధిత కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హత సాధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏపీ ఈఏసీ సెట్‌ 2022 లో మొత్తం 331 కళాశాలలు పాల్గొంటున్నాయి. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధీనంలో కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నిర్వహిస్తుంది. కాగా ఏపీ ఈఏసీ సెట్‌ను గతంలో EAMCET (ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్‌ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) అనే పేరుండేది. ఐతే రిజర్వేషన్ వర్గాలకు చెందిన విద్యార్థులకు కనీస మార్కుల విషయంలో సడలింపు ఉంది. ఈ పరీక్షలో సాధించిన మార్కులను 75 శాతం, ఇంటర్మీడియట్ గ్రూప్ సబ్జెక్ట్‌లో సాధించిన 25 శాతం మార్కుల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.

Andhra Pradesh: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి.  విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ పెట్టడం అవసరమని విద్యాశాఖ మంత్రి సురేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని మంత్రులు తెలిపారు.  కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఎగ్జామ్స్ కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు.

మొత్తంగా  మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. 1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు.

Gemini Internet

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ దిగువన చూడండి 


 

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ దిగువన చూడండి 


 

 

 

CA Results 2021: సీఏ ఫైనల్‌, ఫౌండేషన్‌ జూలై 2021 పరీక్షల ఫలితాలు విడుదల

ICAI CA Result July 2021 Results: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫౌండేషన్‌, ఫైనల్‌ (old and new courses) జూలై 2021 పరీక్ష ఫలితాలను ఈరోజు (ఫిబ్రవరి 10) విడుదలచేసింది. అభ్యర్థులు తమ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ icaiexam.icai.org లేదా caresults.icai.org లేదా icai.nic.inలలో తనిఖీ చూసుకోవచ్చు. అభ్యర్ధులకు సంబంధించిన రోల్ నంబర్‌ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పిన్ నంబర్‌లతో లాగిన్‌ అయ్యి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్ధులకు కూడా సీఏ ఫౌండేషన్‌, సీఏ ఫైనల్‌ పరీక్షల ఫలితాలను వారి వారి మెయిల్‌లకు పంచించింది. కాగా ఐసీఏఐ అధికారిక ట్విటర్‌ అకౌంట్ ద్వారా ఈ రోజు సీఏ ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 2021లో జరిగిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్ ఎగ్జామినేషన్, సీఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ఫలితాలు ప్రకటించినట్లు ట్విటర్‌ పోస్టులో పేర్కొంది.

ICAI CA జూలై  2021 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • మొదటిగా icaiexam.icai.org లేదా caresults.icai.org లేదా icai.nic.in ఏదైనా ఒక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే రిజల్ట్స్‌ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • అవసరమైన వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • స్క్రీన్‌ పై కనిపించే స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి

సీఏ ఫౌండేషన్ పరీక్షలు గత యేడాది డిసెంబర్ 13,15,17,19 తేదీల్లో నిర్వహించబడ్డాయి. ఇక సీఏ ఫైనల్‌ పరీక్షలు డిసెంబర్ 5 నుంచి 19 తేదీల మధ్య దేశవ్యాప్తంగా 190 కంటే ఎక్కువ జిల్లాల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి.

Gemini Internet

Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..

Central Bank Of India Jobs: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఇన్నర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో ఉన్న మొత్తం 19 సీనియర్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 63,480 నుంచి రూ. 78,230 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-02-2022న మొదలు కాగా చివరి తేదీగా 02-03-2022ని నిర్ణయించారు.

* రాతపరీక్షను మార్చి 27న నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

 

Gemini Internet

Indian Coast Guard Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్! పదో తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు

Indian Coast Guard Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు పోస్టు ద్వారా ఆఫ్‌లైన్‌ మోడ్‌ (offline application)లో దరఖాస్తులు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 80

పోస్టుల వివరాలు: సివిలియన్ పోస్టులు

ఖాళీ వివరాలు:

ఇంజిన్ డ్రైవర్: 8 సారంగ్ లాస్కర్: 3 స్టోర్ కీపర్ గ్రేడ్ II: 4 సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 24 ఫైర్‌మ్యాన్: 6 ICE ఫిట్టర్: 6 స్ప్రే పెయింటర్: 1 MT ఫిట్టర్/ MT టెక్/ MT టెక్: 6 MTS: 19 షీట్ మెటల్ వర్కర్: 1 ఎలక్ట్రికల్ ఫిట్టర్: 1 లేబర్: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. దీనితోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అర్హతలు కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Commander, Coast Guard Region (East), Near Napier Bridge, Fort St George (PO), Chennai- 600009.

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ జనవరి 23, 2022న విడుదలైంది. అప్పటినుంచి 30 రోజుల వ్యవధిలోపు దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

 

Gemini Internet