Alerts

--------

14, ఫిబ్రవరి 2022, సోమవారం

SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ వచ్చింది.

బ్యాంక్‌లో ఉద్యోగం కావాలని కలలు కంటున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులందరూ SBI అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అధికారిక వెబ్‌సైట్‌లో 25 ఫిబ్రవరి 2022లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ వ్రాత పరీక్షలో, అభ్యర్థుల నుండి 100 మార్కుల 80 ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలను పరిష్కరించేందుకు అభ్యర్థులకు 120 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. 

పరీక్ష కేంద్రాలు..

ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2022 మార్చి 20న గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, గౌహతి, పాట్నా, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, న్యూఢిల్లీ, నాగ్‌పూర్, పూణె, భువనేశ్వర్, జలంధర్, లూథియానా, జైపూర్, చెన్నై, హైదరాబాద్, అగర్తల, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి.. అనేక ఇతర జిల్లాల్లో నిర్వహించే అవకాశం ఉంది.

స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా, ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి వయస్సు 40 ఏళ్లు మించకూడదు. విద్యార్హత, వయోపరిమితికి సంబంధించిన వివరణాత్మక సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

ఖాళీల వివరాలు..

ఈ ప్రక్రియ ద్వారా 15 అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్), 33 అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ , స్విచింగ్) పోస్టులతో సహా మొత్తం 48 ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులందరూ SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అధికారిక వెబ్‌సైట్‌లో 25 ఫిబ్రవరి 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు కూడా రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Gemini Internet

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

FTII Recruitment 2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో టీచర్‌ ఉద్యోగాలు..ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు

FTII Faculty Recruitment 2022: పూణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (FTII) వివిధ విభాగాల్లోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల (Teaching And Non Teaching  posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 31

పోస్టుల వివరాలు: టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఖాళీల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సౌండ్‌ రికార్డిస్ట్‌, మెడికల్ ఆఫీసర్లు.

విభాగాలు: ఆర్ట్‌ డైరెక్షన్‌, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌, స్క్రీన్‌ రైటింగ్‌, ఎడిటింగ్‌, వీడియో ఎడిటింగ్‌, ఐటీ మేనేజర్‌, అకడమిక్‌ కో ఆర్డినేటర్‌, ఫిల్మ్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌, సౌండ్‌ రికార్డిస్ట్‌, బీఏఎంఎస్‌ తదితర విభాగాల్లో ఖాళీలను పూరించనున్నారు.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.1,16,398ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 63 ఏళ్లు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ, బీఏఎంఎస్‌, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత సబ్జెక్టులో టీచింగ్‌ అనుభవంతోపాటు, టెక్నికల్‌ నైనుణ్యాలు కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 2022, మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 13 వరకు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

click here for application

Gemini Internet

JNV Jobs: రంగారెడ్డి నవోదయ విద్యాలయంలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక

JNV Jobs: జవహర్‌ నవోదయ విద్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన ఈ విద్యా సంస్థ రంగారెడ్డిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో పోస్టులు ఖాళీ ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పీజీటీ, మాట్రాన్‌ పోస్టులు ఉన్నాయి.

* మాట్రాన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

* పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ, ఎంఈడీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్ల మించకూడదు.

ముఖ్యమైన విషయాలు…

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను జవహర్‌ నవోదయ విద్యాలయ, రంగారెడ్డిలో నిర్వహిస్తారు.

* 18-02-2022న ఇంటర్వ్యూను నిర్వహించనున్నారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,750 జీతంగా చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Gemini Internet

UPSC Recruitment: పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన యూపీఎస్‌సీ.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్టోర్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌ పోస్టులు ఉన్నాయి.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (నేవీ,ఆయుష్‌) పోస్టుల్లో భాగంగా హిస్టరీ, ఆయుర్వేద విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ, ఆయుర్వేద మెడినిసిన్‌లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నెట్‌/సెట్‌/స్లెట్‌ అర్హత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.

* స్టోర్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

* అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదు. ఇతరులు మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 03-03-2022ను చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Gemini Internet

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ICAI CA May Exam 2022: సీఏ మే – 2022 పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు

 

ICAI CA May Exam 2022 Schedule: సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, PQC పరీక్షలు – మే 2022 షెడ్యూల్ విడుదలైంది. సీఏ కొత్త షెడ్యూల్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధికారిక వెబ్‌సైట్‌ icaiexam.icai.orgలో విద్యార్ధుల కోసం అందుబాటులో ఉంచింది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్ధులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 13 వరకు https://icaiexam.icai.orgలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించవల్సి ఉంటుంది. పరీక్ష తేదీలు, పరీక్ష సమయాలు ఈకింది విధంగా ఉంటాయి..

షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలివే.. సీఏ ఫౌండేషన్‌ 2022 పరీక్షలు: మే 23, 24, 29 తేదీల్లో జరుగుతాయి.

సీఏ ఇంటర్మీడియట్‌ కోర్సు 2022 పరీక్షలు: గ్రూప్‌ 1కు.. మే 15, 18, 20, 22 తేదీల్లో జరుగుతాయి. గ్రూప్‌ 2కు.. మే 24, 26, 28, 30 తేదీల్లో జరుగుతాయి.

సీఏ మే ఫైనల్ కోర్సు 2022 పరీక్షలు: గ్రూప్‌ 1కు.. మే 14, 17, 19, 21 తేదీల్లో జరుగుతాయి. గ్రూప్‌ 2కు.. మే 23, 25, 27, 29 తేదీల్లో జరుగుతాయి.

ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌ – అసెస్‌మెంట్ టెస్ట్‌ (INTT – AT): మే 14, 17 తేదీల్లో జరుగుతాయి.

పరీక్ష సమయాలు: సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు 2 గంటలపాటు, ఎలక్టివ్‌ పేపర్స్‌ ఫైనల్‌ పరీక్షలు 4 గంటలపాటు, ఇతర పరీక్షలన్నీ 3 గంటల పాటు నిర్వహించబడతాయి.

Gemini Internet

IGNOU January 2022 Session: ఇగ్నో ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీ పొడిగింపు

IGNOU January 2022 Session Admission Last date: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2022-23 సెషన్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 21 వరకు స్పీకరించనున్నట్లు ఇగ్నో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఇగ్నో పేర్కొ్ంది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in లేదా ignouadmission.samarth.edu.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పద్ధతిలో అందించే ఓపెన్, డిస్టెన్స్ మోడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు కొత్తగా రిజిస్ట్రేషన్‌ను చేసుకుని, అన్ని వివరాలను నమోదు చేసి, ఏ కోర్సులో అడ్మిషన్‌ కావాలని భావిస్తున్నారో దానిని ఎంచుకోవాలి. ఇగ్నో తాజా నోటిఫికేషన్‌ ద్వారా మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీలు, పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికేట్, అప్రీషియేషన్‌/అవేర్‌నెస్ లెవల్‌ ప్రోగ్రామ్‌లతో సహా వివిధ విభాగాల్లో మొత్తం 200 కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లను వర్సిటీ అందించింది. మరిన్ని సంబంధిత వివరాల కోసం ఇగ్నో అధికారిక సైట్‌ignou.ac.inను తనిఖీ చేయవచ్చు.

Gemini Internet

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...