15, ఫిబ్రవరి 2022, మంగళవారం

TCS Recruitment 2022: రూ. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు

TCS Jobs: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) క్యాంపస్ డిజిటల్ హైరింగ్ 2022 పేరుతో ఓ రిక్రూట్ మెంట్ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఇంజనీర్లు, ఎంసీఎ, ఎమ్మెస్సీ డిగ్రీ పూర్తియిన వారి నుంచి దరఖాస్తులను కోరుతోంది. మీ కెరీర్ అపరిమితమైన వృద్ధికి, అసాధారణమైన అవకాశాలకు టీసీఎస్ వారధిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. 2019, 2020, 2021 సంవత్సారల్లో ఇంజనీరింగ్ పూర్తయిన గ్రాడ్యుయేట్‌లు ఇందుకు అర్హులుగా పేర్కొంది. అలాగే 6 నుంచి 12 నెలల పాటు IT అనుభవం కూడా ఉండాలని పేర్కొంది.

ఎవరు అర్హులు: BE / B.Tech / ME / M.Tech / MCA/ M.Sc ఉత్తీర్ణత సాధించినవారు.

ఏ సంవత్సరంలో పాసైన వారు అర్హులు – 2019, 2020, 2021, 6 నుంచి 12 నెలల వరకు IT పని అనుభవం.

పదో తరగతి, ఇంటర్, డిప్లొమా (వర్తిస్తే), గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ పరీక్షలో ప్రతిదానిలో 70 శాతం లేదా 7 CGPA ఉండాలి. (అన్ని సెమిస్టర్‌లలోని అన్ని సబ్జెక్టులు)

అలాగే అభ్యర్థి నిర్ణీత కోర్సు వ్యవధిలో కోర్సును పూర్తి చేసి ఉండాలి. అంటే గ్యాప్ ఉండకూడదు. అభ్యర్థికి ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు కూడా ఉండకూడదు. అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా 18 నుంచి 28 సంవత్సరాల వయసు వారై ఉండాలని టీసీఎస్ పేర్కొంది.

ఈ ఎంపిక విధానం రెండు రౌండ్లుగా నిర్వహిస్తున్నారు. మొదట రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో ఎంపికైన వారు ఇంటర్వ్యూ రౌండ్‌కు ఎంపిక చేస్తారు.

అయితే రాత పరీక్ష మూడు విభాగాల్లో కండక్ట్ చేయనున్నారు. పార్ట్ 1లో అభ్యర్థుల అడ్వాన్స్‌డ్‌ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. పార్ట్ 2, పార్ట్‌ 3లలో అభ్యర్థుల వెర్బల్ ఎబిలిటీ స్కిల్స్, అడ్వాన్స్‌డ్ కోడింగ్ స్కిల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి.

జీతం: అండర్ గ్రాడ్యుయేట్లకు సంత్సరానికి రూ. 7 లక్షలు కాగా, పీజీ చేసిన వరాకి ఏడాదికి రూ. 7.3 లక్షలు అందించనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ: TCS NextStep పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అందులో డిజిటల్ డ్రైవ్ కోసం అప్లై చేసుకోవాలి. దరఖాస్తులు పంపేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 25, 2022గా ఉంది. ఈలోపే అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

రాత పరీక్ష ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తారు. టీసీఎస్ ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్‌ 2022కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా టీసీఎస్‌ హెల్ప్‌డెస్క్‌కు ilp.support@tcs.com మెయిల్ పంపవచ్చు. అలాగే 18002093111 హెల్ప్‌లైన్ నంబర్‌‌కు కూడా కాల్ చేసి, సందేహాలు తీర్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం టీసీఎస్ వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

 

Gemini Internet

14, ఫిబ్రవరి 2022, సోమవారం

Indian Coast Guard Jobs: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం.

Indian Coast Guard Recruitment: ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వశాఖకి చెదిన ఈ సంస్థ నోయిడాలోని ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఫోర్‌మెన్ (స్పోర్ట్స్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎకనామిక్స్‌/కామర్స్‌/స్టాటిస్టిక్స్‌/ బిజినెస్‌ స్టడీస్‌/ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను డైరెక్టర్‌ జనరల్‌, కోస్ట్‌ గార్డ్‌ హెడ్‌క్వార్టర్స్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రిక్రూట్‌మెంట్‌, ఫేజ్‌ 2, ఇండస్ట్రియల్‌ ఏరియా, సెక్టర్‌ 62, నోయిడా, యూనీ 201309 అడ్రస్‌కు పంపించాలి.

* అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

 

Gemini Internet

NMDC Recruitment 2022: ఎన్ఎండీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల

NMDC Recruitment 2022: ఎన్ఎండీసీలో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్ఎండీసీ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఎన్ఎండీసీ అధికారిక వెబ్‌సైట్ nmdc.co.in ని సందర్శించడం ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2 మార్చి, 2022 గా ప్రకటించారు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 200 పోస్టులు భర్తీ చేయనుననారు. నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అర్హతలు.. వివిధ పోస్టులకు అర్హత ప్రమాణాలు భిన్నంగా ఉన్నాయి. వయోపరిమితి, విద్యార్హత వంటి వివరాలను తెలుసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. Gemini Internet

అప్లికేషన్ ఫీజు.. అభ్యర్థులు రూ. 150 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC/ST/PwD/ex-servicemen కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. Gemini Internet

పోస్టుల సమగ్ర వివరాల లింక్: పోస్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోండి. (పోస్టుల వివరాల లింక్)

ఎలా దరఖాస్తు చేయాలంటే.. 1: ఎన్ఎండీసీ పోస్ట్‌లకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఎన్ఎండీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 2: హోమ్‌పేజీలో అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి 3: దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. 4: అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి 5: ఆపై, అప్లికేషన్ ఫీజు చెల్లించండి. 6: ‘‘సబ్‌మిట్’’ ఆప్షన్‌ను క్లిక్ చేసి, అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

Gemini Internet

RBI Recruitment: నిరుద్యోగులకు సదావకాశం.. ఆర్‌బీఐలో 950 ఖాళీలు

RBI Recruitment: రిజర్వర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల కానుంది.? ఎన్ని పోస్టులు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 950 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోనూ ఖాళీలు ఉన్నాయి.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే చాలు.

* పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ స్థానిక భాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 17, 2022న ప్రారంభం కానున్నాయి, చివరి తేదీగా 08-03-2022ని నిర్ణయించారు.

* పరీక్షలను మార్చి 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి..

Gemini Internet

AP SSC Exams Model Papers: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫైనల్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్లు

ఆంధ్రప్రదేశ్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ (AP Tenth, Inter Exams)కు సంబంధించిన షెడ్యూళ్లను ఇటీవల మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Minister Adimulapu Suresh) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ను, మే 2 నుంచి 13 వరకు టెన్త్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంటర్ ఎగ్జామ్స్ ను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, టెన్త్ ఎగ్జామ్స్ ను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇదిలా ఉంటే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలపై (Exams) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న పరీక్షల పేపర్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టెన్త్ ఎగ్జామ్ ను 11 పేపర్లలో నిర్వహించేవారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్యను 7కు కుదించింది జగన్ సర్కార్.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను సైతం ఏడు పేపర్లతోనే నిర్వహించున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు ఒకే ఎగ్జామ్ ఉండగా.. ఒక సైన్స్ మాత్రం రెండు పేపర్లను నిర్వహించనున్నారు. ఇందులో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి 50 మార్కులకు ఒక పేపర్, జీవశాస్త్రానికి 50 మార్కులకు ఉంటుంది.

మిగతా అన్ని సబ్జెక్టులకు ఎగ్జామ్ ను ఒకే పేపర్ ద్వారా 100 మార్కులకు నిర్వహిస్తారు. అయితే, ఈ సిలబస్ కు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మోడల్ పేపర్లను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. విద్యార్థులు నేరుగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి మోడల్ పేపర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందు కోసం విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

AP SSC SUBJECT WISE MODEL QUESTION PAPERS:

Step 1: విద్యార్థులు మొదటగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో SSC Public Examinations - 2022 Model Paper ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 3: తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

Step 4: ఆ పేజీలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి న ఇంగ్లిష్, తెలుగు మోడల్ పేపర్లకు సంబంధించిన లింక్ లు కనిపిస్తాయి.

Step 5: ప్రతీ పేపర్ పక్కన Click Here అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి మోడల్ పేపర్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Gemini Internet

SPM Recruitment 2022: కరెన్సీ నోట్లను ముద్రించే సెక్యురిటీ పేపర్ మిల్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ చదివినవారు అర్హులు

SPM Narmadapuram Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని నర్మదాపురంలోనున్న సెక్యూరిటీ పేపర్‌ మిల్‌ (SPM) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు: సూపర్‌ వైజర్లు, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు

అర్హతలు:

  •  వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు సోషల్‌ సైన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.29,740ల నుంచి రూ.1,03,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  •  సూపర్‌ వైజర్‌ పోస్టులకు ఇంజనీరింగ్‌లో బీఎస్సీ/బీఈ/బీటెక్/డిప్లొమా (మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/కెమికల్/ఎన్విరాన్‌మెంటల్‌)లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.27,600ల నుంచి రూ.95,910ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  •  జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు పీజీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.27,600ల నుంచి రూ.95,910ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 16, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Gemini Internet

ICMR Recruitment 2022: ఐసీఎంఆర్‌లో జూనియర్ నర్సు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ICMR Recruitment 2022: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (ICMR NIMR) జూనియర్ నర్సు, లేబొరేటరీ టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్‌తో సహా పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ICMR రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా MBBS/ 12వ, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు 20 ఫిబ్రవరి 2022లోపు లేదా సాయంత్రం 05:00 గంటల వరకు ఐసీఎంఆర్ అధికారక వెబ్ సైట్‌లో ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు . మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ని చెక్ చేయండి.

ఖాళీల వివరాలు ఇలా..

జూనియర్ మెడికల్ ఆఫీసర్-02 లేబొరేటరీ టెక్నీషియన్-01 డేటా ఎంట్రీ ఆపరేటర్-03 ఫీల్డ్ వర్కర్-04 జూనియర్ నర్సు-03

విద్యార్హతలు..

జూనియర్ మెడికల్ ఆఫీసర్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBBS డిగ్రీ. లేబొరేటరీ టెక్నీషియన్ – సైన్స్ సబ్జెక్టులో 12వ తరగతి ఉత్తీర్ణత, మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్‌లో రెండేళ్ల డిప్లొమా. డేటా ఎంట్రీ ఆపరేటర్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ లేదా 12వ ఉత్తీర్ణత. ఫీల్డ్ వర్కర్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్‌లో 12వ ఉత్తీర్ణత లేదా తత్సమానం మరియు రెండేళ్ల ఫీల్డ్ అనుభవం. జూనియర్ నర్స్ – సైన్స్ సబ్జెక్టులతో ANM లో హై స్కూల్ లేదా సర్టిఫికేట్ కోర్సు

జీతం వివరాలు..

జీతం ఇవ్వబడుతుంది జూనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు 60,000 (కన్సాలిడేటెడ్) జీతం ఇవ్వబడుతుంది. ఇది కాకుండా, లేబొరేటరీ టెక్నీషియన్‌కు 17,520 (కన్సాలిడేటెడ్), డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు 17,520 (కన్సాలిడేటెడ్), ఫీల్డ్ వర్కర్‌కు 17,520 (కన్సాలిడేటెడ్) , జూనియర్ నర్సు అభ్యర్థులకు రూ.17,520 (కన్సాలిడేటెడ్) ఇవ్వబడుతుంది.

 

Gemini Internet