Alerts

--------

23, ఫిబ్రవరి 2022, బుధవారం

Army Public School jobs: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Army Public School Golconda Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ (Hyderabad)లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Army Public School Golconda) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్‌ సూపర్‌వైజర్‌, ఎల్‌డీఏ, కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్, కౌన్సెలర్‌/హెల్త్‌ వెల్‌నెస్‌ టీచర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ డ్రైవర్‌ పోస్టులు.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Army Public School, hydershakote, hyderabad 500031.

దరఖాస్తు రుసుము: రూ. 100

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

 

BOB Manager jobs: రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 40 మేనేజర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.

Bank of Baroda Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda )ఒప్పంద ప్రాతి పదకన మేనేజర్ పోస్టుల (Manager posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 42

పోస్టుల వివరాలు:

  • సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు: 27
  • మేనేజర్‌ పోస్టులు: 4
  • హెడ్‌/డిప్యూటీ హెడ్‌: 11

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును అనుసరించి సీఏ/ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

 

Gemini Internet

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

ICAI CA exam 2022: సీఏ మే సెషన్‌ 2022 పరీక్షలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. ఈ తేదీల్లోనే పరీక్షలు

Registration process for ICAI May 2022 exams began: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మే 2022 సెషన్‌ పరీక్షలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సోమవారం (ఫిబ్రవరి 21) ప్రారంభించింది. ఈ ఏడాది మేలో జరిగే చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.orgలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఏఐ నిర్వహించే సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 13తో ముగుస్తుంది. ఆలస్య రుసుముతో మార్చి 20వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. కాగా చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫౌండేషన్ పరీక్షలు ఈ ఏడాది మే 23న ప్రారంభమై, మే 29 వరకు నిర్వహించబడతాయి. ఇక గ్రూప్ 1 ఇంటర్మీడియట్ పరీక్షలు మే 15న ప్రారంభమై, మే 22 వరకు జరుగుతాయి. గ్రూప్ II పరీక్షలు మే 24న ప్రారంభమై, మే 30 వరకు జరగనున్నాయి.

సీఏ ఫైనల్ కోర్స్ గ్రూప్ 1 పరీక్షలు మే 14 నుంచి మే 21 వరకు జరుగుతాయి. గ్రూప్ II పరీక్షలు మే 23 నుంచి మే 29, 2022వరకు జరుగుతాయి. ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష మే 14 నుంచి మే 17 జరగనున్నట్లు ఐసీఏఐ తెల్పింది.

ICAI CA exam 2022కు రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.icai.org ను ఓపెన్‌ చేయాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే examination tab లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్‌ ఓపెన్‌ అవుతుంది. అవసరమైన వివరాలు ఫిల్‌ చేసి, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి, సబ్‌మిట్‌ చేయాలి.
  • తర్వాత అప్లికేషన్‌ను సేవ్‌ చేసుకుని, హార్డ్ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Gemini Internet

Jobs: నకిలీ ఉద్యోగాల పట్ల జాగ్రత్త.. ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక

Jobs: కరోనా కాలంలో నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ ఉద్యోగాల పేరిట మోసాలు ఎక్కువయ్యాయి. నెలల తరబడి నిరుద్యోగులు సైతం నకిలీ ఉద్యోగాల (Fake Jobs) వలలో పడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయపు పన్ను శాఖ ప్రజలను ప్రత్యేకంగా హెచ్చరించింది . ఎలాంటి మోసాలు జరగకుండా జాగ్రత్త పడాలని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మీకు ఎవరైనా ఏదైనా ఉద్యోగం ఆఫర్ చేస్తే అది నకిలీ. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department)లో ఉద్యోగాలకు సంబంధించి చాలా మందికి నకిలీ జాయినింగ్ లెటర్లు కూడా జారీ అవుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు మోసగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. చాలా మంది అభ్యర్థులకు నకిలీ ఆఫర్ లెటర్లు, జాయినింగ్ లెటర్లు కూడా జారీ అయ్యాయి. ఇలాంటి మోసాల (Fraud) పట్ల అప్రమత్తంగా ఉండాలి.

SSC ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగాలు:

ఆదాయపు పన్ను శాఖ తరపున డిపార్ట్‌మెంట్‌లోని గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాలు కూడా స్టాఫ్ సెలక్షన్ కమిటీ (SSC) ద్వారా జారీ చేయబడతాయని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం SSC వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మోసాలకు లోనుకావద్దని, నకిలీ ఉద్యోగాల జోలికి వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఆదాయపు పన్ను శాఖ.

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ల హెచ్చరిక!

దేశంలో చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది పార్ట్‌టైమ్ ఉద్యోగాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. పార్ట్ టైమ్ జాబ్ ద్వారా నెలకు 40-50 వేలు సంపాదించే ఆఫర్‌లు కూడా మీకు లభిస్తుంటే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మీ డబ్బుపై కన్నేసి ఉంచుతున్నారు. సైబర్ దోస్త్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అప్రమత్తం చేస్తోంది. జాబ్‌ ఆఫర్లకు సంబంధించినవి ఏవి కూడా నమ్మవద్దని తెలిపింది.

Gemini Internet

 

Indian Bank jobs: నిరుద్యోగులకు అలర్ట్! పదో తరగతి అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో 202 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Indian Bank Security Guard Recruitment 2022: చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌.. ఇండియన్‌ బ్యాంక్‌ (Indian Bank) దేశ వ్యాప్తంగా పలు చోట్ల సెక్యూరిటీ గార్డు పోస్టు (Security Guard Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 202

పోస్టుల వివరాలు: సెక్యూరిటీ గార్డులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.14,500ల నుంచి రూ.28,145ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, లోకల్‌ ల్యాంగ్వేజ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 40 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుంది. 90 నిముషాల పాటు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

 

Gemini Internet

TIFR jobs: పది/ఇంటర్‌/డిగ్రీ అర్హతతో..టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

TIFR Recruitment 2022: ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (TIFR Mumbai) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 8

పోస్టుల వివరాలు:

జూనియర్‌ హిందీ ట్రాన్సలేటర్‌ పోస్టులు: 1 ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులు: 1 సెక్యూరిటీ గార్డ్‌ పోస్టులు: 1 లైబ్రరీ ట్రైనీలు పోస్టులు: 4 తాత్కాలిక వర్క్ అసిస్టెంట్‌ పోస్టులు: 1

వయోపరిమితి: జనవరి 1, 2022నాటికి అభ్యర్ధుల వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.59,478ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, యూజీ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధులకు టెక్నికల్‌ నాలెడ్జ్‌, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, టీఐఎఫ్‌ఆర్‌, హోమీ భాభా రోడ్‌, నేవీ నగర్‌, ముంబాయి- 400005.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

21, ఫిబ్రవరి 2022, సోమవారం

TCS Jobs: బీటెక్‌ చేసిన వారికి బంపరాఫర్‌.. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

TCS Jobs: ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ బంపరాఫర్‌ ప్రకటించింది. బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలకోసం ప్రకటన జారీ చేసింది. ఇంతకీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా అప్లై చేసుకోవాలి.? ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* టీసీఎస్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఆఫ్‌ క్యాంపస్‌ డిజిటల్‌ హైరింగ్‌ ప్రకటన జారీ చేసింది.

* టీసీఎస్‌ భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులను పూర్తి చేసి ఉండాలి. 2019/2020/2021లో డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. అలాగే ఐటీ రంగంలో కనీసం 6 నుంచి 12 నెలల అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇందుకోసం అభ్యర్థులు టీసీఎస్‌ కెరీర్ పోర్టల్ లోకి వెళ్లి..  రిజిస్టర్‌ నౌ క్లిక్‌ చేసి ఐటీ విభాగంలోకి వెళ్లి. వివరాలు నమోదు చేసుకోవాలి.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఫిబ్రవరి 25ను చివరి తేదీగా నిర్ణయించారు.

* పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ తేదీని ప్రకటిస్తారు.

* రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* పూర్తివివరాలు, సందేహాల కోసం ilp.support@tcs.com మెయిల్‌, లేదా 1800 209 3111 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించండి.

 

Gemini Internet

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...