27, అక్టోబర్ 2023, శుక్రవారం

TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టులు తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు…శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో నవంబర్‌ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. | పే స్కేల్: నెలకు ఏఈఈకి రూ.57,100-1,47,760. ఏఈకి రూ.48,440-1,37,220. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500.

TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టులు 

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు…శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో నవంబర్‌ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు

2. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు

3. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 56.

అర్హత: బీఈ, బీటెక్‌ (సివిల్‌/ మెకానికల్‌), ఎల్‌సీఈ/ ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు. 

పే స్కేల్: నెలకు ఏఈఈకి రూ.57,100-1,47,760. ఏఈకి రూ.48,440-1,37,220. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 23.11.2023.

Notification Information

Posted Date: 26-10-2023

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

SSC GD Constable: ఫిబ్రవరి 20 నుంచి జీడీ కానిస్టేబుల్ రాత పరీక్షలు * నవంబర్‌ 24న ఉద్యోగ ప్రకటన విడుదల * భారీ సంఖ్యలో కొత్త ఖాళీలు

SSC GD Constable: ఫిబ్రవరి 20 నుంచి జీడీ కానిస్టేబుల్ రాత పరీక్షలు  

* నవంబర్‌ 24న ఉద్యోగ ప్రకటన విడుదల

* భారీ సంఖ్యలో కొత్త ఖాళీలు
 
ఈనాడు ప్రతిభ డెస్క్‌: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వెల్లడించింది. ఈ మేరకు పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) రాత పరీక్షలు నవంబర్‌ 14, 15, 16, 17, 20, 21, 22, 23, 24, 28, 29, 30; డిసెంబర్‌ 1, 2, 3వ తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొంది.

గతేడాది 50,187 ఖాళీల భర్తీ

భారీ సంఖ్యలో కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) నియామకాల ప్రక్రియకు సైతం ఎస్‌ఎస్‌సీ సన్నద్ధమవుతోంది. వార్షిక క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ 24న నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28 పూర్తి కానుంది. గతేడాది నవంబర్‌లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది సైతం అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ కానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు

       ఎస్‌ఎస్‌సీ అధికారిక ప్రకటన వివరాలు       

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

IBPS RRB: ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డులు * నవంబర్‌ 5న ప్రధాన పరీక్ష ఈనాడు ప్రతిభ డెస్క్‌: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ-XIII 2024-25) ప్రకటనను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాన పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్ష నవంబర్‌ 5న జరుగనుంది. అడ్మిట్‌ కార్డులను అర్హులైన వారు నవంబర్‌ 5వ తేదీలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3,049 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్‌ చేయండి

IBPS RRB: ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ మెయిన్స్‌ అడ్మిట్‌కార్డులు

* నవంబర్‌ 5న ప్రధాన పరీక్ష

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌ పీవో/ ఎంటీ-XIII 2024-25) ప్రకటనను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధాన పరీక్షలకు సంబంధించి అడ్మిట్‌కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్ష నవంబర్‌ 5న జరుగనుంది. అడ్మిట్‌ కార్డులను అర్హులైన వారు నవంబర్‌ 5వ తేదీలోగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3,049 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ, మెయిన్‌  రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్‌ ఎగ్జామ్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్‌ చేయండి

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

26, అక్టోబర్ 2023, గురువారం

ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు ఒకవేళ కట్టమని అడిగితే కట్టకండి

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఆపరేటివ్‌ ట్రైనీలకు ఆహ్వానం | హైదరాబాద్‌లోని మినీరత్న సంస్థ ‘మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌’ (మిధానీ) 54 జూనియర్‌, సీనియర్‌ ఆపరేటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

హైదరాబాద్‌లోని మినీరత్న సంస్థ ‘మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌’ (మిధానీ) 54 జూనియర్‌, సీనియర్‌ ఆపరేటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://midhani-india.in

హైదరాబాద్‌లోని మినీరత్న సంస్థ ‘మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌’ (మిధానీ) 54 జూనియర్‌, సీనియర్‌ ఆపరేటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌ల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులందరికీ రాత పరీక్ష ఉంటుంది. దీంట్లో అర్హత పొందిన, అవసరమైన అభ్యర్థులకు స్కిల్‌/ ప్రాక్టికల్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు. 

మొత్తం 54 ఉద్యోగాల్లో.. జూనియర్‌ ఆపరేటివ్‌ ట్రైనీ-ఫిట్టర్‌-13, జేవోటీ-వెల్డర్‌-02, జేవోటీ-ఎలక్ట్రీషియన్‌-06.. సీనియర్‌ ఆపరేటివ్‌ ట్రైనీ-మెటలర్జీ-20, ఎస్‌వోటీ-మెకానికల్‌-10, ఎస్‌వోటీ-ఎలక్ట్రికల్‌-03 ఉన్నాయి. జేవోటీలో 5, ఎస్‌వోటీలో 5 పోస్టులను ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రిజర్వు చేశారు.

జేవోటీ పోస్టులకు.. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ ఫిట్టర్‌/వెల్డర్‌/ఎలక్ట్రీషియన్‌ పాసవడంతోపాటు.. నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు. ఎస్‌వోటీ పోస్టులకు.. మెటలర్టికల్‌ ఇంజినీరింగ్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంజినీరింగ్‌ డిప్లొమా 45 శాతం మార్కులతో పాసైతే సరిపోతుంది. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35 సంవత్సరాలు. ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో మినహాయింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ/ ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు. జేవోటీ పోస్టులకు వేతనం నెలకు రూ.20,000, ఎస్‌వోటీలకు వేతనం రూ.21,900 ఉంటుంది. మూలవేతనంతోపాటుగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, పెర్క్స్‌, ఈపీఎఫ్‌, గ్రాట్యుటీ, ఇతర పోత్సాహకాలూ ఉంటాయి.

ఎంపిక ఎలా?

  • రాత పరీక్ష, స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • వచ్చిన దరఖాస్తుల నుంచి.. విద్యార్హతల ఆధారంగా కొంతమంది అభ్యర్థులను ఎంపికచేసి... రాత పరీక్ష నిర్వహిస్తారు. దీంట్లో అర్హత సాధించినవారిని స్కిల్‌/ ట్రేడ్‌టెస్ట్‌కు ఎంపికచేస్తారు.
  • రాత పరీక్ష 100 మార్కులకు ఇంగ్లిష్‌లో ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. విద్యార్హతలకు 10 మార్కులు.. అదనపు విద్యార్హతలకు 2 మార్కుల చొప్పున గరిష్ఠంగా 15 మార్కుల వరకూ కేటాయిస్తారు.
  • రాత పరీక్షతోపాటుగా ప్రాక్టికల్‌/ ట్రేడ్‌ టెస్టులను కూడా ఇంగ్లిష్‌లోనే నిర్వహిస్తారు.
  • నెగెటివ్‌ మార్కులు లేవు. బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలను రాయాలి. తర్వాత కాస్త సమయం తీసుకుని ఆలోచించి.. మిగతా ప్రశ్నలకు జవాబులు రాయాలి.
  • ఎంపిక ప్రక్రియను ఏ తేదీన, ఎక్కడ నిర్వహించేదీ అభ్యర్థుల ఈమెయిల్‌కు తెలియజేస్తారు. లేదా సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతారు.
  • సెలెక్షన్‌కు అభ్యర్థులు.. విద్యార్హతలు, వయసు, కేటగిరీ, ఎంప్లాయ్‌మెంట్‌ రిజిస్ట్రేషన్‌ కార్డ్‌.. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలి.

గుర్తుంచుకోవాల్సినవి

  • 18.10.2023 నాటికి తగిన వయసు, విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • ప్రకటనలోని పూర్తి వివరాలను చదివిన తర్వాతే ఆన్‌లైన్‌ దరఖాస్తును నింపాలి. ప్రస్తుతం ఉపయోగిస్తోన్న మొబైల్‌ నంబర్‌, ఈమెయిల్‌ ఐడీలను మాత్రమే దరఖాస్తులో రాయాలి.
  • దరఖాస్తు ప్రింటవుట్‌ తీసుకుని భద్రపరుచుకోవాలి. హార్డ్‌కాపీలను పంపనవసరం లేదు.

దరఖాస్తుకు చివరి తేదీ: 01.11.2023
వెబ్‌సైట్‌: https://midhani-india.in

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

తాజా ఇంటర్న్ షిప్‌లు work from Home వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

సంస్థ: కోడ్‌ టిక్కి, స్టైపెండ్‌: నెలకు రూ.1,000, దరఖాస్తు గడువు: నవంబరు 2, అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, ఎక్స్‌ప్రెస్‌.జేఎస్‌, హెచ్‌టీఎంఎల్‌ అండ్‌ సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు

మెర్న్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: కోడ్‌ టిక్కి
స్టైపెండ్‌: నెలకు రూ.1,000
దరఖాస్తు గడువు: నవంబరు 2
అర్హతలు: బూట్‌స్ట్రాప్‌, ఎక్స్‌ప్రెస్‌.జేఎస్‌, హెచ్‌టీఎంఎల్‌ అండ్‌ సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్‌, మైఎస్‌క్యూఎల్‌, నోడ్‌.జేఎస్‌, రియాక్ట్‌జేఎస్‌, రెస్ట్‌ ఏపీఐ నైపుణ్యాలు

internshala.com/i/a54ce7

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: యాడ్‌కార్‌టెక్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 2
అర్హతలు: అమెరికన్‌ ఇంగ్లిష్‌, బ్లాగింగ్‌, కేన్వా, క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-వర్డ్‌, ఎస్‌ఈఓ, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/defeba

సొల్యూషన్‌ గ్రాఫ్‌ సంస్థలో...

1 ఆపరేషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: నవంబరు 1
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/1d17d9

2 హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: నవంబరు 1
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/f964f2

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: సింద్రి సిస్టమ్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 1
అర్హతలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌ నైపుణ్యం

internshala.com/i/9a78ca

టీమ్‌ లీడింగ్‌ (సేల్స్‌)

సంస్థ: యూలీడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,000-2,000
దరఖాస్తు గడువు: నవంబరు 1
అర్హతలు: ఇంగ్లిష్‌ రాయడం, మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యాలు

internshala.com/i/942f78

వీడియో ఎడిటింగ్‌

సంస్థ: టెంట్‌ ఎన్‌ ట్రయల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000-7,500
దరఖాస్తు గడువు: నవంబరు 1
అర్హతలు: యానిమేషన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, వీడియో ఎడిటింగ్‌, వీడియో మేకింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/ab480e

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

నోటిఫికెషన్స్ | ప్రభుత్వ ఉద్యోగాలు | టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌లు పోస్టులు 51 | వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో... పోస్టులు 71 | వాక్‌ ఇన్స్‌ 1. ఫీల్డ్‌ స్టాఫ్‌ 2. ఆఫీస్‌ స్టాఫ్‌ (అకౌంట్స్‌) 3. ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్‌) | 1. ఫీల్డ్‌ స్టాఫ్‌ 2. ఆఫీస్‌ స్టాఫ్‌ (అకౌంట్స్‌) 3. ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్‌)

దేహ్రాదూన్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం (ఐఐపీ)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రభుత్వ ఉద్యోగాలు

టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌లు

పోస్టులు 51

దేహ్రాదూన్‌లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం (ఐఐపీ)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 24  
2. టెక్నీషియన్‌-1: 27 

మొత్తం పోస్టుల సంఖ్య: 51.
విభాగాలు: మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఈఈఈ/ సివిల్‌/ కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జర్నలిజం.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 09-11-2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్‌: టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.35,400-రూ.1,12,400. టెక్నీషియన్‌కు రూ.19,900 - రూ.63,200.
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09-11-2023.
దరఖాస్తు హార్డ్‌ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 19-11-2023.

వెబ్‌సైట్‌: https://devapps.ngri.res.in/iip2023/pas_advt.jsp

వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌లో...

పోస్టులు 71

పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌- వెక్టార్‌ కంట్రోల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద టెక్నికల్‌ కేడర్‌లో రెగ్యులర్‌ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. టెక్నికల్‌ అసిస్టెంట్‌: 20  
2. టెక్నీషియన్‌-1: 30
3. ల్యాబొరేటరీ అటెండెంట్‌-1: 21 

మొత్తం పోస్టుల సంఖ్య: 71.
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా.
వయసు: 08-11-2023 నాటికి టెక్నికల్‌ అసిస్టెంట్‌కు 30 ఏళ్లు, టెక్నీషియన్‌కు 28 ఏళ్లు, ల్యాబ్‌ అటెండెంట్‌కు 25 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08-11-2023.

వెబ్‌సైట్‌: https://joinicmr.in/login/user

వాక్‌ ఇన్స్‌

ఆదిలాబాద్‌ కాటన్‌ కార్పొరేషన్‌లో..

ఆదిలాబాద్‌లోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

1. ఫీల్డ్‌ స్టాఫ్‌
2. ఆఫీస్‌ స్టాఫ్‌ (అకౌంట్స్‌)
3. ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్‌)

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్‌).
వయసు: 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు ఆఫీస్‌ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్‌ స్టాఫ్‌కు రూ.36,000.
ఇంటర్వ్యూ తేదీ: అక్టోబరు 28, 29, 30
స్థలం: ది కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, ఆదిలాబాద్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌, మంగళ్‌మూర్తి టవర్‌, సినిమా రోడ్డు, ఆదిలాబాద్‌.

వెబ్‌సైట్‌: https://cotcorp.org.in/Recruitment.aspx

రాయగడ కాటన్‌ కార్పొరేషన్‌లో..

ఒడిశా రాష్ట్రం రాయగడలోని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

1. ఫీల్డ్‌ స్టాఫ్‌
2. ఆఫీస్‌ స్టాఫ్‌ (అకౌంట్స్‌)
3. ఆఫీస్‌ స్టాఫ్‌ (జనరల్‌)

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్‌).
వయసు: 01.10.2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు ఆఫీస్‌ స్టాఫ్‌కు రూ.24,000. ఫీల్డ్‌ స్టాఫ్‌కు రూ.36,000.
ఇంటర్వ్యూ తేదీ: నవంబరు 02, 03
స్థలం: ది కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, జ్యోతి మహల్‌ హోటల్‌ దగ్గర, కాన్వెంట్‌ రోడ్డు, రాయగడ, ఒడిశా.