ఇంటెలిజెన్స్ బ్యూరో టెన్త్ అర్హతతో దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని
సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన
సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
చేసింది. ఈ పోస్టుల్లో విజయవాడ సబ్సిడీ ఇంటెలిజెన్స్ బ్యూరోకు 17,
హైదరాబాద్ సబ్సిడీ ఇంటెలిజెన్స్ బ్యూరోకు 15 కేటాయించారు. పదో
తరగతితో సెంట్రల్ కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం. ఈ
నేపథ్యంలో సెలెక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి
తెలుసుకుందాం..
టెన్త్‌తో సెంట్రల్ కొలువు సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇంటెలిజెన్స్
బ్యూరో మంచి ఛాన్స్ ఇచ్చింది. భవిష్యత్‌కు భరోసా ఇచ్చే మంచి ఉద్యోగం ఐబీలో
సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టులతో దక్కుతుంది. ఈ కొలువులు
సాధించడానికి మంచి ప్లాన్‌తో ప్రిపరేషన్ మొదలుపెడితే సక్సెస్ కావచ్చు.
ఎగ్జామ్ ప్యాటర్న్ : రాతపరీక్ష, డాక్యుమెంట్
వెరిఫికేషన్, వైద్యపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
టైర్-1లో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, నాలుగు పార్ట్‌లు
ఉంటాయి. పార్ట్- ఎ) జనరల్ అవేర్‌నెస్ (40 మార్కులు), బి)
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (20 మార్కులు), సి) న్యూమరికల్,
అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ (20 మార్కులు),
ఇంగ్లీష్ లాంగ్వేజ్ (20 మార్కులు). పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
ప్రతి ప్రశ్నకూ 1 మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 వంతు
మార్కు తగ్గిస్తారు. టైర్-2 పరీక్షను రెండు పోస్టులకు వేర్వేరుగా 50
మార్కులకు నిర్వహిస్తారు. ఎస్‌ఏ/ఎంటీ పోస్టులకు మోటార్ మెకానిజమ్,
డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ఇన్‌స్ట్రక్టర్ ఆదేశాల మేరకు అభ్యర్థులు మోటార్ వెహికల్
నడపాలి. అభ్యర్థికి ఉండే ప్రాక్టికల్ నాలెడ్జ్‌నూ, చిన్న మరమ్మతులు,
వాహన నిర్వహణ నైపుణ్యాన్నీ పరీక్షిస్తారు. ఈ పరీక్షలో అన్‌రిజర్వుడ్,
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 35 శాతం, ఓబీసీ 34, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 33
శాతం కనీసార్హత మార్కులు సాధించాలి.
– టైర్-2లో భాగంగా.. ఎంటీఎస్/జనరల్ అభ్యర్థులకు ఇంగ్లీష్
లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌లో డిస్క్రిప్టివ్ టెస్ట్
ఉంటుంది. 150 పదాలతో ఇంగ్లీష్‌లో వ్యాసం రాయాలి. వొకాబులరీ, గ్రామర్,
సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటనిమ్స్, కరెక్ట్ యూసేజ్,
కాంప్రహెన్షన్ ఉంటాయి. పరీక్ష వ్యవధి గంట. దీంట్లో 20 శాతం కనీస అర్హత
మార్కులు సాధించాలి.
– టైర్-1లో సాధించిన మార్కుల ఆధారంగానే ఎంటీఎస్ అభ్యర్థుల తుది
ఎంపిక ఉంటుంది. టైర్-2 అనేది ఎంటీఎస్ అభ్యర్థులకు అర్హత పరీక్ష
మాత్రమే. టైర్-1, టైర్-2లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎస్‌ఏ/ఎంటీ
అభ్యర్థుల ఫైనల్ రిజల్ట్ ఇస్తారు.
ప్రీవియస్ పేపర్స్‌పై ఫోకస్: జనరల్
అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్/
అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్
లాంగ్వేజ్‌ల నుంచి బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌లో వచ్చిన ప్రీవియస్ పేపర్స్
ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌కు 40 మార్కులు
కేటాయించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను
పరీక్షిస్తారు. న్యూస్ పేపర్స్ చదవడం, టీవీలో వార్తలు చూడటాన్ని అలవాటు
చేసుకోవాలి. మాక్ టెస్టులతో మంచి ఫలితం ఉంటుంది.
జనరల్ అవేర్‌నెస్ : కరెంట్ అఫైర్స్ లో అంతర్జాతీయ,
జాతీయ అంశాలు, క్రీడలు, వార్తల్లోని వ్యక్తులు, నియామకాలు, అవార్డులు,
సదస్సులు, పథకాలు వంటి సమాచారాన్ని కనీసం మూడు నెలల ముందు నుంచి తప్పకుండా
చదవాలి. జనరల్ నాలెడ్జ్ లో దేశాల రాజధానులు, కరెన్సీలు వివిధ దేశాల
అధిపతులు, దినోత్సవాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ
రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, జాతీయ
పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. ఆర్థిక
వ్యవస్థ, కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారం
తెలుసుకోవాలి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్: గత ప్రశ్నపత్రాల్లో ఇడియమ్స్,
సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ రీ ఎరేంజ్‌మెంట్, వన్ వర్డ్
సబ్‌స్టిట్యూట్స్, అంటోనిమ్స్, సిననిమ్స్ వంటి టాపిక్స్ నుంచి
ఒక్కో అంశంలోనే నేరుగా ఐదు ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి నేర్చుకునే టాపిక్‌ను
పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇంగ్లీష్ లో వొకాబులరీతోనే సగానిపైగా మార్కులు
పొందవచ్చు. గ్రామర్ తో పాటు జనరల్ ఇంగ్లీష్ స్కిల్స్ పెంచుకోవాలి.
ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్, చానళ్లలో ఉపయోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం
వంటి వాటిని పరిశీలించాలి. చదవడం కంటే వినడం వల్ల ఎక్కువ విషయాలు
గుర్తుంటాయి కాబట్టి వేగంగా, ఎక్కువగా చదవడం వల్ల పరీక్షలో ప్రశ్నలను
సులభంగా, తొందరగా అర్థం చేసుకోవచ్చు.
సిలబస్
రీజనింగ్ ఎబిలిటీ : ప్రీవియస్ పరీక్షలో సిట్టింగ్
అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్,
కోడింగ్–డీకోడింగ్, డైరెక్షన్స్ అనే 5 టాపిక్‌ల నుంచే దాదాపు అన్ని
ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి ఆయా టాపిక్‌ల్లో ఉన్న అన్ని మోడల్స్, మెథడ్స్
సాధన చేయాలి. వీటితో పాటు అనాలజీ, క్లాసిఫికేషన్స్, బ్లడ్ రిలేషన్స్,
డైరెక్షన్స్, నంబర్ టెస్ట్, ర్యాంకింగ్ టెస్ట్ వంటి వర్బల్ రీజనింగ్
టాపిక్స్ పై దృష్టి పెట్టాలి. కోర్సెస్ ఆఫ్ యాక్షన్, ఇన్‌పుట్,
అవుట్‌పుట్, కాజ్ అండ్ ఎఫెక్ట్,
స్టేట్‌మెంట్-ఇన్‌ఫరెన్స్, మిర్రర్ ఇమేజస్, వాటర్ ఇమేజస్,
పేపర్ ఫోల్డింగ్, పేపర్ కట్టింగ్, ప్యాటర్న్ కంప్లీషన్, ఎంబెడ్డెడ్
ఫిగర్స్ వంటి నాన్‍వర్బల్ రీజనింగ్ అంశాలు ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ /న్యూమరికల్ ఎబిలిటీ : ఈ
విభాగంలో అర్థమెటిక్ అంశాలైన పర్సెంటేజెస్, నిష్పత్తులు, లాభనష్టాలు,
నంబర్ సిరీస్, బాడ్‌మాస్ రూల్స్ పై పట్టు సాధించాలి. వీటితోపాటు డేటా
ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
నంబర్ సిరీస్, నంబర్ సిస్టం, సింప్లిఫికేషన్స్, ఎల్‍సీఎం, హెచ్‍సీఎం,
రూట్స్ అండ్ క్యూబ్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ప్లాబ్లమ్స్ ఆన్ ఏజెస్,
పని–కాలం, పని–దూరం, ట్రైన్స్ వంటి వాటిని ప్రీవియస్ పేపర్లలో వచ్చిన
ప్రశ్నల ఆధారంగా సాధన చేయాలి. ఈ విభాగంలో వేగంగా సాధించేలా ప్రాక్టీస్
చేస్తూ క్వికర్ మ్యాథ్స్ మెథడ్స్, షార్ట్‌కట్స్ నేర్చుకోవడం వల్ల
ఎగ్జామ్‌లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేయవచ్చు. గత పరీక్షల్లో
ఎక్కువగా నంబర్ సిరీస్, డేటా సఫీషియన్సీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్,
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఆర్థమెటిక్ టాపిక్‌ల నుంచే ప్రశ్నలిచ్చారు.
కాబట్టి వీటిపై ఫోకస్ చేయడం అవసరం.
నోటిఫికేషన్
ఖాళీలు : మొత్తం 677 పోస్టుల్లో సెక్యూరిటీ
అసిస్టెంట్/ మోటార్ ట్రాన్స్‌పోర్ట్: 362, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
(జనరల్) : 315 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు : ఎంటీఎస్ ఖాళీలకు మెట్రిక్యులేషన్ (10వ
తరగతి) ఉత్తీర్ణత. ఎస్‌ఏ/ ఎంటీ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్‌తో
ఏడాది పని అనుభవంతో పాటు మోటార్ మెకానిజం నాలెడ్జ్ ఉండాలి. ఎస్‌ఏ/ ఎంటీ
పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు. ఎంటీఎస్ ఖాళీలకు 18- నుంచి 25
సంవత్సరాల మధ్య ఉండాలి. నెలకు ఎస్‌ఏ/ ఎంటీ పోస్టులకు రూ.21,700 –
రూ.69,100. ఎంటీఎస్ ఖాళీలకు రూ.18,000 - రూ.56,900 చెల్లిస్తారు.
సెలెక్షన్ ప్రాసెస్: టైర్-1 రాత పరీక్ష
(ఆబ్జెక్టివ్), టైర్-2 రాత పరీక్ష (డిస్క్రిప్టివ్)- ఎంటీఎస్ పోస్టులకు
మాత్రమే, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ (ఎస్‌ఏ/ ఎంటీ పోస్టులకు మాత్రమే),
ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్
సెలెక్షన్ ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్,
వరంగల్‌లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి.
దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.mha.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html