14, నవంబర్ 2023, మంగళవారం

రక్తపోటు పెరిగితే? ముప్పు ముంచుకొచ్చే ముందు వరకూ తెలియదు. అలాంటిదే ‘హైపర్‌టెన్షన్‌’ కూడా! చాప కింద నీరులా పాకుతూ ఏకంగా గుండెకే చేటు చేసేంత ప్రమాదకరంగా పరిణమించే నిశ్శబ్ద రుగ్మత ఇది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

ముప్పు ముంచుకొచ్చే ముందు వరకూ తెలియదు. అలాంటిదే ‘హైపర్‌టెన్షన్‌’ కూడా! చాప కింద నీరులా పాకుతూ ఏకంగా గుండెకే చేటు చేసేంత ప్రమాదకరంగా పరిణమించే నిశ్శబ్ద రుగ్మత ఇది. కాబట్టి అధిక రక్తపోటు లక్షణాల కోసం ఎదురు చూడకుండా, తరచుగా బీపీ పరీక్ష చేయించుకుంటూ అప్రమత్తంగా ఉండాలంటున్నారు వైద్యులు.

నల్లాలో నీరు తగినంత ఫోర్స్‌తో వస్తేనే ధార చక్కగా పడుతుంది. నీటి వేగం ఎక్కువైనా, తక్కువైనా ధారలో తేడా వచ్చినట్టే, రక్తనాళాల్లో ప్రవహించే రక్తపు ఒత్తిడిలో హెచ్చుతగ్గులైనా రక్తపోటులో తేడా వస్తుంది. ప్రతి వ్యక్తి శరీరంలోని రక్తంలో కొంత ప్రెషర్‌ ఉంటుంది. ఆ ప్రెషర్‌ వల్లే గుండె నుంచి రక్తం శరీరంలోని ప్రతి ఒక్క రక్తనాళంలోకి సక్రమంగా స్రవిస్తుంది. ఆ ప్రెషర్‌ అవసరానికి మించి ఎక్కువ ఉంటే ఆ పరిస్థితినే ‘హైపర్‌టెన్షన్‌’ అంటారు. 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువాళ్లకు బ్లడ్‌ ప్రెషర్‌ 140/90 వరకూ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. పసికందులు, స్కూలుకి వెళ్లే వయసు పిల్లలకు బీపీ ఇంకా తక్కువగా ఉంటుంది. అది సాధారణమే! ఇక 50 ఏళ్లు దాటిన వారికి వయసుతోపాటు బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది. రక్తపోటు పెరిగిపోతే ఆ ప్రభావం ప్రధానంగా గుండె మీద పడుతుంది. వేగంగా గుండెకు రక్తం చేరుతూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో గుండె కండరాలు, కవాటాల్లో సమస్యలు మొదలవుతాయి. రక్తాన్ని వడగట్టే మూత్ర పిండాలు కూడా దెబ్బతింటాయి. అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? ఎవరికొస్తుంది? అనే విషయాల్లోకి లోతుగా వెళ్తే కచ్చితమైన సమాధానం దొరకకపోవచ్చు. హైపర్‌టెన్షన్‌కు ఎన్నో కారణాలుంటాయి. వయసుతో పని లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా హైపర్‌టెన్షన్‌ రావొచ్చు. అయితే అధిక రక్తపోటుకు దారితీసే పరిస్థితులు ప్రధానంగా కొన్ని ఉన్నాయి. అవేంటంటే....

అధిక బరువు: అధిక బరువు వల్ల శరీరం లావవుతుంది. దాంతో చర్మం ఉపరితలం వరకూ రక్తసరఫరా జరపటం కోసం రక్తనాళాలు చెట్టు కొమ్మల్లా పెరుగుతూ పోతాయి. వాటి చివర్ల వరకూ రక్తం సరఫరా కావాలంటే రక్తం ఫోర్స్‌ పెరగాలి. ఇందుకోసం గుండె మరింత బలంగా రక్తాన్ని పంప్‌ చేయాలి. ఇదే పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే రక్తంలో ప్రెషన్‌ పెరిగిపోయి హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తుంది.

ఒత్తిడి: మానసికం, శారీరకం...ఒత్తిడి ఎలాంటిదైనా దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. దాంతో రక్తపోటు పెరుగుతుంది. మరీ ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ఒత్తిడితో కూడిన జీవనవిధానాన్ని అవలంబించేవాళ్లు హైపర్‌టెన్షన్‌కి తేలికగా గురవుతారు.

అస్థవ్యస్త జీవనశైలి: సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకపోవటం, రోజుల తరబడి నిద్రకు దూరం కావటం, భోజనానికి నియమిత వేళలు పాటించకపోవటం...ఇలాంటి అస్తవ్యస్త జీవనశైలిని అనుసరించినా అధిక రక్తపోటు ఖాయమే!

అధిక ఉప్పు: ఉప్పు (సోడియం క్లోరైడ్‌)లో ఉండే ‘సోడియం’ వల్లే ముప్పంతా! కాబట్టి సోడియం ఉండే పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల కూడా అధిక రక్తపోటు వస్తుంది.

దురలవాట్లు: హైపర్‌టెన్షన్‌కు మద్యపానం, ధూమపానం కూడా కారణమే! ధూమపానం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి రక్త సరఫరా ఇబ్బందికరంగా మారుతుంది. దాంతో గుండె రక్తాన్ని బలంగా పంప్‌ చేయాల్సి వస్తుంది. ఫలితంగా గుండె మీద ఒత్తిడి పెరిగి హైపర్‌టెన్షన్‌ మొదలవుతుంది. మద్యపానం వల్ల కూడా బీపీ పెరుగుతుంది. మద్యపానం వల్ల రక్తపోటు పెరుగుతుందనే విషయం మనలో చాలామందికి తెలియదు. మద్యపానం ప్రస్తుతం ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ కావటంతో వారాంతాల్లో మద్యం సేవించటం పరిపాటిగా మారింది. వీకెండ్స్‌లో మద్యం సేవించి సోమవారంనాడు హై బీపీతో వైద్యుల్ని కలిసేవాళ్ల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది.

ఆధునిక జీవనశైలి: గ్రామీణ జీవనశైలిని గడిపే వాళ్లలో రక్తపోటు సమంగా ఉండటం, పట్ణణీకరణ పెరిగిన తర్వాత బీపీ పెరగటం వైద్యపరమైన పరిశీలనల్లో కనిపించింది. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఇప్పుడు గ్రామీణుల్లో కూడా అధిక రక్తపోటు సర్వసాధారణమైపోయింది. ఇందుకు కారణం గ్రామాల్లో పట్టణ వాతావరణం ఉండటమే!

మధుమేహం: మధుమేహం ఉన్నా ఆ ప్రభావం బ్లడ్‌ ప్రెషర్‌ మీద పడుతుంది. దాంతో మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకపోతే రక్తపోటు పెరుగుతుంది.

లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు

రక్తపోటు ఉన్న వాళ్లలో చాలామందికి ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలతో వైద్యుల్ని సంప్రదించినప్పుడు వైద్య పరీక్షల్లో ఈ విషయం బయటపడితే తప్ప తమంతట తాముగా రక్తపోటు ఉన్న విషయాన్ని ఎక్కువశాతం మంది గ్రహించలేరు. అయితే ఇదే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతే మాత్రం కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటంటే...

• గుండె దడ

• తలనొప్పి, చమటలు పట్టడం

• కళ్లు తిరగటం

• ఆయాసం

చికిత్స తేలికే!

రక్తపోటును మందులతో నియంత్రించవచ్చు. అయితే మందులు సక్రమంగా వాడుతున్నా రక్తపోటు అదుపులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి క్రమం తప్పకుండా నెలకోసారి బీపీ పరీక్షించుకుంటూ ఉండాలి. దాన్నిబట్టి వైద్యులు మందుల పవర్‌ పెంచటం, తగ్గించటం చేస్తారు. కొన్నిసార్లు మందుల ప్రభావం ఎక్కువై బీపీ తగ్గిపోతుంది కూడా! అలాంటప్పుడు రక్తపోటును స్థిరంగా ఉంచే మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది.

హైపర్‌టెన్షన్‌ని నిర్లక్ష్యం చేస్తే?

35 ఏళ్ల వయసు నుంచి నెలకొకసారి బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. ఇలాకాకుండా లక్షణాలు కనిపించలేదు కదా! అని రక్తపోటు కలిగి ఉండీ బీపీ పరీక్షించుకోవటం నిర్లక్ష్యం చేస్తే...అంతర్లీనంగా జరగరాని నష్టం జరిగిపోతుంది. రక్తపోటును సరిచేయకుండా వదిలేస్తే ఒత్తిడి పెరిగి గుండె పెద్దదవుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే హార్ట్‌ ఫెయిల్‌ అవ్వొచ్చు. ఇదేకాకుండా రోగికి మూత్రపిండాలు కూడా ఫెయిల్‌ అవ్వొచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ప్రెషర్‌ పెరిగిపోయి లేదా రక్తనాళాలు చిట్లిపోయి పెరాలసిస్‌ స్ట్రోక్‌ రావొచ్చు.

హైవర్‌టెన్షన్‌ అదుపులో ఉండాలంటే?

రక్తపోటు అదుపులో ఉంచుకోవటం మన చేతుల్లో పనే! ఇందుకోసం అనుసరించివలసిన నియమాలు...

• మందులు సక్రమంగా వాడాలి. రక్తపోటుకు చికిత్స దీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి వైద్యులు సూచించినంత కాలం క్రమం తప్పకుండా మందులు వాడాలి.

• ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, సోడా ఉప్పు వేసి వండిన వడలు, గారెలు, బజ్జీలు, బ్రెడ్‌, బిస్కెట్లు, కేక్‌లు లాంటివి తినకూడదు. అలాగే సాల్టెడ్‌ చిప్స్‌, బిస్కెట్లు కూడా మానేయాలి.

• వ్యాయామం చేయటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ కనీసం అరగంటపాటైనా నడక లేదా జాగింగ్‌ చేయాలి.

హైపర్‌టెన్షన్‌

ఉప్పు అన్నిట్లోనూ!

మనం తినే ప్రతి కూరగాయలో, పళ్లల్లో, ఆకు కూరల్లో సహజసిద్ధంగానే కొంత ఉప్పు ఉంటుంది. వీటితో శరీరానికి సరిపడా సోడియం అందుతుంది. అయినా మనం రుచి కోసం వండేటప్పుడు ఉప్పును జోడిస్తూ ఉంటాం. నిజానికి ఇలా ఉప్పు అనేదే వాడకుండా ఆహారం తినగలిగితే రక్తపోటు అనేదే రాదు. ఇలా ఉప్పు వాడే సంప్రదాయం లేని జాతులు కొన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. వాళ్లలో రక్తపోటు కనిపించకపోవటాన్ని వైద్యులు గమనించారు. దీన్నిబట్టి ఉప్పు నియంత్రిస్తే రక్తపోటు అదుపులో ఉంటుందని రుజువైంది కాబట్టి ఆహారంలో ఉప్పు వాడకం సాధ్యమైనంత తగ్గించాలి. కొంతమంది భోజనం చేస్తున్నప్పుడు కూరలో ఉప్పు తక్కువైందని కలిపేసుకుంటూ ఉంటారు. అలాగే పెరుగన్నం కూడా ఉప్పు లేనిదే తినరు. ఈ అలవాట్లు మానుకోవాలి. ఇంట్లో బిపి పేషెంట్లు ఉన్నప్పుడు వంటల్లో ఉప్పు సాధ్యమైనంత తక్కువ వాడాలి.

యోగాతో

రక్తపోటు స్థిరత్వం

యోగా వల్ల ఒరిగే అత్యంత ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల్లో రక్తపోటు అదుపులో ఉండటం ఒకటి. యోగా వల్ల సిస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 140 ఒక పది మిల్లీమీటర్లు, డయాస్టాలిక్‌ బ్లడ్‌ ప్రెషర్‌...అంటే 140/90లో 90 ఒక ఐదు మిల్లీమీటర్ల దాకా తగ్గుతుంది. రక్తపోటును తగ్గించే వ్యాయామంగా యోగా అంతర్జాతీయంగా ఆమోదం పొందింది. యోగాతోపాటు ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌ల వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. 


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

సాయుధ బలగాల ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), సీఆర్పీఎఫ్ విభాగాల్లోని కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రామ్క ఫౌండేషన్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నాయి. సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా కేంద్రం 80 వేలకు పైగా ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది. ఇందుకు అర్హులైన యువతకు హైదరాబాద్, గుంటూరులో ఆయా ఫౌండేషన్లు ఈనెల 26న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 29న ఫలితాలు ప్రకటిస్తాయి. ఇందులో అర్హత సాధించిన 600 మంది అభ్యర్థులకు డిసెంబరు 2 నుంచి వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇచ్చి శిక్షణ ఇవ్వనున్నారు. వివరాలకు 9703651233ని సంప్రదించాలన్నారు.

15 నుంచి ఐసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

15 నుంచి ఐసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ రామమోహనరావు తెలిపారు.

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ను ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ రామమోహనరావు తెలిపారు. రిజిస్ట్రేషన్లు 15-17, ధ్రువపత్రాల పరిశీలన 16-18, కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ఐచ్ఛికాల నమోదు 17-19, వెబ్‌ఐచ్ఛికాల మార్పు 20, సీట్ల కేటాయింపును 22 తేదీల్లో చేయనున్నట్లు వెల్లడించారు. సీట్లు పొందిన అభ్యర్థులు 23వ తేదీ లోపు కళాశాలలో రిపోర్టు చేయాలని సూచించారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

13, నవంబర్ 2023, సోమవారం

AP Govt : ఆ 21 కులాలు ఇకపై రాష్ట్రమంతటా బీసీలే, భౌగోళిక పరిమితులు తొలగింపు | AP Govt: Those 21 castes are now BC across the state, removal of geographical restrictions

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

AP Govt : భౌగోళిక పరిమితుల కారణంగా కొన్ని ప్రాంతాలకే బీసీలుగా పరిగణిస్తు్న్న 21 కులాలు, ఉపకులాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రాంతంతో సంబంధం లేకుండా వారందరినీ బీసీలుగా పరిగణిస్తామని ప్రకటించింది.

ఏపీ ప్రభుత్వం

AP Govt : ఏపీ ప్రభుత్వం బీసీ ఉపకులాలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీసీలుగా పరిగణించే 21 కులాలు, ఉపకులాలకు భౌగోళిక పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రాంతం, భౌగోళిక పరిమితులు లేకుండా ఆ 21 కులాలు, ఉపకులాలను రాష్ట్ర వ్యాప్తంగా బీసీలుగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో 138 కులాలను వెనుకబడిన తరగతులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 21 కులాలపై భౌగోళిక పరిమితులు ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారీగా ఈ 21 కులాలను బీసీలుగా పరిగణిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బీసీలుగా పరిగణించడంలేదు.

ఇకపై బీసీ సర్టిఫికేట్

దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 21 కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రమంతటా వీరిని బీసీలుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ 21 కులాలు, ఉపకులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే రాయలసీమ ప్రాంతంలో కల్లుగీతపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం ఇది వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.

ఆ 21 కులాలివే!

  • బీసీ-ఏ గ్రూపులో ఆరు కులాలు, వాటి ఉపకులాలకు భౌగోళిక పరిమితులు తొలగించారు. పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలను బీసీ జాబితాలో చేర్చారు.
  • బీసీ-బి గ్రూపులో నాలుగు కులాలు, వాటి ఉపకులాలను చేర్చారు. గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), అచ్చుకట్లవాండ్లు, కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమలో తప్ప), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల కులాలను బీసీ జాబితాలో చేర్చారు.
  • బీసీ-డి గ్రూపులో 11 కులాలు, వాటి ఉపకులాలు చేర్చారు. మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, నగరాలు, అయ్యరక, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ వైశ్య కులాలను బీసీ లిస్ట్ లో చేర్చారు.
 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

DOT | సిమ్ కార్డు సర్వీస్ పేరిట సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తు.. డాట్ ఏమOదంటే..?!

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 
🔊DOT | సిమ్ కార్డు సర్వీస్ పేరిట సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తు.. డాట్ ఏమన్నదంటే..?!

🍥DOT | సిమ్ కార్డు సర్వీసు నిలిపివేస్తారనే పేరుతో సైబర్ మోసగాళ్లు మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరించి.. రకరకాల మోసాలకు పాల్పడుతున్నారని కేంద్ర టెలికం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అటువంటి కాల్స్ ను నమ్మొద్దని హితవు చెప్పింది.

🌀DOT | సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలకు తెర తీస్తున్నారు. ఇటీవల కొందరు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి.. మరో రెండు గంటల్లో కేంద్ర టెలికం శాఖ మీ సిమ్ కార్డ్ సర్వీసు నిలిపేస్తుందని చెబుతున్నారు. అలా జరుగొద్దంటే తాము అడిగిన వివరాలు చెప్పాలంటున్నారు. అలాంటి వారి మాటలు నమ్మిన మొబైల్ యూజర్లు తమ వ్యక్తిగత వివరాలు చెబుతున్నారు. మొబైల్ యూజర్ల వ్యక్తిగత డేటాతో సైబర్ మోసగాళ్లు పలు రకాల మోసాలు చేస్తున్నారని కేంద్ర టెలికం శాఖ (డాట్) తెలిపింది.

💠ఇటువంటి కాల్స్ ను నమ్మొద్దని పేర్కొంటూ మొబైల్ యూజర్లకు టెలికం శాఖ కీలక హెచ్చరికలు చేసింది. ఇటువంటి కాల్స్ వస్తే మొబైల్ ఫోన్ యూజర్లు తమ నెట్ వర్క్ ప్రొవైడర్‌ని సంప్రదించాలని సూచించింది. యూజర్ల వ్యక్తిగత డేటా తాము సేకరించబోమని, సిమ్ కార్డు సర్వీసుల విషయమై వచ్చే మోసపూరిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హితవు చెప్పింది.

✳️మోసపూరిత కాల్స్‌పై నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీసీఆర్పీ)కి ఫిర్యాదు చేయాలని డాట్ పేర్కొంది. ఇటువంటి మోసపూరిత కాల్స్‌ను అరి కట్టడానికి తాము దర్యాప్తు సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త :                              

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  గ్రామ, వార్డు సచివాలయాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మూడవ విడత నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది.

ఇందులో భాగంగా మొత్తం 20 కేటగిరీలో 14,528 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పశుసంవర్ధక సహాయకుల పోస్టులు అత్యధికంగా ఉన్నాయి. నోటిఫికేషన్ నందు                 ఉద్యానవన, పట్టు, వ్యవసాయ, మత్స్య సహాయకుల, VRO, విల్లేజ్ సర్వేయర్ తదితర పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా వీటిని ఎంపిక చేస్తారు. శాఖల పోస్టుల ఖాళీలు అర్హతలు

పోస్టు పేరుఖాళీలు

1.       పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – 182 పోస్టులు

2.       గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్-II – 112 పోస్టులు

3.       ANM (గ్రేడ్-III) (మహిళ మాత్రమే) – 618 పోస్టులు

4.       పశుసంవర్ధక సహాయకుడు – 4765 పోస్టులు

5.       విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ – 60 పోస్టులు

6.       విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ – 1005 పోస్టులు

7.       విలేజ్ వ్యవసాయ అసిస్టెంట్ – 467 పోస్టులు

8.       విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ – 23 పోస్టులు

9.       మహిళా పోలీస్ మరియు మహిళా & శిశు సంక్షేమ సహాయకుడు – 1092 పోస్టులు

10.   ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – 982 పోస్టులు

11.   పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-VI) – 134 పోస్టులు

12.   డిజిటల్ అసిస్టెంట్ – 736 పోస్టులు

13.   విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – 990 పోస్టులు

14.   సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ – 578 పోస్టులు

15.   వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 170 పోస్టులు

16.   వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 371 పోస్టులు

17.   వార్డ్ ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ – 197 పోస్టులు

18.   వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – 436 పోస్టులు

19.   వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – 157 పోస్టులు

20.   ఎనర్జీ అసిస్టెంట్ – 1127 పోస్టులు

21.   మొత్తం ఖాళీలు – 14,523 పోస్టులు

22.   AP సచివాలయం 3rd Notification 2023 కు దరఖాస్తు చేయబోవు అభ్యర్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

23.   SC, ST వారికి – 5 సంవత్సరాలు

24.   BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

25.   విద్యార్హతలు :

26.   గ్రామ రెవెన్యూ అధికారి (VRO) గ్రేడ్ II – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

27.   పంచాయితీ సెక్రటరీ (గ్రేడ్-V) – ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత

28.   ANM (గ్రేడ్-III) (మహిళలు మాత్రమే) – SSC లేదా ఇంటర్, MPHA

29.   పశుసంవర్ధక సహాయకుడుసంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా

30.   విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.F.Sc లేదా B.Sc

31.   విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్హార్టికల్చర్ విభాగంలో డిప్లొమా లేదా బియస్సి

32.   విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్అగ్రికల్చర్ విభాగంలో.....పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ లేదా B.Sc

33.   విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ఇంటర్ (ఒకేషనల్)/ B.Sc/ M.Sc (సెరికల్చర్)

34.   మహిళా పోలీస్ మరియు మహిళా  మరియు శిశు సంక్షేమ సహాయకుడుఏదైనా డిగ్రీ,

35.   ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-II) – మెకానికల్ (డిప్లొమా/డిగ్రీ)

36.   పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ VI) – ఏదైనా డిగ్రీ

37.   డిజిటల్ అసిస్టెంట్ – B.Com/ B.Sc/ డిప్లొమా లేదా డిగ్రీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్స్/ IT, ఇన్స్ట్రుమెంటేషన్), BCA

38.   విలేజ్ సర్వేయర్ (గ్రేడ్-III) – డ్రాఫ్ట్స్ మ్యాన్ లేదా ఇంటర్మీడియట్ వకేషనల్ లేదా డిప్లొమా (Civil Engg) లేదా BE లేదా BTech (సివిల్), సర్వేయర్ సర్టిఫికేట్

39.   సంక్షేమం మరియు విద్య అసిస్టెంట్ఏదైనా డిగ్రీ

40.   వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీఏదైనా డిగ్రీ

41.   వార్డ్ శానిటేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – ఏదైనా డిగ్రీ (సైన్సెస్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్)

42.   వార్డ్ ఎడ్యుకేషన్& డేటా ప్రాసెసింగ్ సెక్రటరీఏదైనా డిగ్రీ (కంప్యూటర్ సైన్స్)

43.   వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) – పాలిటెక్నిక్ డిప్లొమా (సివిల్) లేదా LAA లేదా B. Arch లేదా ప్లానింగ్ లో డిగ్రీ

44.   వార్డ్ వెల్ఫేర్ & డెవలప్మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) – డిగ్రీ (ఆర్ట్స్, హ్యుమానిటీస్)

నోటిఫికేషన్ త్వరలో విడుదల.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

12, నవంబర్ 2023, ఆదివారం

SBI Bank Jobs: SBIలో ఉద్యోగాలు పోస్టుల వివరాలు..అర్హత..వయోపరిమితి..దరఖాస్తు రుసుము..ఎంపిక ప్రక్రియ..అప్లికేషన్ లింక్ మరియు నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి: Click Here

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండి, బ్యాంక్‌లో మేనేజర్ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, SBIలో ఒక సువర్ణావకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నవంబర్ 7 నుండి డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ/మేనేజ్‌మెంట్ (సెక్యూరిటీ) పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులందరూ SBI అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ముందుగా వయోపరిమితి, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, జీతం మరియు విద్యార్హత వంటి అన్ని వివరాలను క్రింద చూడవచ్చు.

పోస్టుల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 42 పోస్టులను భర్తీ చేస్తారు. డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజ్‌మెంట్ (సెక్యూరిటీ) 42 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించబడుతోంది.

అర్హత
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

వయోపరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వారి కనీస వయస్సు 25 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు రుసుము
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ.750.. SC/ST/PWBD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ
ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరుగుతుంది.

దరఖాస్తు ఇలా 

SBI sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

హోమ్‌పేజీలో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ) / మేనేజర్ (సెక్యూరిటీ) కోసం దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.

నమోదు చేసి, ఆపై దరఖాస్తు చేయడానికి లాగిన్ చేయండి.

అప్లికేషన్ లింక్ మరియు నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి: Click Here


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html