20, నవంబర్ 2023, సోమవారం

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ Free training for the unemployed

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
జిల్లా ప్రాజెక్ట్ ఇంజినీర్-5జీ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జేసీఓ చంద్రకళ ఆదివారం తెలిపారు. రామగిరిలోని వైటీసీ బిల్డింగ్లో ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుంది. డిగ్రీ, బీటెక్, పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న వా

రు ఈ నెల 23వ తేదీలోపు సంప్రందించాలి. శిక్షణ అనం 
తరం ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. పూర్తి వివరా లకు 7702100241లో సంప్రదించవచ్చు. తలుపుల నుండి ఈ వార్త. 

Work From Home Internship Jobs ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు ఒకవేళ ఎవరైనా కట్టమంటే కట్టకండి

సికింద్రాబాద్, హైదరాబాద్,
కొంపల్లిలలో ఫైనాన్స్
సంస్థ: కమాండో కెన్నల్స్
స్టైపెండ్: నెలకు రూ.15,000-18,000
దరఖాస్తు గడువు: నవంబరు 27, 2023
అర్హతలు: అకౌంటింగ్ నైపుణ్యం

వర్క్ ఫ్రమ్ హోమ్
జావా డెవలప్మెంట్
సంస్థ: సన్ట్బేస్టేటా
స్టైపెండ్: నెలకు రూ.30,000
దరఖాస్తు గడువు: నవంబరు 24, 2023
అర్హతలు: సీఎస్ఎస్, హెచ్ఎంఎల్, జావా,
జావాస్క్రిప్ట్ యూఐ అండ్ యూఎక్స్ డిజైన్
నైపుణ్యాలు 
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్
సంస్థ: గ్లోబెల్ ట్రెండ్ స్టైపెండ్: నెలకు రూ.
5,000 దరఖాస్తు గడువు: నవంబరు 20,
2023 అర్హతలు: ఎస్ఈఓ నైపుణ్యం
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: ఎక్స్పడిపై
స్టైపెండ్: నెలకు రూ.10,000-15,000
దరఖాస్తు గడువు: నవంబరు 28, 2023
అర్హతలు: ఆడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్,
ఫొటోషాప్, ప్రీమియర్ ప్రొ. వీడియో ఎడిటింగ్

పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌ | Notification for filling up the posts in Animal Husbandry Department today

పశు సంవర్ధక శాఖలో పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (వీఏహెచ్‌ఏ) పోస్టుల భర్తీకి పశుసంవర్ధక శాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్‌ 11వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులకు డిసెంబర్‌ 27న హాల్‌టికెట్లు జారీ చేస్తారు. డిసెంబర్‌ 31వ తేదీన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు.

వేతనం రూ.22,460
ఎంపికైన వారికి రెండేళ్లపాటు ప్రొబేషన్‌ సమయంలో రూ.15 వేల చొప్పున కన్సాలిడేషన్‌ పే ఇస్తారు. ఆ తర్వాత రూ.22,460 చొప్పున ఇస్తారు. అభ్యర్థులు 18–42 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి, విద్యార్హతలు, ఇతర వివరాలు ahd.aptonline.in, https://apaha-recruitment.aptonline.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తులు కూడా ఇదే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని నిర్ధేశిత రుసుములను డిసెంబర్‌ 10వ తేదీలోగా చెల్లించాలి. దరఖాస్తులను డిసెంబర్‌ 11వ తేదీ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

ఇప్పటికే రెండు విడతల్లో 4,643 పోస్టుల భర్తీ
సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పశు సంపద ఆధారంగా 9,844 వీఏహెచ్‌ఏలు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్‌ఏలను నియమించారు. రేషనలైజేషన్‌ ద్వారా గ్రామ పరిధిలో 2–3 ఆర్బీకేలు ఉన్న చోట గ్రామాన్ని యూనిట్‌గా వీఏహెచ్‌ఏలను నియమించి, అదనంగా ఉన్న వీఏహెచ్‌ఏలను లేనిచోట్ల సర్దుబాటు చేశారు. మిగిలిన 1,896 ఆర్బీకేల పరిధిలో వీఏహెచ్‌ఏల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పోస్టుల భర్తీకి పశు సంవర్ధక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ఉమ్మడి జిల్లాల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు
జిల్లా    పోస్టుల సంఖ్య
అనంతపురం    473
చిత్తూరు    100
కర్నూలు    252
వైఎస్సార్‌    210
నెల్లూరు    143
ప్రకాశం    177
గుంటూరు    229
కృష్ణా    120
పశ్చిమ గోదావరి    102
తూర్పు గోదావరి    15
విశాఖపట్నం    28
విజయనగరం    13
శ్రీకాకుళం    34





































-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

8773 క్లర్కు కొలువులు | 8773 Clerk Vacancies

8773 క్లర్కు కొలువులు    


బ్యాంకు పరీక్షలు రాసే అభ్యర్థులందరూ  చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఎస్‌బీఐ జూనియర్‌ అసోసియేట్స్‌ (క్లర్కులు) నోటిఫికేషన్‌ విడుదలైంది. గత రెండు సంవత్సరాలుగా 5 వేల ఖాళీలతో నోటిఫికేషన్లు విడుదలవగా ఈసారి బ్యాక్‌లాగ్‌తో కలిపి 8773 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. దీనిలో తెలంగాణలో 525, ఆంధ్రప్రదేశ్‌లో 50 పోస్టులున్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారే కాకుండా డిసెంబరు 31 లోపు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకోబోయే అభ్యర్థులు  కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!

రెండు అంచెల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తొలి అంచె.. ప్రిలిమినరీ కేవలం అర్హత పరీక్ష. దీంట్లో తగిన మార్కులు సాధించి ఉత్తీర్ణులైనవారిలో ఖాళీల సంఖ్యకు 10 రెట్లమంది మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. అభ్యర్థులు మెయిన్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

సెక్షనల్‌వారీ కటాఫ్‌ లేదు

ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు రెండిట్లోనూ సెక్షనల్‌ కటాఫ్‌ మార్కులు లేవు. అంటే అభ్యర్థులు కనీస మార్కులతో సెక్షన్లవారీగా అర్హత సాధించాల్సిన అవసరం లేదు. మొత్తం పరీక్షలో కనీస మార్కుల కటాఫ్‌ ఉంటుంది. అయితే సెక్షన్లవారీగా సమయ విభజన ఉంటుంది. పరీక్షలో మంచి మార్కులు సాధించినప్పటికీ కొన్ని విభాగాల్లో కనీస మార్కులు లేక ఉత్తీర్ణులు కాలేకపోయిన సందర్భాలు ఇతర బ్యాంకు పరీక్షల్లో ఉన్నాయి. కాబట్టి ఇది అభ్యర్థులకు చాలా ఊరటనిచ్చే విషయం.

లాంగ్వేజ్‌ టెస్ట్‌

జూనియర్‌ అసోసియేట్స్‌ ఖాళీలను రాష్ట్రాలవారీగా భర్తీ చేస్తారు. కాబట్టి అభ్యర్థులకు తాము దరఖాస్తు చేసే రాష్ట్రంలోని అధికార భాషలో పట్టు ఉండాలి. అందుకే ఎంపికైనవారికి నియామకానికి ముందుగా భాషా ప్రావీణ్య పరీక్ష (లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌) నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారినే ఎంపిక చేస్తారు. అయితే అభ్యర్థులు తమ పదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో ఆ భాషను ఒక సబ్జెక్టుగా చదివినట్లయితే వారికి ఈ భాషా పరీక్ష అవసరం ఉండదు.

ఎన్ని విభాగాలు?

ప్రిలిమినరీ పరీక్షలో మూడు విభాగాలుంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌ ఎబిలిటీ. మెయిన్స్‌ పరీక్షలో నాలుగు విభాగాలు. జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌/ఫైనాన్స్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌.

ఆయా విభాగాలను వివిధ పేర్లతో వ్యవహరించినా.. పరీక్షలో ప్రశ్నలు వచ్చే విధానాన్ని అనుసరించి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల్లో మొత్తంగా నాలుగు విభాగాలని చెప్పొచ్చు. అవి- క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌. వీటి నుంచి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షల్లో గత పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గమనించి సన్నద్ధం కావాలి. గతంలో జరిగిన పరీక్షలను బట్టి వివిధ సబ్జెక్టుల్లో ఏయే టాపిక్స్‌ నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో గమనిద్దాం.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: సింప్లిఫికేషన్స్‌ 10-15 ప్రశ్నలు- ప్రిలిమ్స్‌/5 - మెయిన్స్‌), క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌ (5-6 ప్రిలిమ్స్‌/ 2-3 మెయిన్స్‌), క్వాంటిటీ కంపేరిజన్‌ (3-4 ప్రిలిమ్స్‌/మెయిన్స్‌), నంబర్‌ సిరీస్‌ (5 ప్రిలిమ్స్‌/ 2-3-మెయిన్స్‌), డేటా సఫిషియన్సీ (4-5 మ్రెయిన్స్‌), డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (5-10 ప్రశ్నలు ప్రిలిమ్స్‌/ 20-25 ప్రశ్నలు మెయిన్స్‌), అరిథ్‌మెటిక్‌ ప్రశ్నలు (10-12 ప్రిలిమ్స్‌/మెయిన్స్‌). అరిథ్‌మెటిక్‌లో అన్ని టాపిక్స్‌ బాగా చూసుకోవాలి. ఉదాహరణకు పర్సంటేజ్‌, యావరేజ్‌, రేషియో- ప్రపోర్షన్‌, పార్టనర్‌షిప్‌, ఏజెస్‌, ప్రాఫిట్‌-లాస్‌, డిస్కౌంట్‌, టైమ్‌-వర్క్‌, టైమ్‌-డిస్టెన్స్‌, ఎలిగేషన్‌, మెన్సురేషన్‌, పర్ముటేషన్‌-కాంబినేషన్‌, ప్రాబబిలిటీ మొదలైనవి.

రీజనింగ్‌: సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ అండ్‌ పజిల్స్‌ (18-20 ప్రశ్నలు ప్రిలిమ్స్‌/మెయిన్స్‌), ఇన్‌ఈక్వాలిటీ (3-5 ప్రిలిమ్స్‌), సిలాజిజమ్స్‌ (3-5 ప్రిలిమ్స్‌/మెయిన్స్‌), కోడింగ్‌-డీకోడింగ్‌ (4-5 ప్రిలిమ్స్‌/మెయిన్స్‌), బ్లడ్‌ రిలేషన్స్‌ (3-5 ప్రి/మె), ఆల్ఫా-న్యూమరికల్‌ సిరీస్‌ (3-5 ప్రి/మె), డైరెక్షన్స్‌ (2-3 ప్రిలిమ్స్‌), వర్డ్‌బేస్డ్‌ ప్రశ్నలు (2-3 ప్రి/మె), డేటా సఫిషియన్సీ (3-5 మెయిన్స్‌), ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌ (5-6 మెయిన్స్‌), లాజికల్‌ రీజనింగ్‌ స్టేట్‌మెంట్‌ సంబంధ ప్రశ్నలు (5-10 మెయిన్స్‌) మొదలైనవి..

ఇంగ్లిష్‌: ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండిట్లో గ్రామర్‌ ఆధారిత ప్రశ్నలు/ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ ఉంటాయి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ (7-10 ప్రి/మె), సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్‌, ఫ్రేజల్‌ రీ అరేంజ్‌మెంట్‌, పేరా జంబుల్‌, కరెక్ట్‌ సెంటెన్స్‌ ఫైండింగ్‌, క్లోజ్‌ టెస్ట్‌, మిస్‌ స్పెల్ట్‌, ఫిల్లర్స్‌, వర్డ్‌ స్వాప్‌, వర్డ్‌ యూసేజ్‌ మొదలైన గ్రామర్‌ ఆధారిత ప్రశ్నలు ఒక్కో మోడల్‌ నుంచి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండిట్లో 4-5 ప్రశ్నలు వస్తాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌: దీనిలో బ్యాంకింగ్‌, ఆర్థిక అంశాల ప్రాధాన్యంగా గత 6-8 నెలల తాజా పరిణామాలపై ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి. వీటితోపాటు వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు, జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలు, పుస్తకాలు-రచయితలు, అవార్డులు, క్రీడలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ మొదలైనవాటి నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు.

సన్నద్ధత ఉమ్మడిగానే!

ప్రిలిమ్‌, మెయిన్స్‌ పరీక్షలకు కలిపి ఉమ్మడిగానే ప్రిపరేషన్‌ ఉండాలి. మొదటిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్థులు వివిధ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగే టాపిక్స్‌ అన్నింటినీ త్వరగా నేర్చుకోవాలి. ఎక్కువ ప్రశ్నలు.. తక్కువ ప్రశ్నలు వచ్చే టాపిక్స్‌  గమనించి ప్రాధాన్య క్రమంలో పూర్తిచేసుకోవాలి.

  • టాపిక్స్‌ పూర్తయ్యాక వాటిలోని వివిధ మోడల్‌ ప్రశ్నలను బాగా సాధన చేయాలి. ఆపై సమయాన్ని నిర్దేశించుకుని టాపిక్‌లవారీగా టెస్టులు రాయాలి. అప్పుడే నిర్దేశిత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో అవగాహన ఏర్పడుతుంది. ఆయా ప్రశ్నల సంఖ్యను పెంచుకునేలా వేగంగా సాధించగలిగే మెలకువలు నేర్చుకోవాలి.
  • టాపిక్స్‌ అన్నీ పూర్తయ్యేవరకూ వేచి చూడకుండా ప్రారంభం నుంచే ప్రతిరోజూ పరీక్ష తరహాలోని మోడల్‌ పేపర్‌ను ఆన్‌లైన్‌ పద్ధతిలో రాయాలి. దీనవల్ల పరీక్ష విధానానికి అలవాటుపడతారు. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలు సాధించగలుగుతున్నారో తెలుస్తుంది.
  • రోజుకు 10-12 గంటలు సమయం తగ్గకుండా ప్రిపేర్‌ అవ్వాలి. అప్పుడే ఈ విభాగాలన్నింటినీ పూర్తిచేసుకునే సమయం ఉంటుంది.
  • సబ్జెక్టుల ప్రాధాన్యం/ కఠినత్వాల ఆధారంగా రోజులో వాటికి సమయాన్ని కేటాయించాలి. సాధారణంగా వీటి ఆధారంగా అప్టిట్యూడ్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగాలకు 4:3:2:1 నిష్పత్తిలో సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది.

అప్రెంటిస్‌ అభ్యర్థులకు అదనపు మార్కులు

ఎస్‌బీఐలో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ పూర్తిచేసుకుని 31.10.2023 నాటికి సర్టిఫికెట్‌ పొందిన అభ్యర్థులకు మెయిన్స్‌ పరీక్షలోని మొత్తం మార్కుల్లో 2.5 శాతం.. అంటే 5 మార్కులను వారు పొందిన మార్కులకు అదనంగా కలుపుతారు. దీనివల్ల వారికి ఎంపికలో అదనపు ప్రయోజనం కలుగుతుంది.

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ మూలవేతనం రూ.19900 ఉంటుంది. డీఏ, ఇతర అలవెన్సులతో కలిపి ముంబయి లాంటి నగరంలో నెలకు దాదాపు రూ.37,000 వేతనం లభిస్తుంది. ఇది వారు పనిచేసే ప్రాంతాన్ని బట్టి మారుతుంది. ఇవి కాకుండా మెడికల్‌, లీవ్‌ఫేర్‌ మొదలైన అదనపు సదుపాయాలుంటాయి. ప్రావిడెంట్‌ ఫండ్‌, నూతన పెన్షన్‌ స్కీమ్‌ కింద పెన్షన్‌ సదుపాయం కూడా అందిస్తారు.

కెరియర్‌- పదోన్నతులు

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి చక్కటి అవకాశాలుంటాయి. ఈ బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు రాయడం, అంకితభావంతో కష్టపడి పనిచేయడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. జూనియర్‌ అసోసియేట్‌గా నియమితులైన అభ్యర్థులు అంచెలంచెలుగా ట్రైనీ ఆఫీసర్‌ (స్కేల్‌-1), డిప్యూటీ మేనేజర్‌ (స్కేల్‌-2), మేనేజర్‌ (స్కేల్‌-3), చీఫ్‌ మేనేజర్‌ (స్కేల్‌-4), అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-5), డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-6), జనరల్‌ మేనేజర్‌ (స్కేల్‌-7) వరకు చేరుకునే అవకాశాలుంటాయి.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ప్రభుత్వ ఉద్యోగాలు | ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ - అసైన్‌మెంట్‌ ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది | ఏలూరులోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌- ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 12 టైపిస్ట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. |గుంటూరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన గుంటూరు జిల్లాలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ - అసైన్‌మెంట్‌ ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఆకాశవాణిలో..

ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ - అసైన్‌మెంట్‌ ప్రాతిపదికన 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. క్యాజువల్‌ ఎడిటర్‌: 01  
2. క్యాజువల్‌ న్యూస్‌ రీడర్‌ కమ్‌ ట్రాన్స్‌లేటర్‌ (తెలుగు): 02
3. క్యాజువల్‌ బ్రాడ్‌కాస్ట్‌ అసిస్టెంట్‌ (ప్రొడక్షన్‌): 03  

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ డిప్లొమా (జర్నలిజం), డిప్లొమా (రేడియో ప్రొడక్షన్‌), తెలుగు/ఇంగ్లిష్‌ భాషల్లో ప్రావీణ్యంతోపాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 21 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.354. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీలకు రూ.266.

దరఖాస్తు: నోటిఫికేషన్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తిచేసి, అవసరమైన ధ్రువపత్రాల నకళ్లను ‘హెడ్‌ ఆఫ్‌ ఆఫీస్‌, ఆకాశవాణి, ఎంజీ రోడ్డు, విజయవాడ’ చిరునామాకు పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 28-11-2023.

వెబ్‌సైట్‌: https://prasarbharati.gov.in/


టైపిస్ట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు

ఏలూరులోని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌- ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 12 టైపిస్ట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: డిగ్రీతో కంప్యూటర్స్‌ లేదా బీఈ, బీటెక్‌/ బీసీఏ/ ఎంసీఏ లేదా డిగ్రీతో పీజీడీసీఏ, హయ్యర్‌ గ్రేడ్‌ టైప్‌ రైటింగ్‌ సర్టిఫికెట్‌.

వయసు: 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక: డిగ్రీ అకడమిక్‌ మార్కులు, తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2023

ఆన్‌లైన్‌ దరఖాస్తు: http://117.216.209.136/revcorect/


డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌, బ్లాక్‌ కోఆర్డినేటర్‌లు

గుంటూరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన గుంటూరు జిల్లాలో 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • జిల్లా కోఆర్డినేటర్‌: 01
  • జిల్లా ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌: 01
  • బ్లాక్‌ కోఆర్డినేటర్‌: 06

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు అనుభవం.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టర్‌ బంగ్లా రోడ్డు, గుంటూరు’ చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27-11-2023.  వెబ్‌సైట్‌: https://guntur.ap.gov.in/notice_category/recruitment/



అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఎయిమ్స్‌లో 142 ఉద్యోగాలు | 142 Jobs in AIIMS

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, గోరఖ్‌పుర్‌ 142 గ్రూప్‌ ఏ, బీ, సీ నాన్‌-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, గోరఖ్‌పుర్‌ 142 గ్రూప్‌ ఏ, బీ, సీ నాన్‌-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.  

ఉద్యోగాలు: ట్యూటర్‌/ క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, స్టాఫ్‌ నర్స్‌ గ్రేడ్‌-1, మెడికల్‌ సోషల్‌ వర్కర్‌, లైబ్రెరియన్‌ గ్రేడ్‌-2, టెక్నికల్‌ అసిస్టెంట్‌/ టెక్నీషియన్‌, ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-2, హాస్టల్‌ వార్డెన్‌, పీఏ టు ప్రిన్సిపల్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, క్యాషియర్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ మొదలైన 142 ఉద్యోగాలు ఉన్నాయి.

  • ట్యూటర్‌/ క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్‌.. 15 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్‌ డిగ్రీ పాసవ్వాలి. టీచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. నర్సింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేసి మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు 50 సంవత్సరాలు.
  • స్టాఫ్‌నర్స్‌ గ్రేడ్‌-1.. 57 ఉద్యోగాలు ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్‌ లేదా బీఎస్సీ (పోస్ట్‌-సర్టిఫికెట్‌)/ బీఎస్సీ నర్సింగ్‌ (పోస్ట్‌ బేసిక్‌) పాసవ్వాలి. ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌/ స్టేట్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌లో పేరు రిజిస్టర్‌ చేసుకోవాలి. 100 పడకల హాస్పిటల్‌లో స్టాఫ్‌ నర్స్‌గా మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • హాస్పిటల్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-3 (నర్సింగ్‌ ఆర్డర్లీ).. 40 ఖాళీలు ఉన్నాయి. మెట్రిక్యులేషన్‌ పాసై, హాస్పిటల్‌ సర్వీసెస్‌ సర్టిఫికెట్‌ కోర్సు (సెయింట్‌ జాన్స్‌ అంబులెన్స్‌) చేయాలి. హాస్పిటల్‌లో పనిచేసినవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ల్యాబ్‌ అటెండెంట్‌ గ్రేడ్‌-2.. 8 ఖాళీలు ఉన్నాయి. సైన్స్‌ సబ్జెక్టుతో 10+2, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.  

పోస్టును బట్టి గరిష్ఠ వయసులో తేడాలు ఉంటాయి. 21.11.2023 నాటికి కొన్ని పోస్టులకు 27, 30, మరికొన్నింటికి 35 ఏళ్లు మించకూడదు.

  • ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది.
  • ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు కేటగిరీని బట్టి మూడు నుంచి ఎనిమిదేళ్ల మినహాయింపు ఉంటుంది.
  • కేంద్ర ప్రభుత్వ గ్రూప్‌-బి అభ్యర్థులకు ఐదు నుంచి పదేళ్ల సడలింపు ఉంటుంది.
  • అన్‌ రిజర్వుడ్‌/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1770. ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1416. దివ్యాంగులకు ఫీజులేదు. పరీక్ష ఫలితాలను ప్రకటించిన తర్వాత ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల ఫీజును రిఫండ్‌ చేస్తారు.
  • ఎంపిక: అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ద్వారా ఎంపికచేస్తారు.
  • ప్రశ్నకు 1 మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు తగ్గిస్తారు.
  • పోస్టును బట్టి అవసరమైన వాటికి స్కిల్‌ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
  • సీబీటీ ఫలితాలను వెల్లడించిన తర్వాత డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తేదీని ప్రకటిస్తారు.
  • ట్యూటర్‌ పోస్ట్‌కు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇతర పోస్టులకు సీబీటీలో పొందిన మార్కుల ఆధారంగా 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  • గమనించాల్సినవి: ఆన్‌లైన్‌ టెస్ట్‌కు ముందు కాల్‌ లెటర్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. సంబంధిత సమాచారాన్ని అభ్యర్థి ఈమెయిల్‌/ ఎస్‌ఎంఎస్‌కు తెలియజేస్తారు.
  • గోరఖ్‌పుర్‌, లఖ్‌నవూ, ఎన్‌సీఆర్‌-దిల్లీల్లో ఆన్‌లైన్‌ పరీక్షను నిర్వహిస్తారు. ఈ మూడు కేంద్రాల్లో నుంచి ఒకదాన్ని అభ్యర్థి ఎంచుకోవాలి. తర్వాత దీన్ని మార్చే అవకాశం ఉండదు.
  • దరఖాస్తుకు చివరి తేదీ: 21.11.2023
  • వెబ్‌సైట్‌: https://aiimsgorakhpur.edu.in/
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html




పట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పట్నా, రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న 47 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పట్నాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పట్నా, రెగ్యులర్‌ ప్రాతిపదికన కింద పేర్కొన్న 47 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సూపరింటెండెంట్‌: 5 పోస్టులు

2. టెక్నికల్‌ అసిస్టెట్‌: 11 పోస్టులు

3. టెక్నీషియన్‌: 18 పోస్టులు

4. జూనియర్‌ అసిస్టెంట్‌(అకౌంట్స్‌): 6 పోస్టులు

5. ఆఫీస్‌ అటెండెంట్‌: 7 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి 10+2, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత/స్కిల్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా

దరఖాస్తు రుసుము: యూఆర్‌/ఈడబ్ల్యూ ఎస్‌/ఓబీసీ(ఎన్‌సీఎల్‌) కేటగిరీలకు రూ.400. ఎస్సీ/ఎస్టీలకు రూ. 200. దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబరు 28

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 29

వెబ్‌సైట్‌: https://www.nitp.ac.in/



-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html