Alerts

Loading alerts...

25, నవంబర్ 2023, శనివారం

APMSRB: ఏపీలో 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు | APMSRB: 150 Civil Assistant Surgeon Specialist Posts in AP

APMSRB: ఏపీలో 150 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు 

మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఏపీఎంఎస్‌ఆర్‌బీ)… రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వాక్-ఇన్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఏపీ డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నియంత్రణలోని ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్- స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. 

ఖాళీల వివరాలు:

సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్: 150 పోస్టులు

స్పెషాలిటీలు: జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గైనకాలజీ, అనస్థీషియా, ఈఎన్‌టీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ.

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01-07-2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. 

పే స్కేల్: నెలకు రెగ్యులర్ పోస్టులకు రూ.61,960 నుంచి రూ.1,51,37. కాంట్రాక్ట్ పోస్టులకు- గిరిజన ప్రాంతమైతే రూ.2,50,000; గ్రామీణ ప్రాంతమైతే రూ.2,00,000; పట్టణ ప్రాంతమైతే రూ.1,30,000.

ఎంపిక ప్రక్రియ: పీజీ, పీజీ డిప్లొమా, డీఎన్‌బీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ తేదీలు: 11.12.2023, 13.12.2023, 15.12.2023.

స్థలం: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆఫీస్‌, ఇ.నెం.77-21 జి, లక్ష్మి ఎలైట్ బిల్డింగ్, ప్రాతూరు రోడ్, తాడేపల్లి, గుంటూరు జిల్లా.



 

Important Links

Posted Date: 24-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

PGCIL: పీజీసీఐఎల్‌లో 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు | అర్హత: గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడులో ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత | PGCIL: 203 Junior Technician Trainee Posts in PGCIL | Eligibility: ITI (Electrical) Pass in Electrician Trade from a recognized Technical Board/Institute.

PGCIL: పీజీసీఐఎల్‌లో 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులు 

న్యూదిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్- దేశ వ్యాప్తంగా పీజీసీఐఎల్‌ రీజియన్/ కార్యాలయాల్లో రీజినల్‌ రిక్రూట్‌మెంట్ స్కీం కింద జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ కింద రూ.18,500 స్టైపెండ్‌ అందుతుంది. శిక్షణ అనంతరం జూనియర్‌ టెక్నీషియన్‌ డబ్ల్యూ-3 హోదాలో నియమితులవుతారు. నెలకు రూ.21,500 నుంచి రూ.74,000 వేతనం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

రీజియన్‌: నార్తెర్న్‌, ఈస్ట్రన్‌, నార్త్‌- ఈస్ట్రన్‌, సదరన్‌, వెస్ట్రన్‌.

ఖాళీల వివరాలు:

* జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ: 203 పోస్టులు (యూఆర్‌- 89, ఓబీసీ- 47, ఎస్సీ- 39, ఎస్టీ- 10, ఈడబ్ల్యూఎస్‌- 18, పీహెచ్‌- 08, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌- 19, డీఎక్స్‌ ఎస్‌ఎం- 5)

విభాగం: ఎలక్ట్రీషియన్‌.

అర్హత: గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడులో ఐటీఐ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత.

వయోపరిమితి: 12.12.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. 

పే స్కేల్: నెలకు రూ.21,500- రూ.74,000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 12-12-2023

రాత పరీక్ష తేదీ: జనవరి-2024.



Important Links

Posted Date: 24-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ * పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

* పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష వచ్చే ఏడాది మే 26న నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21 నుంచి 30వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము మే 6వ తేదీలోగా చెల్లించాలి. అడ్మిట్ కార్డులు మే 17 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత పొందిన వారికి అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ తదితర మేటి సంస్థల్లో అడ్మిషన్లకు మెయిన్స్ ర్యాంకే ఆధారం.


 వెబ్‌సైట్‌ 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

హిందూపురానికి అయోధ్య రామయ్య పాదుకలు | Ayodhya Ramaya's Footsteps to Hindupuram

పురానికి అయోధ్య రామయ్య పాదుకలు
హిందూపురం అర్బన్, న వంబరు 24: ఆదర్శ ప్రాయుడు సీతారామచంద్రమూర్తి పాదుకలు హిందూపురానికి శుక్రవారం చేరాయి. రామజన్మభూమి అయోధ్యలోని శ్రీరామునికి కర్ణాటక రాష్ట్రం ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి మఠం ఆధ్వర్యంలో శారదా పాదుకలు అందజేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు కేవీ చలపతి తెలిపారు. అలాగే 16 నదుల నుంచి గంగా జలాన్ని సేకరించి కర్ణాటకలో కోటి ఇళ్లలో పూజలు చేయించి జనవరి 22వ తేదీన  మాలయానికి అందజేస్తారన్నారు. ఎంఎఫ్ రోడ్డులోని హయగ్రీవ ఆలయానికి పాదుకలు చేరుకున్నాయి. భక్తులు పాదుక లను దర్శించుకున్నారు. భగవత్ కార్యక్రమానికి ప్రతి హిందువు పాల్గొనాల న్నారు. పూజలు చేయించాలనుకునేవారు రామాంజనేయ బేకరి జనార్ధన్ 9030443900, 9182079188లను సంప్రదించాలన్నారు.






నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, అనంతరం సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం | విజయవాడకు చెందిన కీట్స్ ట్రస్టులో హెల్త్ కౌన్సిలర్, కో-ఆర్డినేటర్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పినకు శిక్షణ | Free training for unemployed, followed by job with certificate Free training and job placement training in Health Counselor and Coordinator Course at Keats Trust, Vijayawada

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
అనంతపురం క్లాక్వర్, నవంబరు 24: విజయవాడకు చెందిన కీట్స్ ట్రస్టులో హెల్త్ కౌన్సిలర్, కో-ఆర్డినేటర్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పినకు శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. డిగ్రీ చదివి 19-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 1 నుంచి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. అనంతరం సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.
పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు 90004 87423ను సంప్రదించాలన్నారు.

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ ఫలితాలు | Results of Town planning overseer on APPSC website

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టు భర్తీ నియామక ఫలితాలను కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీన్ని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు.

● AP ఎస్సై పోస్టుల భర్తీపై హైకోర్టు నిర్ణయం ● అనర్హులుగా తేలితే ఒక్కొక్కరికీ రూ.ఒక లక్ష ఖర్చులు విధిస్తామని ధర్మాసనం స్పష్టీకరణ | ● High Court's decision on the filling of AP SI posts ● Bench clarification that if found ineligible, costs of Rs one lakh will be imposed on each

మా పర్యవేక్షణలో ‘ఎత్తు’ కొలుస్తాం!
● ఎస్సై పోస్టుల భర్తీపై హైకోర్టు నిర్ణయం
● అనర్హులుగా తేలితే ఒక్కొక్కరికీ రూ.లక్ష

ఖర్చులు విధిస్తామని ధర్మాసనం స్పష్టీకరణ

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సై పోస్టుల భర్తీ వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఎత్తు వివాదంలో కోర్టును ఆశ్రయించిన 24 మంది అభ్యర్థులకు హైకోర్టు పర్యవేక్షణలో, కోర్టు ప్రాంగణంలో ఎత్తు కొలతలు తీసేందుకు నిర్ణయించింది. అయితే, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇచ్చిన వివరాలు వాస్తవమని తేలితే ఒక్కో పిటిషనర్‌ ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. కొలతలకు సిద్ధంగా ఉన్న పిటిషనర్ల వివరాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి. నరేంద్ర, జస్టిస్‌ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఎస్‌ఐ నియామక ప్రక్రియలో దేహదారుఢ్య పరీక్షలకు డిజిటల్‌ విధానాన్ని అవలంభించడాన్ని సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఛాతీ కొలత, ఎత్తు విషయంలో డిజిటల్‌ కొలతలు తీసుకోవడంతో చాలా మంది అభ్యర్ధులు అనర్హులయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. మాన్యువల్‌ విధానాన్ని అనుసరించి ఎత్తును నిర్ధారించాలని బోర్టును ఆదేశించారు. దీనికి అనుగుణంగా మాన్యువల్‌ విధానంలో ఎత్తును నిర్ధారించిన అధికారులు పిటిషనర్లను అనర్హులుగా ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఎ. దుర్గాప్రసాద్‌ సహా 23 మంది మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. వీరి వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎస్‌ఐ ఎంపిక ఫలితాలను ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. శుక్రవారం ఈ అప్పీల్‌ విచారణకురాగా బోర్డు తరఫున జీపీ కిశోర్‌ కుమార్‌, పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

మహిళా పోలీసుల ఉత్తర్వులు రద్దు చేయండి

● పిటిషనర్‌ తరఫు వాదనలు.. తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. రాతపూర్వక వాదనలు ఓ వారంలో సమర్పించాలని ఇరువైపుల న్యాయవాదులకు సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు. దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిల్‌ వేశారు. మరోవైపు కొంతమంది మహిళా కార్యదర్శులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు బాలాజీ వడేరా, నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం చట్టవిరుద్ధంగా మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగిస్తోందన్నారు. వారిని దొడ్డిదారిలో పోలీసుశాఖలోకి తీసుకొచ్చిందని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేయాలని కోరారు. అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. సాధారణ పోలీసులకు ఉండే అధికారాలు మహిళా పోలీసులకు ఉండవని తెలిపారు. మహిళా పోలీస్‌గా వారిని సంబోధిస్తారు తప్ప పోలీస్‌ విధులు నిర్వర్తించేందుకు వారిని అనుమతించబోమన్నారు. యునిఫాం ధరించారనే కారణంతో వారిని రెగ్యులర్‌ పోలీసుగా చూడకూడదని చెప్పారు. బందోబస్తు, పోలీసుస్టేషన్‌ రిసెప్షన్‌ లాంటి సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ విధులను మహిళా పోలీసులకు అప్పగించకుండా దిగువస్థాయి అధికారులకు డీజీపీ ఇప్పటికే సర్క్యులర్‌ జారీ చేశారని తెలిపారు. 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...