13, మార్చి 2024, బుధవారం

UPSC అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్ లేదా హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి.

UPSC: ఈపీఎఫ్‌వోలో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు 

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

* పర్సనల్ అసిస్టెంట్: 323 పోస్టులు (యూఆర్‌- 132, ఈడబ్ల్యూఎస్‌- 32, ఓబీసీ- 87, ఎస్సీ- 48, ఎస్టీలకు 24 కేటాయించారు)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్ లేదా హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: కనిష్ఠంగా 18  ఏళ్లు; గరిష్ఠంగా యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌లకు 30 ఏళ్లు, ఓబీసీలకు 33 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 35 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 40 ఏళ్లు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం, హైదరాబాద్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-03-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 28-03-2024 నుంచి 03-04-2024 వరకు.

Important Links

Posted Date: 12-03-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

POSTAL JOBS: తపాలా శాఖలో భారీగా కొలువులు * టెన్త్‌ పాసైతే చాలు.. పరీక్ష లేకుండానే నియామకం * త్వరలో నోటిఫికేషన్‌ విడుదల

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో వేల సంఖ్యలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి  రంగం సిద్ధమైంది. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల కానుంది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. అభ్యర్థుల వయసు 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్‌ సేవక్‌లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గతేడాది 40,889 జీడీఎస్‌ ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.

అప్లికేషన్‌ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్

  వెబ్‌సైట్   

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

MJPAPBCWCET: ఏపీ బీసీ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశాలు | విద్యార్హత: నాలుగో తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 106 బీసీ బాలబాలికల పాఠశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను అయిదో తరగతి (ఇంగ్లిష్‌ మీడియం, స్టేట్ సిలబస్)లో ప్రవేశాలకు సంబంధించి ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.

పరీక్ష వివరాలు...

* మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీడబ్ల్యూ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024

మొత్తం సీట్ల సంఖ్య: 6,480.

విద్యార్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నాలుగో తరగతి 2023-24 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి. జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి.

వయస్సు: ఓసీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య; ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో 50 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగు(10 మార్కులు), ఇంగ్లిష్(10 మార్కులు), గణితం(15 మార్కులు), పరిసరాల విజ్ఞానం(15 మార్కులు) సబ్జెక్టులో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.

పరీక్షా కేంద్రం: విద్యార్థుల సంబంధిత జిల్లాలో పరీక్ష నిర్వహిస్తారు. 

ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01-03-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 27-04-2024.

Important Links

Posted Date: 12-03-2024

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AP KGBV: కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో అడ్మిషన్లు * బాలికలు దరఖాస్తుకు అర్హులు

అమరావతి: ఏపీలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని 352 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి. 6, 11వ తరగతుల్లో కొత్తగా ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ (మధ్యలో బడి మానేసిన వారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. కేజీబీవీ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు; పట్టణ ప్రాంతాల్లో రూ.1.4 లక్షలు మించరాదు. 

షెడ్యూల్‌ ఇదే..

మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిదో తరగతుల విద్యార్థుల సెలక్షన్‌ జాబితా ఏప్రిల్‌ 15 నాటికి సిద్ధమవుతుంది. ఏప్రిల్‌ 16 నుంచి 18 వరకు వెరిఫికేషన్‌ చేసి.. ఏప్రిల్‌ 19న జాబితాను విడుదల చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్‌లో సమాచారం ఇస్తారు. ఏప్రిల్‌ 19 నుంచి 24 వరకు సంబంధిత కేజీబీవీల్లో ప్రిన్సిపాళ్లు సర్టిఫికెట్లు వెరిఫికేషన్‌ చేస్తారు. మరిన్ని వివరాలను టోల్‌ ఫ్రీ నంబర్‌ 18004258599 సంప్రదించవచ్చని సమగ్రశిక్ష రాష్ట్ర సంచాలకులు బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.

వెబ్‌సైట్‌

 అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Group 1 Exam: గ్రూప్-1 అభ్యర్థులకు ముఖ్య సూచనలు * మార్చి 17న ప్రిలిమ్స్‌ నిర్వహణ

ఏపీలో మార్చి 17న నిర్వహించనున్న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్టుకు సంబంధించి ముఖ్య సూచనలను ఏపీపీఎస్సీ జారీ చేసింది. ప్రాథమిక పరీక్ష ఓఎమ్మార్‌ సమాధాన పత్రం నకలు కాపీ, ప్రశ్నపత్రం ఫస్ట్‌ పేజీలతో పాటు అభ్యర్థులకు ముఖ్య సూచనలను పొందుపరిచింది. పరీక్ష బుక్‌లెట్ సిరీస్ కోడ్, అనుసరించాల్సిన సూచనలను తెలియజేసింది. అభ్యర్థులందరూ నమూనా కాపీలను జాగ్రత్తగా పరిశీలించాలని కమిషన్‌ పేర్కొంది. 
 
  ఓఎమ్మార్‌ సమాధాన పత్రం నకలు కాపీ   

  పేపర్‌-1 సూచనలు  
 
  పేపర్‌-2 సూచనలు 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

AP DSC: డీఎస్సీ కొత్త పరీక్ష తేదీల వెల్లడి * మార్చి 25న అందుబాటులోకి హాల్‌టికెట్లు

ఆంధ్రప్రదేశ్‌లో 6,100 టీచర్‌ ఉద్యోగాల సంబంధించి హైకోర్టు జోక్యంతో డీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.  షెడ్యూల్‌ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఎస్జీటీ పరీక్ష జరుగనున్నాయి. ఏప్రిల్‌ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకు స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, ఫిజికల్‌ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపిక వెబ్‌ ఐచ్ఛికాలు నమోదుకు అవకాశం ఉంటుంది. మార్చి 25 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. 

ఉద్యోగాల వారీగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ వివరాలు    

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- List of Hindupur and other areas Internet Centers and Contact Numbers https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

APOSS: ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల * డౌన్‌లోడ్‌ డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

ఆంద్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో మార్చిలో నిర్వహించే పదోతరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షలు మార్చి 18 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్‌ జనరల్‌, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ప్రయోగ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకు నిర్వహించనున్నారు.

  ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షల టైం టేబుల్‌  

  పదోతరగతి హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి  
 
  ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి  