అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
18, జనవరి 2021, సోమవారం
విద్యా సమాచారం
17, జనవరి 2021, ఆదివారం
16, జనవరి 2021, శనివారం
అనంతపురం జిల్లాలో వివిధ శాఖల్లో లో ఖాళీలు
ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలీజియస్ టీచర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 194
పోస్టు- ఖాళీల సంఖ్య: పండిట్ -171
అర్హత : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ(ఏ గ్రూప్ వారైనా) ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హతను కలిగి ఉండాలి.
పోస్టు- ఖాళీల సంఖ్య: పండిట్ (గూర్ఖా)- గూర్ఖా రెజిమెంట్-09 :
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతో పాటు హిందూ అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హతను కలిగి ఉండాలి.
పోస్టు- ఖాళీల సంఖ్య: గ్రంథి -05
అర్హత: ఈ పోస్టులకు ఏదేని విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అభ్యర్థులకు పంజాబీలో గ్యానీ అర్హత కలిగి ఉండాలి.
పోస్టు- ఖాళీల సంఖ్య: మౌల్వీ(సున్నీ) -05
అర్హత : ఈ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హతను కలిగి ఉండాలి.
పోస్టు- ఖాళీల సంఖ్య: మౌల్వి(షియా ) లద్దాఖ్ స్కౌట్స్ -01
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ఉర్దూలో అదిబ్ అలీం అర్హతను కలిగి ఉండాలి. లద్దాఖ్ ప్రాంతానికి చెందిన షియాలు మాత్రవే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టు- ఖాళీల సంఖ్య: పాడ్రే -02 :
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు స్థానిక బిషప్‌గా ఆమోదం పొంది.. ప్రస్తుతం ఆ పనిలో కొనసాగుతూ ఉండాలి.
పోస్టు- ఖాళీల సంఖ్య: బోధ్ సన్యాసి(మహాయాన) లద్దాఖ్ స్కౌట్స్ -01
అర్హత: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీతోపాటు బోధ్ సన్యాసిగా గుర్తింపు పొంది, కాన్పా/లోపాన్/రబ్‌జాంలో పీహెచ్‌డీ సర్టిఫికేట్ పొందిన వారై ఉండాలి.
వయసు: సివిలియన్, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి వయసు 01.10.2021 నాటికి 25-34 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే.. అక్టోబర్ 01,1987- సెప్టెంబర్ 30, 1996 మధ్య జన్మించి ఉండాలి.

ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులం దరికీతొలుత స్క్రీనింగ్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. స్క్రీనింగ్‌లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
రాత పరీక్ష..
- ఈ పరీక్షల్లో రెండు పేపర్లు(పేపర్-1, పేపర్-2) ఉంటాయి. పేపర్-1లో జనరల్ అవేర్‌నెస్ సంబంధిత ప్రశ్నలుంటాయి. ఇందులో 50 ప్రశ్నలకు గాను 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది.
- పేపర్-1 పరీక్షను అర్హత పరీక్షగానే చూస్తారు. ఇందు లో కనీసం 40శాతం మార్కులు సాధించిన అభ్యర్థు లు మాత్రమే పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు.
- పేపర్ -2 : ఈ పరీక్ష కూడా మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మతపరమైన విషయాలను గురించిన ప్రశ్నలుంటాయి. మొత్తం 50 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
- పేపర్-2లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. పేపర్-2, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన సమాచారం..
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 09.02.2021
- పరీక్ష తేదీ : 27.06.2021
జూన్ రెండో వారంలో ఎంసెట్
*📃వర్షిక, ప్రవేశ పరీక్షల ఫీజులు రద్దు చేయాలంటూ వినతులు*
*🌀ఈనాడు, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ఎంసెట్‌ను జూన్ రెండో వారంలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈసారి ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభించి, మే రెండో వారానికి పూర్తి చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు యోచిస్తున్నారు. అవి ముగిశాక, 4, 5 వారాల సమయం ఇచ్చి ఎంసెట్‌ను జూన్‌లో జరపాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఇతర ప్రవేశ పరీక్షలు కూడా ఆ నెలలోనే జరిపేందుకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు.*
*💰పరీక్ష ఫీజులు వసూలు చేస్తారా?... రద్దు చేస్తారా?*
*🌀కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల నుంచి ఈసారి అన్ని రకాల వార్షిక పరీక్షలు, ప్రవేశ పరీక్షల ఫీజు రద్దు చేయాలని పలువురు విన్నవిస్తున్నారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తమ రాష్ట్రంలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల రుసుములను ఇప్పటికే రద్దు చేశారు. తెలంగాణలోనూ అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని తల్లిదండ్రులు, సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. తరగతులు జరగకున్నా ప్రైవేటు కళాశాలలు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. కనీసం పరీక్ష ఫీజులైనా రద్దు చేయాలని కోరారు. ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు పలు ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, కనీసం ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకైనా రుసుములు మినహాయించాలని ఐఐటీ జేఈఈ-నీట్ ఫోరమ్ కన్వీనర్ లలిత్‌కుమార్ సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకైనా ఫీజులు మినహాయించాలని మరికొందరు కోరుతున్నారు.*
💁♀ఏప్రిల్ 18న నీట్..
🔰నయా ఢిల్లీ : నీట్ పీజీ -2021 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నీట్ పీజీ పరీక్షల తేదీలను వెల్లడించింది. ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ- 2021 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్షిప్ పూర్తిచేసి వుండాలి. ఇతర వివరాల కోసం nbe.edu.in వెబ్ సైటు సందర్శించవచ్చు.
*💁♀️దూరవిద్య కోర్సులకు అనుమతి..*
🍁ఈనాడు, అమరావతి:
*🔰ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలకు దూరవిద్య కోర్సుల నిర్వహణకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) అనుమతి మంజూరు చేసింది. ఆచార్య నాగార్జునలో డిగ్రీ, పీజీ కలిపి 46 కోర్సులు, శ్రీకృష్ణదేవరాయలో 17, శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో 11కోర్సులకు అనుమతించింది. ఇప్పటికే నిర్వహిస్తున్న ఈ కోర్సులపై వర్సిటీలు చేసిన దరఖాస్తుల మేరకు ఆమోదం తెలిపింది.*
🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾
*2️⃣💁♀️ఇంటిగ్రేటెడ్ కోర్సు విద్యార్థులూ.. ఉపాధ్యాయ కొలువులకు అర్హులే*
*🔰బఈడీ-ఎంఈడీ మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులూ ఉపాధ్యాయ కొలువులకు పోటీపడవచ్చు. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) సర్వసభ్య సమావేశం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని రాష్ట్రాల్లో వివాదం తలెత్తడంతో నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సులను ఆమోదించిన ఎన్‌సీటీఈ..మూడేళ్ల ఇంటిగ్రేటెడ్ పూర్తిచేసిన వారు టెట్ రాసి టీఆర్‌టీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడవచ్చని పేర్కొంది.*
Recent
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
RRB NTPC CITY INTIMATION LINK https://rrb.digialm.com/EForms/loginAction.do?subAction=ViewLoginPage&formId=94346&orgId=33015 -| ఇలాం...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...