*📃వర్షిక, ప్రవేశ పరీక్షల ఫీజులు రద్దు చేయాలంటూ వినతులు*
*🌀ఈనాడు, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ఎంసెట్‌ను జూన్ రెండో వారంలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈసారి ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభించి, మే రెండో వారానికి పూర్తి చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు యోచిస్తున్నారు. అవి ముగిశాక, 4, 5 వారాల సమయం ఇచ్చి ఎంసెట్‌ను జూన్‌లో జరపాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఇతర ప్రవేశ పరీక్షలు కూడా ఆ నెలలోనే జరిపేందుకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు.*
*💰పరీక్ష ఫీజులు వసూలు చేస్తారా?... రద్దు చేస్తారా?*
*🌀కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల నుంచి ఈసారి అన్ని రకాల వార్షిక పరీక్షలు, ప్రవేశ పరీక్షల ఫీజు రద్దు చేయాలని పలువురు విన్నవిస్తున్నారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తమ రాష్ట్రంలో పది, ఇంటర్ వార్షిక పరీక్షల రుసుములను ఇప్పటికే రద్దు చేశారు. తెలంగాణలోనూ అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని తల్లిదండ్రులు, సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. తరగతులు జరగకున్నా ప్రైవేటు కళాశాలలు ట్యూషన్ ఫీజులు వసూలు చేస్తున్నాయని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. కనీసం పరీక్ష ఫీజులైనా రద్దు చేయాలని కోరారు. ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు పలు ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, కనీసం ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకైనా రుసుములు మినహాయించాలని ఐఐటీ జేఈఈ-నీట్ ఫోరమ్ కన్వీనర్ లలిత్‌కుమార్ సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకైనా ఫీజులు మినహాయించాలని మరికొందరు కోరుతున్నారు.*
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
16, జనవరి 2021, శనివారం
జూన్ రెండో వారంలో ఎంసెట్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి