16, జనవరి 2021, శనివారం

*💁‍♀️దూరవిద్య కోర్సులకు అనుమతి..*

🍁ఈనాడు, అమరావతి:

*🔰ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలకు దూరవిద్య కోర్సుల నిర్వహణకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) అనుమతి మంజూరు చేసింది. ఆచార్య నాగార్జునలో డిగ్రీ, పీజీ కలిపి 46 కోర్సులు, శ్రీకృష్ణదేవరాయలో 17, శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో 11కోర్సులకు అనుమతించింది. ఇప్పటికే నిర్వహిస్తున్న ఈ కోర్సులపై వర్సిటీలు చేసిన దరఖాస్తుల మేరకు ఆమోదం తెలిపింది.*

🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾

*2️⃣💁‍♀️ఇంటిగ్రేటెడ్‌ కోర్సు విద్యార్థులూ.. ఉపాధ్యాయ కొలువులకు అర్హులే*

*🔰బఈడీ-ఎంఈడీ మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులూ ఉపాధ్యాయ కొలువులకు పోటీపడవచ్చు. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) సర్వసభ్య సమావేశం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని రాష్ట్రాల్లో వివాదం తలెత్తడంతో నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సులను ఆమోదించిన ఎన్‌సీటీఈ..మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పూర్తిచేసిన వారు టెట్‌ రాసి టీఆర్‌టీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడవచ్చని పేర్కొంది.*

కామెంట్‌లు లేవు: