27, జనవరి 2021, బుధవారం

ఐటీఐ అభ్యర్థులకు సింగరేణి స్వాగతం

 


372 పోస్టుల భర్తీకి ప్రకటన‌ విడుదల

మహిళా అభ్యర్థినులకు 84 స్టాఫ్ నర్స్ ఖాళీలు

 

 

ప్రజలకు వెలుగులు పంచేందుకు చీకట్లో నిరంతరం శ్రమిస్తారు సింగరేణి కార్మికులు. అత్యుత్తమ మైనింగ్ టెక్నాలజీతో 20 ఓపెన్ కాస్ట్, 26 భూగర్భ గనుల్లో బొగ్గు వెలికితీత ప్రధానంగా ఎంతోమంది రకరకాల విధులను నిర్వహిస్తుంటారు. వీరికి మంచి జీతాలు, సౌకర్యాలతో పాటు ఉద్యోగ భ‌ద్ర‌త‌ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి కాలరీస్ కల్పిస్తోంది. అందుకే చాలామంది అభ్యర్థులు ఈ సంస్థలో పనిచేయాలని కలలు కంటుంటారు. అలాంటి వారందరికీ మంచి అవకాశం వచ్చింది. వివిధ విభాగాల్లో 372 ఉద్యోగాల భర్తీకి కొత్తగూడెంలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. 

 

పోస్టులు.. రిజర్వేషన్లు

మొత్తం పోస్టుల్లో 305 స్థానిక రిజర్వేషన్ (లోకల్) కింద ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగతా ఖాళీలకు  తెలంగాణ సహా మిగతా అందరూ (అన్‌రిజ‌ర్వుడ్‌)  పోటీ పడవచ్చు.  జూనియర్ స్టాఫ్ నర్సు పోస్టులకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  మిగతా పోస్టులకు పురుషులు మాత్రమే అర్హులు. జూనియ‌ర్ స్టాఫ్ న‌ర్సుకు జీతం నెల‌కు రూ.29,460 అందుతుంది. మిగ‌తా అన్ని పోస్టుల‌కు కేట‌గిరీ-1లో భాగంగా రోజుకి రూ.1011 చెల్లిస్తారు.

ఫిట్టర్ ట్రెయినీ పోస్టులు 128 ఉన్నాయి. వీటిలో లోకల్ వాళ్లకు 105, అన్‌రిజ‌ర్వుడ్ కు 23 పోస్టులు కేటాయించారు. 

ఎలక్ట్రీషియన్ ట్రెయినీ పోస్టులు 51 ఉంటే  స్థానికులకు 43, అన్‌రిజ‌ర్వుడ్ 8గా నిర్ణయించారు. 

వెల్డర్ ట్రెయినీ 54 పోస్టులు ఉన్నాయి. లోకల్ 44, అన్‌రిజ‌ర్వుడ్ 10. 

టర్నర్/ మెషినిస్ట్ ట్రెయినీ పోస్టులు 22 ఉండగా.. లోకల్ 18, అన్‌రిజ‌ర్వుడ్ 4 . 

మోటార్ మెకానిక్ ట్రెయినీ 14 పోస్టులు. వీటిలో లోకల్ 12, అన్‌రిజ‌ర్వుడ్  2 .

ఫౌండ్రీ మెన్/ మౌల్డర్ ట్రెయినీ 19 పోస్టులు. అందులో లోకల్ 16, అన్‌రిజ‌ర్వుడ్ పోస్టులు 3 . 

‣ జూనియర్ స్టాఫ్ నర్సు పోస్టులు 84 ఉన్నాయి. వీటిలో లోకల్ 67 పోస్టులు, అన్‌రిజ‌ర్వుడ్ 17.

 

ఎవరు అర్హులు?

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మోటార్ మెకానిక్, టర్నర్/ మెషినిస్ట్, ఫౌండ్రీ మెన్/మౌల్డర్ పోస్టులకు పదో తరగతితోపాటు ఆయా విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ తప్పనిసరి. జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ డిప్లొమా/జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫ‌రీ(జీఎన్ఎం)/బీఎస్సీ(నర్సింగ్) చేసి ఉండాలి. ఆయా పోస్టులకు కనిష్ఠ వయసు 18 ఏళ్లు. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయసులో అయిదేళ్ల సడలింపు వర్తిస్తుంది.

 


 

దరఖాస్తు విధానం

అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.  ప‌రీక్ష రుసుం రూ.200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. అప్లికేష‌న్ లో లోక‌ల్‌, నాల్‌లోక‌ల్ వివ‌రాల‌ను జాగ్ర‌త్త‌గా చూసుకుని న‌మోదు చేయాలి. సంబంధిత ధ్రువ‌ప‌త్రాల‌ను  అప్‌లోడ్ చేయాలి. వాటి ఆధారంగానే ప‌రీక్ష హాల్‌టికెట్ జారీ చేస్తారు. 

 

ఎంపిక ఎలా?

పోస్టుల‌ ప్రకారం అభ్యర్థులకు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. రిజ‌ర్వేష‌న్ల వారీగా సంస్థ నిర్ణ‌యించిన క‌నీస మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఓసీల‌కు 30% మార్కులు, బీసీల‌కు 25%, ఎస్సీ, ఎస్టీల‌కు 15% మార్కుల‌ను క‌టాఫ్‌గా నిర్ణ‌యించారు. మెరిట్ ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు. 

 

దరఖాస్తుకు చివరి తేదీ;  ఫిబ్ర‌వ‌రి 4, 2021(సాయంత్రం 5 గంట‌లు).

 

వెబ్‌సైట్‌: www.scclmines.com

 

 

 

 

 

 

 

Tableau Administrator

 

టాబ్లూ అడ్మినిస్ట్రేట‌ర్‌

మైక్రో ఫోకస్ సంస్థ టాబ్లూ అడ్మినిస్ట్రేట‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* టాబ్లూ అడ్మినిస్ట్రేట‌ర్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. 

అవసరమైన నైపుణ్యాలు:

1. టాబ్లూ డెస్క్‌టాప్ అండ్ టాబ్లూ సర్వర్‌పై అవ‌గాహ‌న‌. 

2. టాబ్లూ సర్వర్‌ను కాన్ఫిగర్ చేయాలి. 

3. రోలెవ‌ల్ సెక్యూరిటీపై అవగాహన.

4. టాబ్లూ సర్వర్‌ను ఆప్టిమైజ్ చేయాలి. 

5. ఇంటరాక్టివ్ విజువలైజేషన్లపై ప‌రిజ్ఞానం.

6. డాష్‌బోర్డులను నిర్మించ‌డం. 

7. డేటా మోడళ్లను సృష్టించడం.

8. ఎక్స్‌ట్రాక్ట్ రిఫ్రెష్‌లతో సహా టేబుల్ సర్వర్ షెడ్యూల్‌పై అవ‌గాహ‌న‌.

ఉద్యోగ వివరణ:

1. డాష్‌బోర్డ్‌లు, నివేదికలను సృష్టించ‌డం.

2. సర్వర్ పనితీరుపై అవగాహ‌న‌. 

3. సర్వర్‌ను ఇన్‌స్టాల్, చేయడం.

4. కాన్సెప్ట్ సొల్యూషన్స్ రూపొందించడం. 

ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

Notification Information

Posted Date: 24-01-2021

Test Automation Engineer

 

టెస్ట్ ఆటోమేష‌న్ ఇంజినీర్‌

బార్ల్కేస్ సంస్థ టెస్ట్ ఆటోమేష‌న్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* టెస్ట్ ఆటోమేష‌న్ ఇంజినీర్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

 

ఉద్యోగ వివరణ:

1. ఆటోమేటెడ్ టెస్ట్‌వేర్ త‌యారి, అంచనాలు, డేటా పరీక్షలు చేయాలి.

2. టెస్ట్ ఆటోమేషన్ కోడ్, ఫ్రేమ్‌వర్క్‌ల నిర్వహణ.

3. ప్రాజెక్ట్ / అప్లికేషన్ బృందంతో కలిసి పనిచేయడం.

4. టెస్టింగ్ ఎన్విరాన్‌మెంట్‌ను గుర్తించాలి. 

5. సొంత‌ నివేదికలు, స‌మ‌స్య‌ల‌కు సంబంధించిన‌ పరిష్కారాల ధ్రువీక‌ర‌ణ‌. 

6. కొత్త వ్యవస్థలు, సిస్టమ్ మార్పులకు ఉద్దేశించిన కార్యాచరణ పాటించ‌డం. 

7. డెలివరీ, కార్యకలాపాలు, ప‌నిలో నాణ్యత కోసం సంస్థ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి.

 

అవ‌స‌ర‌మైన‌ నైపుణ్యాలు:

1. ఐటీ వ్యవస్థలను అర్థం చేసుకోవడంతో పాటు డొమైన్‌లు / వెబ్‌సర్వీస్‌లను నేర్చుకోవాలి. టానికి ఆప్టిట్యూడ్‌తో పనిచేయడం

2. మంచి సాంకేతిక నేపథ్యం. టెస్టింగ్‌ ఆటోమేషన్ అనుభవంతో సహా సమస్య పరిష్కార సామర్ధ్యాలను కలిగి ఉండాలి. 

3. ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్‌లకు ఎక్స్‌పోజర్, స్క్రిప్టింగ్ నైపుణ్యాలు.

4. పైథాన్ వంటి ఆధునిక ప్రోగ్రామింగ్ భాషపై అవగాహన.

5. ఎజైల్ పిరమిడ్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి.

6. ప్రోగ్రామింగ్ / ఆటోమేషన్ స్క్రిప్టింగ్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికేషన్‌లు అవ‌స‌రం.

ప‌ని ప్ర‌దేశం: పుణె.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

Notification Information

Posted Date: 26-01-2021

Analyst Manual Testing Jobs

 

అన‌లిస్ట్ మాన్యువ‌ల్ టెస్టింగ్‌

డెలాయిట్ సంస్థ అన‌లిస్ట్ మాన్యువ‌ల్ టెస్టింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* అన‌లిస్ట్ మాన్యువ‌ల్ టెస్టింగ్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌. 

అవ‌స‌ర‌మైన నైపుణ్యాలు:

1. ఎస్‌డిఎల్‌సి, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ (ఎస్‌టిఎల్‌సి)పై మంచి పరిజ్ఞానం.

2. టెస్ట్ కేస్‌ తయారీ, సమీక్ష, నిర్వహణ, బ్లాక్ బాక్స్ పరీక్షపై అవ‌గాహ‌న‌. 

3. జీయూఐ, ఫంక్షనల్, సిస్టమ్, రిగ్రెష‌న్‌పై అవ‌గాహ‌న‌. 

4. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌పై ప్రాథమిక అవ‌గాహ‌న‌. 

5. ఎన్‌క్యూఎల్‌పై ప్రాథమిక జ్ఞానం.

6. వెబ్ అప్లికేషన్, ఏపీఐను పరీక్షించడం.

ఉద్యోగ వివరణ:

1. సిస్టమ్ స్పెసిఫికేషన్లను సమీక్షించాలి. 

2. క్యూఏ ఇంజినీర్లతో సహకరించాలి. 

3. టెస్ట్‌కేస్‌ల‌ను అమలు చేయాలి. 

4. స్పెసిఫికేషన్ల ప్రకారం ప్రొడ‌క్ట్‌కోడ్‌ను అంచనా వేయాలి. 

5. సంబంధిత విభాగంలో లోపాలను అభివృద్ధి బృందాలకు నివేదించాలి. 

6. పోస్ట్-రిలీజ్ / పోస్ట్-ఇంప్లిమెంటేషన్ టెస్టింగ్ చేయాలి. 

ప‌ని ప్ర‌దేశం: హైద‌రాబాద్‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

Notification Information

Posted Date: 24-01-2021

Cloud Q E & Automation

 క్లౌడ్ క్యూఈ అండ్‌ ఆటోమేషన్


మెకాఫీ సంస్థ క్లౌడ్ క్యూఈ అండ్‌ ఆటోమేషన్‌ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు...

* క్లౌడ్ క్యూఈ అండ్‌ ఆటోమేషన్

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

అనుభ‌వం: 

1. క‌నీసం 2 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో అనుభవం.

2. 1+ సంవత్సరాల క్లౌడ్ / ఏడ‌బ్ల్యూఎస్ టెస్టింగ్‌లో అనుభవం.

అవసరమైన నైపుణ్యాలు:

1. ఏడ‌బ్ల్యూఎస్ ఆర్కిటెక్చ‌ర్, డెవ‌ల‌ప్‌మెంట్ విస్తరణపై అనుభవం.

2. గో, పైథాన్‌లో ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు.

3. జావాస్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్‌, సీఎస్ఎస్ వంటి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీలపై అనుభవం.

5. మ‌ల్టీసిస్ట‌మ్స్, సర్వర్ల‌కు సంబంధించిన ప‌రిజ్ఞానం.

6. స్కేలబుల్ అప్లికేషన్‌పై అవగాహన.

7. యూనిట్ టెస్ట్, డీబగ్గింగ్ నైపుణ్యాలు.

ఉద్యోగ వివ‌ర‌ణ‌: 

1. ఏడ‌బ్ల్యూఎస్‌/ ఎజ్యూర్‌/ వీఎంవేర్‌లో సాఫ్ట్‌వేర్‌ను ప‌రీక్షించాల్సి ఉంటుంది. 

2. అంతర్గత ఫ్రేమ్‌వర్క్ ఉపయోగించి పైథాన్ / గో ద్వారా ఆటోమేషన్ కోడ్‌ను రాయాలి.

3. బగ్స్, డీబగ్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సంబంధించిన బృందంతో క‌లిసి ప‌ని చేయాల్సి ఉంటుంది. 

4. ఇంజినీరింగ్ మేనేజర్‌కు సంబంధిత ప‌ని నివేదిక‌ను స‌మ‌ర్పించాలి. 

ప‌ని ప్ర‌దేశం: బెంగ‌ళూరు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
 

https://careers.mcafee.com/job/-/-/731/4134108720

ఏపీవీవీపీ-అనంతపురంలో వివిధ ఖాళీలు.. చివరి తేది జనవరి 28

అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) వివిధ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs 
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సు-04, ఫార్మసిస్ట్-01, థియేటర్ అసిస్టెంట్-09.
  • స్టాఫ్ నర్సు:
    అర్హత: జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ నర్సింగ్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
    జీతం: నెలకు రూ.34,000 చెల్లిస్తారు.
  • ఫార్మసిస్ట్:
    అర్హత: ఫార్మసీలో డిప్లొమా/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
    వేతనం: నెలకు రూ.28,000 చెల్లిస్తారు.
  • థియేటర్ అసిస్టెంట్:
    అర్హత:
    పదోతరగతితోపాటు మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ థియేటర్ టెక్నీషియన్ కోర్సులో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి.
    వయసు: 42ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: వివిధ విభాగాల్లో కింద సూచించిన వెయిటేజ్ ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుంది. విద్యార్హతల్లో సాధించిన మార్కులకు 75 శాతం, ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన గత అనుభవానికి 15శాతం వెయిటేజీ లభిస్తుంది. అలాగే విద్యార్హత పూర్తి చేసిన దగ్గరి నుంచి ప్రతి ఏడాదికి ఒక మార్కు చొప్పున మిగిలిన పది మార్కులను కేటాయిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, దరఖాస్తును జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయం (ఏపీవీవీపీ, డీసీహెచ్‌ఎస్), గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాంపౌండ్, అనంతపురం చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: జనవరి 28, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://ananthapuramu.ap.gov.in

India Post GDS Delhi Recruitment Online Form 2021

రిక్రూట్‌మెంట్ గ్రామీణ డాక్ సేవక్ రిక్రూట్‌మెంట్ 2021 కోసం ఇండియా పోస్ట్ ఆన్‌లైన్ ఫారమ్‌కు ఆహ్వానించబడింది. ఆ అభ్యర్థులు ఈ క్రింది Delhi ిల్లీకి ఆసక్తి కలిగి ఉన్నారు డాక్ విభగ్ జిడిఎస్ ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవవచ్చు.

 

Some Useful Important Links

Apply Online

Registration | Login

Pay Exam Fee

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here