Alerts

2, ఫిబ్రవరి 2021, మంగళవారం

Ananthapuramu District Classifieds

తిరుచానూరులో త్వ‌ర‌లో ఆన్‌లైన్


🕉 *తిరుచానూరులో త్వ‌ర‌లో ఆన్‌లైన్‌ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభం*
        ➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌ : తిరుమల శ్రీవారి ఆల‌యం త‌ర‌హాలో తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో త్వ‌ర‌లో ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

■ సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. 
👉ఈ టికెట్ ధ‌ర‌ను రూ.500/-గా నిర్ణ‌యించారు. గృహ‌స్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్ల‌ను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా క‌ల్యాణోత్స‌వాన్ని వీక్షించ‌వ‌చ్చు. 
◆ ఆ త‌రువాత 90 రోజుల్లోపు గృహ‌స్తులు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్‌లో ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శ‌నానంత‌రం ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అక్షింత‌లు ప్ర‌సాదంగా అందిస్తారు.
 

తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం*


🕉 *ఫిబ్ర‌‌వ‌రి 11న తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం*
        ➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌ : కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం ఫిబ్ర‌‌వ‌రి 11న తిరుమలలో ఘ‌నంగా జ‌రుగ‌నుంది.

👉 ఈ సంద‌ర్భంగా సాయంత్రం స‌హ‌స్ర దీపాలంకార సేవ అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌కు వేంచేపు చేస్తారు.

★  అక్క‌డున్న శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌య మండ‌పంలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ క‌ళాకారులు శ్రీ పురంద‌ర‌దాస కీర్త‌న‌ల‌ను బృంద‌గానం చేస్తారు.

ఆర్‌బీఐలో 241 సెక్యూరిటీ గార్డ్‌ కొలువులు.. అర్హత వివ‌రాలివే..


రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ).. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 241 పోస్టులను భర్తీ చేయనుంది.
Current Affairs

ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 12వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • మొత్తం పోస్టుల సంఖ్య : 241
  • పోస్టుల వివరాలు: సెక్యూరిటీ గార్డ్‌(హైదరాబాద్‌–03, అహ్మదాబాద్‌–07, బెంగళూర్‌–12, భోపాల్‌–10, భువనేశ్వర్‌–08, చండీగఢ్‌–02, చెన్నై–22, గౌహతి–11, జైపూర్‌–10, జమ్మూ–04, కాన్పూర్‌–05, కోల్‌కతా–15, లక్నో–05, ముంబై–84, నాగ్‌పూర్‌–12, న్యూఢిల్లీ–17, పాట్నా–11, తిరువనంతపురం–03).
  • నియామకాల్లో భాగంగా అభ్యర్థుల తుది ఎంపిక సమయం వరకు పోస్టుల సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించే అధికారం ఆర్‌బీఐకి ఉంది.

అర్హతలు..

  • పదోతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన విద్యార్హతలను కలిగి ఉండాలి. రక్షణ దళాల్లో ఎక్స్‌సర్వీస్‌మెన్‌ సేవలను అందించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తుకు అర్హులు.
  • వయసు: 01.01.2021 నాటికి 25–28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌ టెస్ట్, ఫిజికల్‌ టెస్ట్, ప్రీ–రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Career guidance

ఆన్‌లైన్‌ టెస్ట్‌లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను మెరిట్‌ ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఫిజికల్‌ టెస్టులను నిర్వహిస్తారు. ఈ రెండు విభాగాల్లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ సహా ప్రీ–రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ల్లో అర్హత సాధించిన వారిని బ్యాంకు నిబంధనల ప్రకారం–తుది ఎంపిక చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.

పరీక్షా విధానం..
ఆన్‌లైన్‌ విధానంలో టెస్ట్‌ ఉంటుంది. ఈ పరీక్ష మూడు విభాగాల్లో మొత్తం 100 మార్కులకు జరుగుతుంది. రీజనింగ్‌ నుంచి 40 ప్రశ్నలు–40 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌లో 30 ప్రశ్నలు–30 మార్కులు; న్యూమరికల్‌ ఎబిలిటీపై 30 ప్రశ్నలు–30 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం 80 నిమిషాలు. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు. సెక్షనల్‌ కటాఫ్‌ కూడా ఉండదు.

విధులు..

  • బ్యాంకు ఆస్తులకు కాపలా ఉండటం లేదా జిరాక్స్‌ యంత్రాల వద్ద పనిచేయడం, డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్‌(డీఎఫ్‌ఎమ్‌డీ) ఎంట్రీ గేట్‌ దగ్గర తనిఖీ చేయడం లేదా బ్యాంకు నిర్ణయం ప్రకారం ఏ పని అయినా చేయడానికి సిద్దంగా ఉండాలి.
  • సెక్యూరిటీ గార్డ్‌ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులు.. నైట్‌ షిప్టులతో సహా రొటేషన్‌ ప్రకారం అన్ని షిఫ్టుల్లో పని చేయాల్సి ఉంటుంది.

వేతనం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ.27,678 వరకు పొందే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం..

  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ : 12.02.2021
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌ : https://www.rbi.org.in

TTD NEWS



🕉 *తిరుచానూరులో త్వ‌ర‌లో ఆన్‌లైన్‌ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభం*
        ➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల‌ : తిరుమల శ్రీవారి ఆల‌యం త‌ర‌హాలో తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో త్వ‌ర‌లో ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

■ సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు వ‌ర్చువ‌ల్ క‌ల్యాణోత్స‌వం టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తారు. 
👉ఈ టికెట్ ధ‌ర‌ను రూ.500/-గా నిర్ణ‌యించారు. గృహ‌స్తులు ఆన్‌లైన్‌లో ఈ టికెట్ల‌ను బుక్ చేసుకుని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా క‌ల్యాణోత్స‌వాన్ని వీక్షించ‌వ‌చ్చు. 
◆ ఆ త‌రువాత 90 రోజుల్లోపు గృహ‌స్తులు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్‌లో ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శ‌నానంత‌రం ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అక్షింత‌లు ప్ర‌సాదంగా అందిస్తారు.

AP INTERMEDIATE EXAMINATION TIME TABLE

1, ఫిబ్రవరి 2021, సోమవారం

Ananthapuram Jobs 2021 Telugu || అనంతపురం జిల్లా లో ఉద్యోగాలు

అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి దివ్యాంగుల కోటా లో కాంట్రాక్ట్ బేసిస్ పై ఖాళీగా ఉన్న నర్స్ ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేసారు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది28 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది02 ఫిబ్రవరి 2021

విభాగాల వారీగా ఖాళీలు : 

నర్సులు3

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 03 ఖాళీలను భర్తీ చేయనున్నారు.


అర్హతలు :

బీ.ఎస్సీ (నర్సింగ్) లేదా ఇంటర్ తో పాటు జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సు పూర్తిచేసి ఉండాలి.ఏపీ సర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు తప్పనిసరి.అనుభవం కూడా ఉండాలి.

 వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 50 ఏళ్ళు మించకుడదు.మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 0/- ఫీజు, మిగిలిన కేటగిరీ ఎస్సీ, ఎస్టీల అభ్యర్ధులకు 0/- ఫీజు తో ఈ నోటిికేషన్ కు ధరఖాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

అకాడమిక్ మెరిట్,అనుభవం, రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 34,500/- నుంచి 60,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 

డా.ఎండి. నవీద్ ఆహమ్మద్, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, అనంతపురం జిల్లా.

ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫిషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు.

Website

Notification

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...