ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

NEET Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్ నెలరోజులు ఆలస్యం.. అధికారికంగా ప్రకటించిన ఎంసీసీ

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test) 2021 క్వాలిఫై అయిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్ ఫలితాలను ప్రకటించి ఒక నెల దాటినా, కౌన్సెలింగ్ (Counselling), అడ్మిషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే నీట్ కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందని చెబుతోంది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee). దీనికి సంబంధించి సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించింది. మెడికల్ కాలేజీ అడ్మిషన్ల (Admissions)కు సంబంధించి అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసు కారణంగా నీట్ కౌన్సెలింగ్ ఆలస్యమవుతోందని MCC తెలియజేసింది. మెడికల్ అడ్మిషన్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన EWS కోటాను పొందేందుకు రూ.8 లక్షలు పరిమితిగా ఉంచడంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతోంది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 6న జరగనుంది. Gemini Internet ఆ తరువాతే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రానుంది. కాబట్టి తీర్పుకు ముందు...

TTD: టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం.. తెరపైకి మూడో ఘాట్ రోడ్డు.. వైకుంఠ ఏకాదశికి గుడ్ న్యూస్

TTD Key Decesions:   తిరుమల తిరుపతి దేవస్తానం (Tirumala Tirupati Devastnam) పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో.. వారి అందరికి ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు .. 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం అని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి (YV Subbareddy) అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.. రాష్ట్రంలో కోవిడ్ నిభందనలు (Kovid Rules) సడలిస్తే.. పండుగ తరువాత సర్వదర్శనం పెంపు, ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తామన్నారు. మొత్తం 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం కల్పిస్తాం అన్నారు. 500 ఉదయాస్తమాన సేవా టిక్కేట్లు ప్రస్తుతం ఖాళీగా వున్న వాటిని భక్తులుకు కేటాయిస్తామని.. బోర్డ్ సభ్యులు కూడా కోంత మంది విరాళాలు అందించేందుకు అంగీకరించారు అని తెలిపారు. అలాగే వివాదాస్పదంగా మారిన హనుమంతుడి జన్మస్థలమైనా అంజనాద్రి ప్ర...

Google Scholarship: గూగుల్ నుంచి రూ.74,000 స్కాలర్‌షిప్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

1. పరిచయం అక్కర్లేని సెర్చ్ ఇంజిన్, ఇంటర్నెట్ సేవల దిగ్గజ కంపెనీ అయిన గూగుల్ (Google) విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ప్రకటించింది. 'జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్' (Generation Google Scholarship) పేరుతో ఆర్థిక సహకారాన్ని ప్రకటించింది. కంప్యూటర్ సైన్స్‌లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. Gemini Internet 2. డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థినులు 2021 డిసెంబర్ 10 లోగా అప్లై చేయాలి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారికి 2022-23 విద్యాసంవత్సరానికి 1000 డాలర్లు అంటే సుమారు రూ.74,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది. 3. ఈ స్కాలర్‌షిప్‌ను కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ లేదా సంబంధిత టెక్నికల్ ఫీల్డ్‌లో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ప్రకటించింది గూగుల్. దరఖాస్తుదారులు నాయకత్వాన్ని ప్రదర్శించడంతో పాటు కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీలో ప్రాతినిధ్యం లేని బృందాలను మెరుగుపర్చేందుకు తమ అభిరుచిని, ఆసక్తిని ప్రదర్శించాలి. (ప్రతీకాత్మక చిత్రం) 4. ఈ విద్యాసంవత్సరంలో అంటే 2021...

JNVST 2022: 6వ తరగతి అడ్మిషన్ అప్లికేషన్ లో సవరణ కోసం విండో డిసెంబర్ 16న navodaya.gov.in-లో మొదలవుతుంది.

6వ తరగతి దరఖాస్తు ఫారమ్ లో  సరిదిద్దుకునే/కరెక్షన్ విండో డిసెంబర్ 16, 2021న తెరవబడుతుంది. JNVST 2022 తరగతి 6 ఎంపిక పరీక్షను నవోదయ విద్యాల సమితి రెండు గంటల పాటు నిర్వహిస్తుంది. అభ్యర్థులు navodaya.gov.in లో మరింత వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు. Gemini Internet https://www.youtube.com/watch?v=9NEqnsefRP4&ab_channel=HindupurInfo.fromGemini Javahar నవోదయ విద్యాలయ 6వ తరగతి ఎంపిక పరీక్ష 2022 ఏప్రిల్ 30, 2022న నిర్వహించబడుతుంది. నవోదయ విద్యాల సమితి లేదా NVS దరఖాస్తు ఫారమ్‌ను సవరించడానికి దిద్దుబాటు విండో తేదీలను విడుదల చేసింది. మరింత సమాచారం navodaya.gov.in లో చూడవచ్చు. నవోదయలో 6 వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం ఆన్ ‌ లైన్ దరఖాస్తు ఫారమ్ ‌ ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 15, 2021 అని అభ్యర్థులు గమనించాలి . నవోదయ విద్యాలయ సమితి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం , అభ్యర్థులు డిసెంబర్ 16 న దిద్దుబాటు విండోను పొందగలుగుతారు . నోటీసు ప్రకారం , "6 వ తరగతి JNVST 2022 కి సంబంధించిన దిద్దుబాటు విండో 2021 డిసెంబర్ 16 మరియు 17 వరకు తెరిచి ఉంటుంది . ...

PM-SYM: రోజుకు 2 రూపాయలు చెల్లించండి.. ఈ పథకం ద్వారా నెలకు 3 వేల రూపాయల పెన్షన్ పొందండి.. ఎలా అంటే..

PM-SYM: ప్రతి మనిషికీ జీవిత కాలంలో బాధ్యతల బరువులు మోసిన తరువాత వృత్తి, ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం సహజం. పదవీవిరమణ అంటే రిటైర్మెంట్ తీసుకున్న తరువాత జీవితం నడవాలంటే ప్రతి నెల కొంత ఆదాయం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు.. కొన్ని ప్రైవేట్ కొలువులకు రిటైర్మెంట్ తరువాత పెన్షన్ అందే సౌకర్యం ఉంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల్ ఆపరిస్థితి దీనికి భిన్నం. కాలూ..చెయ్యి పనిచేయడం మొరాయిస్తే వీరి జీవితం కష్టాల కొలిమిలో పడిపోయినట్టే. వీరికి రిటైర్మెంట్ అనే పదం అంటేనే భయం పుడుతుంది. ఎందుకంటే.. పని మానేసి ఇంటిలో కూచుంటే వారికి కాలం గడిచే పరిస్థితి ఉండదు. అందుకోసమే.. ఇటువంటి వారికి సహకరించేలా రెండేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక పధకాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ పధకంలో చేరే వారి సంఖ్యా ఎక్కువ అవుతుంది. కేంద్రం తెచ్చిన ఈ పథకం ఏమిటి? ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి శ్రమయోగి మంధన్ యోజన అంటే PM-SYM. అసంఘటిత రంగ కార్మికులకు నెలవారీ పింఛను అందించేందుకు 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 60 ఏళ్లు నిండిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 3,000 రూపాయల పింఛను అంది...

పెన్షన్‌పైనా పన్ను ఉంటుందా? పన్ను పడకపోవడానికి ఛాన్స్‌ ఎంతంటే..

ప్రశ్న:  నా పెన్షన్‌ రూ. 3,60,000. సేవింగ్స్‌ లేవు. ఇతర ఆదాయాలు లేవు. పెన్షన్‌ మీద పన్ను పడుతుందా?  : యం. మంగతాయారు, రాజమండ్రి   సమాధానం: ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. పెన్షన్‌ కూడా జీతంలాగే పన్నుకు గురయ్యే ఆదాయం. ఎటువంటి మినహాయింపు లేదు. పన్ను భారం లెక్కించేటప్పుడు ఆదాయంలాగే పరిగణనలోకి తీసుకోవాలి. రెండో విషయం .. మీకు సంబంధించిన ఇతర ఆదాయాలు ఏవీ లేవని అంటున్నారు కాబట్టి, మీ కేసులో మీరు 60 సం.లు. దాటినట్లయితే బేసిక్‌ లిమిట్‌ రూ. 3,00,000 అవుతుంది. బేసిక్‌ లిమిట్‌ దాటినా నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే పన్ను భారం లెక్కించిన తర్వాత రిబేటు ఉండటం వల్ల ఎటువంటి పన్ను భారం ఉండదు. సెక్షన్‌ 87 అ ద్వారా రిబేటు లభిస్తుంది. పెన్షన్‌లో నుంచి రూ. 50,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును స్టాండర్డ్‌ డిడక్షన్‌ అంటారు. కానీ ఫ్యామిలీ పెన్షన్‌ని జీతంగానూ, పెన్షన్‌గానూ భావించరు. ఆ మొత్తాన్ని ‘ఇతర ఆదాయం’గా పరిగణించి, అందులో నుంచి 1/3వ భాగం లేదా రూ. 15,000 ..ఈ రెండింటిలో ఏది తక్కువైతే .. ఆ మొత్తాన్ని మినహాయింపుగా ఇస్తారు. ఏ పెన్షన్‌ అయినా పన్నుభారానికి గురి అవుతుంది. బేసిక్‌ లిమిట్‌ లోప...

LIC Loan: మీరు ఎల్ఐసీ పాలసీదారా.. అయితే తక్కువ వడ్డీకే రుణం తీసుకోవచ్చు.. ఎలాగంటే.

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ఈ సంస్థకు లక్షల్లో పాలసీదారులు ఉన్నారు. అయితే LIC తన పాలసీదారులకు రుణ సౌకర్యంతో సహా అనేక సదుపాయాలను అందిస్తుంది. మీకు ఎల్‌ఐసీ పాలసీని ఉంటే సులభంగా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. దీని వడ్డీ రేటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువగా ఉంది. వ్యక్తిగత రుణంపై ఎల్‌ఐసీ వడ్డీ రేటు 9 శాతం నుంచి ప్రారంభమవుతుంది. మీ ఎల్‌ఐసీ పాలసీపై మీరు ఎంత రుణం పొందుతారు అనేది మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. రుణ కాల వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. లోన్ మొత్తం పాలసీ సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందులో 90% వరకు లోన్ పొందవచ్చు. మీ పాలసీ సరెండర్ విలువ రూ. 5 లక్షలు అయితే మీరు దానిపై 4.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. దీని అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే.. మీరు లోన్ కాలపరిమితికి ముందు చెల్లిస్తే ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని ఫోర్‌క్లోజర్ ఛార్జ్ అని కూడా అంటారు. అయితే LIC పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు ఎంత అనేది పూర్తిగా దరఖాస్తుదారు క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రొఫైల్‌లో రుణదాత ఆదాయం, అతను చేసే ఉపాధి పను, లోన్ మ...