హిందూపురం: హౌస్ కీపింగ్, కేర్ టేకర్ తదితర విభాగాల్లో మహిళలకు శిక్షణ ఇచ్చి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కల్పించేందుకు 1 దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యుమ్ మంగళవారం తెలిపారు. కనీసం 5వ తరగతి ఉత్తీర్ణులై.. చదవడం, రాయడం తెలిసిన 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక చేసిన వారికి హిందూపురం పరిసర ప్రాంతాల్లో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణలో భాగంగా గల్లో అనుసరించే మత పరమైన సంస్కృతులు, వారి పద్ధతులు, అలవాట్లు విధానాలతో పాటుగా ఆయా దేశాల చట్టాల గురించి అవగాహన కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి గల్ఫ్లో ఉపాధి అవకాశాలు చూపుతామన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ అజమాయిషీలో జరిగే కార్యక్రమమని వెల్లడించారు. అందువల్ల నకిలీ ఏజెంట్ల బారినపడి మోసపోవడం ఉండదన్నారు. అలాగే ఉద్యోగికి ఆ దేశ చట్టాల ప్రకారం తగిన జీతభత్యాలు అందుతున్నాయా...లేదా అని ప్రభుత్వమే ఆరా తీస్తుందన్నారు. అలాగే పని చేసే ప్రాంతంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తిన సందర్భంలో భారత రాయబార కార్యాలయం బాధ్యత వహిస్తుందన్నారు. పూర్తి వ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు