నేషనల్
ఎడ్యుకేషన్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)లో తక్కువ స్కోర్ సాధించిన వారి
కోసం ‘న్యూస్18’ అందిస్తున్న టాప్ ఫైవ్ గ్రాంట్స్ గురించి తెలుసుకుందాం.
విదేశాల్లో చాలా కళాశాలలకు నీట్
స్కోర్ అవసరం లేదు. కానీ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనలలో మార్పు
కారణంగా ఇప్పుడు విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా నీట్ క్లియర్ చేయడం
తప్పనిసరి.
* ఆల్ ఇండియా యూత్ స్కాలర్‌షిప్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(AIYSEE)
AIYSEE అనేది జాతీయ స్థాయి మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ ఎంట్రెన్స్
ఎగ్జామ్‌ను ఇంజనీరింగ్, మెడికల్ స్టడీస్ అభ్యసించే విద్యార్థుల కోసం
నిర్వహిస్తారు. సాధారణంగా ఏప్రిల్, మేలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రతిభ
చూపిన వారికి స్కాలర్‌షిప్ అందిస్తారు. AIYSEE స్కాలర్‌షిప్‌లు పరీక్షకు
హాజరయ్యే మొత్తం విద్యార్థులలో కేవలం 10% మందికి ఇస్తారు. విద్యార్థి
ఎన్‌రోల్ చేసుకునే ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాల ఆధారంగా స్కాలర్‌షిప్
ప్రయోజనాలు మారుతూ ఉంటాయి.
AIYSEE స్కాలర్‌షిప్‌లు అన్ని ఆర్థిక
నేపథ్యాలకు చెందిన వారికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ కళాశాలల్లోని
విద్యార్థులకు, స్కాలర్‌షిప్ వారి ట్యూషన్ ఫీజులో 100% వరకు వర్తిస్తుంది
లేదా సెమిస్టర్‌కు గరిష్టంగా రూ.40,000, ఏది తక్కువైతే అది అందుతుంది.
ప్రైవేట్ కాలేజీల్లో చేరిన అభ్యర్థులు సంవత్సరానికి రూ.80,000 వరకు గ్రాంట్
పొందుతారు.
ఎంపిక ప్రక్రియ:
AIYSEE స్కాలర్‌షిప్ పొందాలంటే AIYSEE ఎగ్జామ్‌ని విజయవంతంగా క్లియర్
చేయాలి. అర్హత సాధించిన తర్వాత, విద్యార్థులు అడ్మిషన్, సీట్ల కేటాయింపు
ప్రాసెస్‌లో పాల్గొనడానికి అర్హులు.
దరఖాస్తు వివరాలు:
ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు https://aiysee.com/aboutsc.phpలో అప్లై చేసుకోవచ్చు.
* వైస్-ఛాన్సలర్స్ ఇంటర్నేషనల్ MBBS స్కాలర్‌షిప్, సిడ్నీ యూనివర్సిటీ
సిడ్నీ యూనివర్సిటీ ఆస్ట్రేలియాలో MBBS అభ్యసించడానికి ‘హై అఛీవింగ్’
అంతర్జాతీయ విద్యార్థులకు $40,000 స్కాలర్‌షిప్‌ను అందిస్తుంది.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు:
CRICOS-రిజిస్టర్డ్ బ్యాచిలర్ కోర్స్‌వర్క్ డిగ్రీ కోసం దరఖాస్తు చేసిన,
షరతులు లేని ఆఫర్‌ను పొందిన అంతర్జాతీయ విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు
అర్హులు. దరఖాస్తుదారులు స్కాలర్‌షిప్ కోసం ఆటోమేటక్‌గా అర్హత పొందుతారు.
విడిగా దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
అకడమిక్ మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్ ఇస్తారు. విద్యార్థులను సెలక్షన్ కమిటీ నామినేట్ చేస్తుంది.
దరఖాస్తు వివరాలు:
https://www.sydney.edu.au/scholarships/e/vice-chancellor-international-scholarships-scheme.htmlలో వివరాలు పొందవచ్చు.
* బీజింగ్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్
ఆఫర్డబుల్, హై- క్వాలిటీ ఎడ్యుకేషన్‌ని అందించే చైనా భారతీయ
విద్యార్థులకు అనుకూలమైన డెస్టినేషన్. చైనీస్ ప్రభుత్వం భారతదేశం సహా
అంతర్జాతీయ విద్యార్థులకు వారి విద్యాపరమైన అభ్యాసాలను సులభతరం చేయడానికి
స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.
అర్హత ప్రమాణం:
చైనాలో పీహెచ్‌డీ చేయాలనే ఆసక్తి ఉంటే, వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి. అండర్
గ్రాడ్యుయేట్ (UG) కోర్సులకు, దరఖాస్తుదారులు 30 సంవత్సరాల వరకు ఉండాలి.
మాస్టర్స్ ప్రోగ్రామ్ దరఖాస్తుదారులు 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు
కలిగి ఉండాలి. అర్హత ఉన్న విద్యార్థులు చైనాలోని ఉన్నత విద్యా సంస్థలకు
దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియలో చైనాలోని హోస్ట్ ఇన్‌స్టిట్యూషన్ చైనా, క్షుణ్నంగా పరిశీలిస్తుంది. కోర్సు
ప్రారంభానికి మూడు నెలల ముందు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక
సమయంలో, విద్యార్థుల అకడెమిక్ రికార్డులు, ఆరోగ్యం, వర్క్
ఎక్స్‌పీరియన్స్, ఇతర సంబంధిత అర్హతల సహా వివిధ అంశాలు పరిశీలిస్తారు.
దరఖాస్తు వివరాలు:
https://english.beijing.gov.cn/studyinginbeijing/scholarshipapplications/202006/t20200617_1926391.htmlలో దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్
డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (DST) అండర్ గ్రాడ్యుయేట్
(UG), పోస్ట్‌గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల సహా ఉన్నత విద్య చదివే
విద్యార్థులకు ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్స్ అందిస్తారు. ఎంపికైన
అభ్యర్థులకు జీవన వ్యయాలకు సహాయం చేయడానికి నెలవారీ రూ.5,000 స్టైఫండ్,
విద్యా, పరిశోధనా కార్యక్రమాలను సులభతరం చేయడానికి సంవత్సరానికి రూ.20,000
మెంటర్‌షిప్ గ్రాంట్ కూడా ఉన్నాయి.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు:
కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలలో బేసిక్, నేచురల్ సైన్సెస్ రీసెర్చ్
కెరీర్‌లు కొనసాగించడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు, అలాగే ఇంజనీరింగ్,
మెడిసిన్, అగ్రికల్చర్, వెటెర్నరీ వంటి బేసిక్, అప్లైడ్ సైన్సెస్‌లో
రీసెర్చ్ కెరీర్ కోసం చూస్తున్నవారు, దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపిక ప్రమాణాలు:
ఇన్‌స్పైర్ స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించడానికి, అభ్యర్థులు నిర్దిష్ట
విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. 12వ తరగతి రాష్ట్ర లేదా సెంట్రల్
బోర్డ్ పరీక్షలలో టాప్ 1% లోపు మార్కులు సాధించిన వారు దరఖాస్తు
చేసుకోవడానికి అర్హులు. అదనంగా NEET లేదా JEE లో 10,000 వరకు ర్యాంకులు
సాధించిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు వివరాలు:
ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక పోర్టల్ https://www.online-inspire.gov.in. ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.
* హార్వర్డ్ మెడికల్ స్కూల్
హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆర్థిక అవసరాలు ఉన్న విద్యార్థులకు
స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌లు ఎండోడ్ ఫండ్స్, ఫండ్
రైజింగ్, అన్‌రెస్ట్రిక్టెడ్ ఇన్‌కమ్ సహా వివిధ వనరుల ద్వారా
సాధ్యమవుతాయి.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు:
ట్యూషన్ ఫీజులను చెల్లించలేని అభ్యర్థులు ఈ స్కాలర్‌షిప్‌లకు ఆటోమేటిక్‌గా
అర్హత సాధిస్తారు. అడ్మిషన్ పొందిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉంటే
స్కాలర్‌షిప్‌కి పరిగణిస్తారు.
ఎంపిక ప్రక్రియ:
స్కాలర్‌షిప్ అర్హతను నిర్ణయించడానికి, కుటుంబం ఆర్థికంగా సహకరించగలదానికి
(ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్), ట్యూషన్ ఫీజు, మ్యాండేటరీ ఫీజు మధ్య
వ్యత్యాసాన్ని కాలిక్యులేట్ చేస్తారు. ఇలా నిజంగా ఆర్థిక సహాయం అవసరమైన
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది.
ఇన్‌స్టిట్యూషనల్
స్కాలర్‌షిప్ ఫండింగ్ అర్హత సాధారణంగా ఎనిమిది సెమిస్టర్‌ల ఫుల్ ట్యూషన్
ఛార్జీలకు పరిమితం అవుతుందని గమనించడం ముఖ్యం. సెలక్షన్ ప్రాసెస్‌లో
ప్రీమెడికల్ బ్యాక్‌గ్రౌండ్, రెసిడెన్సీ ప్రిఫరెన్స్‌లు, వ్యక్తిగత,
వృత్తిపరమైన ఆసక్తులు, విద్యాపరమైన పురోగతి గురించి వివరాలను అందించమని
అడగవచ్చు.
దరఖాస్తు వివరాలు:
హార్వర్డ్ మెడికల్ స్కూల్ వెబ్‌సైట్ https://meded.hms.harvard.edu/types-funding-md-programలో మరిన్ని వివరాలు పొందవచ్చు.
చాలా మంది భారతీయ విద్యార్థులు తక్కువ ఖర్చు కారణంగా రష్యా, బంగ్లాదేశ్,
నేపాల్, జార్జియా, కజకిస్థాన్, కిర్గిస్థాన్ వంటి దేశాలలో వైద్య
చదవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇటలీ, యూఎస్, యూకే, హంగేరి మరెన్నో దేశాలు
భారతీయ విద్యార్థులకు మెడిసిన్ చదవడానికి స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి.
For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR
రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.
Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.
పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.
తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.
జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-
డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం
EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html