NEST: నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2023 సైన్స్, మాథ్స్ కోర్సుల్లో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- నెస్ట్ ఒకటి. తాజాగా నెస్ట్-2024 ప్రకటన వెలువడింది. ఇందులో రాణించినవాళ్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్(నైసర్), భువనేశ్వర్; యూనివర్సిటీ ఆఫ్ ముంబయి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే ఏడాదికి రూ.60,000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనం అందుకోవచ్చు. అలాగే వేసవిలో ఇంటర్న్‌షిప్ కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున గ్రాంట్ ఇస్తారు. పరిశోధనల దిశగా ప్రోత్సాహం... విద్యార్థులకు సైన్స్ కోర్సుల్లో ఆసక్తి పెంచి, పరిశోధనల దిశగా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్టు (నెస...
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు