ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

NEST: నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2023

NEST: నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2023  సైన్స్‌, మాథ్స్‌ కోర్సుల్లో ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని ఆశిస్తున్న ఇంటర్మీడియట్‌ విద్యార్థులు రాయాల్సిన ముఖ్యమైన పరీక్షల్లో నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్- నెస్ట్‌ ఒకటి. తాజాగా నెస్ట్‌-2024 ప్రకటన వెలువడింది. ఇందులో రాణించినవాళ్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(నైసర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే ఏడాదికి రూ.60,000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనం అందుకోవచ్చు. అలాగే వేసవిలో ఇంటర్న్‌షిప్‌ కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున గ్రాంట్‌ ఇస్తారు. పరిశోధనల దిశగా ప్రోత్సాహం... విద్యార్థులకు సైన్స్‌ కోర్సుల్లో ఆసక్తి పెంచి, పరిశోధనల దిశగా వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్టు (నెస...

ICI: ఐసీఐ తిరుపతి నోయిడాలో బీబీఏ, ఎంబీఏ కలినరీ ఆర్ట్స్ ప్రోగ్రామ్

ICI: ఐసీఐ తిరుపతి నోయిడాలో బీబీఏ, ఎంబీఏ కలినరీ ఆర్ట్స్ ప్రోగ్రామ్  కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖకు చెందిన తిరుపతి, నోయిడాల్లోని ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్(ఐసీఐ)- 2024-25 విద్యా సంవత్సరానికి బీబీఏ, ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రవేశం పొందిన విద్యార్థులకు చెఫ్‌, కిచెన్‌ మేనేజ్‌మెంట్- కలినరీ స్పెషలిస్టులుగా ఉపాధి పొందేందుకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇస్తారు. ప్రోగ్రామ్ వివరాలు... 1. బీబీఏ (కలినరీ ఆర్ట్స్): ప్రోగ్రామ్ వ్యవధి మూడేళ్లు. సీట్ల వివరాలు: ఐసీఐ తిరుపతిలో 120 సీట్లు; ఐసీఐ నోయిడాలో 120 సీట్లు ఉన్నాయి. అర్హత: కనీసం 45% మార్కులతో ఇంటర్‌/ 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు సరిపోతుంది.  ఎంపిక ప్రక్రియ: సీయూఈటీ(యూజీ) 2024 స్కోరు లేదా ఐసీఐ నిర్వహించే ఐజీఎన్‌టీయూ- జేఈఈ(యూజీ) 2024 స్కోరు తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.  2. ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్) ప్రోగ్రామ్: ప్రోగ్రామ్ వ్యవధ...

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు

AP KGBV Admissions: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు  ఆంధ్రప్రదేశ్‌లోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో అర్హులైన బాలికలకు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 352 కేజీబీవీ పాఠశాలల్లో 2024 - 2025 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. అర్హులైన బాలికలు ఏప్రిల్ 11లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  వివరాలు... * ఏపీ కేజీబీవీల్లో ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలతో పాటు ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లలో ప్రవేశాలు  అర్హత: అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, స్కూల్ మధ్యలో మానేసిన డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ...

NVS: నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టులు

NVS: నవోదయ విద్యాలయాల్లో 1,377 నాన్ టీచింగ్ పోస్టులు  నోయిడాలోని నవోదయ విద్యాలయ సమితి... డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఎన్‌వీఎస్‌ ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా నెలకొన్న ఎన్‌వీఎస్‌ ప్రాంతీయ కార్యాలయాలు, ఎన్‌ఎల్‌ఐలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు: 1. ఫిమేల్‌ స్టాఫ్ నర్స్: 121 పోస్టులు 2. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 5 పోస్టులు 3. ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు 4. జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్: 4 పోస్టులు 5. లీగల్ అసిస్టెంట్: 1 పోస్టు 6. స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు 7. కంప్యూటర్ ఆపరేటర్: 2 పోస్టులు 8. క్యాటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు 9. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 381 పోస్టులు 10. ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు 11. ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు 12. మెస్ హెల్పర్: 442 పోస్టులు 13. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు మొత్తం పోస్టుల సంఖ్య: 1,377. ...

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ విడుదల

APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ విడుదల * అభ్యంతరాల నమోదుకు గడువు మార్చి 21 ఏపీలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు నిర్ణీత ప్రొఫార్మాలో మార్చి 19 నుంచి మార్చి 21వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కమిషన్‌ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 17న స్క్రీనింగ్‌ పరీక్ష పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.      అభ్యంతరాల నమోదు కోసం క్లిక్‌ చేయండి         ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-1 ప్రశ్నపత్రం ప్రాథమిక కీ   కోసం క్లిక్‌ చేయండి      ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌-2 ప్రశ్నపత్రం ప్రాథమిక కీ   కోసం క్లిక్‌ చేయండి        -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి...

SSC: కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్‌ పోస్టులు

SSC: కేంద్ర శాఖల్లో 2,049 సెలక్షన్‌ పోస్టులు  స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) తాజాగా సెలక్షన్‌ పోస్టుల నియామక పరీక్ష (ఫేజ్-XII/ 2024)కు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని పలు విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేస్తోంది. పది, పన్నెండో తరగతి, డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ తదితరాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఖాళీలున్న విభాగాలు: ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సెంట్రల్ వాటర్ కమిషన్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్‌ హైవేస్ మినిస్ట్రీ, హోం అఫైర్స్‌ మినిస్ట్రీ, డిఫెన్స్‌ మినిస్ట్రీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, సెంట్రల్ ట్రాన్స్‌లేషన్ బ్యూరో, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మర్స్‌ వెల్ఫేర...

SEBI: సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

SEBI: సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు  ముంబయిలోని స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ- సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌  బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ)- వివిధ విభాగాల్లో మొత్తం 97 ఆఫీసర్‌ గ్రేడ్‌-ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌) ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హలైన అభ్యర్థులు ఏప్రిల్‌ 13 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  వివరాలు: * అసిస్టెంట్‌ మేనేజర్‌: 97 పోస్టులు విభాగాలు: జనరల్‌, లీగల్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజీనిరింగ్‌ (ఎలక్ట్రికల్), రిసెర్చ్, అఫీషియల్‌ లాంగ్వేజ్‌. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి: 2024 మార్చి 31 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ఆయా కేటగిరీల వారీగా వయో పరిమితిలోసడలింపు ఉంటుంది. ప్రారంభ వేతనం: నెలకు రూ.44500- రూ.89150. ఎంపిక విధానం: ఫేజ్-1, ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. దరఖాస్తు రుసుము: అన్‌...