అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
18, డిసెంబర్ 2021, శనివారం
తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవ శ్రీవారి సేవలో అత్యంత ఖరీదైన టికెట్టు | ధర కోటి యాభై లక్షలు
■ ఆ సేవకు ఎందుకు అంత డిమాండ్..?
■ ఇంతకీ ఏంటి ఆ సేవలు ?
పూర్తి వివరాలు మీకోసమే....!
👇👇👇
*🙏ఉదయాస్తమాన సేవ🙏*.
తిరుమలలో ఆ సేవ టికెట్ల ధర కోటిన్నర...?
ఎందుకు అంత డిమాండ్...?
👉 సకల లోకాధిపతి దేవత సార్వభౌముడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈ కలియుగం లో ముక్తి మార్గం అనేది చాలా మంది భక్తుల నమ్మకం.
★ ఆ డిమాండ్ కి తగ్గట్టే ఉదయాస్తమాను సేవ టికెట్ల ధరల కోటిన్నర రూపాయలుగా టీటీడీ నిర్ణయించింది.
🕉 కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది.
🟢 సధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ కోటి రూపాయలు కాగా శుక్రవారం రోజున 1.5 కోట్లుగా టీటీడీ నిర్ణయించింది.
🕉 పరస్తుతం తిరుమల తిరుపతి
దేవస్థానం దగ్గర 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.
🕉 ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని భక్తులు పొందుతారు.
◆ ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని కల్పిస్తారు.
🟢 "ఉదయాస్తమాన సేవా"
టికెట్ల కేటాయింపుతో టీటీడీకి దాదాపు 600 కోట్ల పైగా ఆదాయం వస్తుంది.
◆ ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో లభించే మొత్తాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ పాలకమండలి ఇప్పటికే నిర్ణయించింది.
◆ సకల లోకాధిపతి దేవత సార్వభౌముడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈ కలియుగం లో ముక్తి మార్గం అనేది చాలా మంది భక్తుల నమ్మకం.
◆ °అందుకే సేవ ఎంత ఖరీదైనా భక్తులు వెనుకాడరు.
టికెట్ల ధరలు ఎంతైనా భారీగా డిమాండ్ ఉంటుంది..
🕉 అసలు ఉదయాస్తమాన సేవలు అంటే ఏంటి.. ?
🕉 ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయి.
🕉 వటికి ఎందుకంత డిమాండు.?
👉 పురాణ పురుషోత్తముడైన వేంకటేశ్వర స్వామి వారికి తిరుమల లో ఉదయము నుండి రాత్రి వరకు జరిగే ఆర్జిత సేవలను ఉదయాస్తమాన సేవ అంటారు.
🕉 శ్రీవారి ఆర్జిత సేవలు ఇవే...!
1. సుప్రభాత సేవ
2. తోమాల సేవ
3. కొలువు
4. అష్ట దళ పాద పద్మారాధన (సువర్ణ పుష్ప అర్చన)
5. అభిషేకం
6. వస్త్రాలంకార సేవ
7. కల్యాణోత్సవం
8. రథోత్సవం
9. తిరుప్పావడ
10. సహస్ర దీపాలంకరణ సేవ
11. ఏకాంత సేవ.
ఈ సేవలు ఎలా చేస్తారు.. ప్రత్యేకతలు ఏంటి..?
🕉 1. సుప్రభాత సేవ:
తర తరాలుగా హైందవ ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్న మహత్తర శ్రీ వేంకటేశ్వరస్తవం ఈసుప్రభాతం.
👉 ఇందులో..
● ఇరువది తొమ్మిది శ్లోకాలు గల సుప్రభాతాన్ని,
● పదకొండు శ్లోకాలున్న స్తోత్రాన్ని,
● పదహారు శ్లోకాలున్న ప్రపత్తి ని,
● పదునాలుగు శ్లోకాలున్న మంగళ శాసనాన్ని,
👉 15వ శతాబ్దములో మహాముని శిశ్యులైన ప్రతివాద భయంకర అన్నన్ స్వామి రచించారు.
★ ఈ దివ్య గానం ఎక్కడ విన్న మనస్సు తిరుమల క్షేత్రాన్ని చేరుకుంటుంది.
★ శ్రీ వారి సుప్రభాతం అనే ఈ మేలు కొలుపు సేవలో పాల్గొంటే మన మనస్సు మేల్కొని శ్రీ వారి సేవ కు అంకితమవుతుంది.
🕉 2. తోమాల సేవ:
పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసుని దివ్య మంగళ మూర్తి కి అనేక పుష్ప మాలికలతో, తులసి మాలలతో చేసే అలంకారమే తోమాల సేవ.
👉 ఈ సేవ లో పాల్గొన్న వారి మనస్సు అనే పుష్పం శ్రీ వారి పదాల చెంత చేరి జన్మ ధన్య మవుతుంది.
🕉 3. కొలువు:
తిరుమల లో బంగారు వాకిలికి ఆనుకొని వున్న గది ని స్నపన మండపం అంటారు.
ఇక్కడే శ్రీ వారికి ప్రతి రోజు ఆస్థానం జరుగు తుంది.
సన్నిధి లో వున్న కొలువు - శ్రీనివాస మూర్తి ని,
ఛత్ర చామరాది మర్యాదలతో, మంగళ వాద్య పురస్సరంగా స్నపన మండపంలో ఉంచిన బంగారు సింహాసనం పై వేంచేపు చేస్తారు.
◆ ఆ తరువాత స్వామి కి కొలువు నిర్వహించబడుతుంది.
◆ అనంతరం ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణాన్ని స్వామి వారికి విన్న విస్తారు.
◆ అలాగే ఆలయ ట్రెజరీ స్వామి వారి యొక్క లావాదేవీలను (ఆదాయ వ్యయాలను) స్వామి వారికి విన్న విస్తారు.
👉 °ఈ సేవ ను చూసి తరించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి స్వామి వారి అనుగ్రహం కలుగు తుంది.
🕉 4.అష్ట దళ పాద పద్మారాధన:
(సువర్ణ పుష్ప అర్చన)
తిరుమల క్షేత్రం లో ప్రతి నిత్యం వెయ్యి నూట ఎనిమిది (1108) సువర్ణ పుష్పాలతో,
సహస్ర నామాలతో స్వర్ణాలంకార భూషితుడయిన శ్రీ
వారికి ఈ అర్చన సేవ జరుగు తుంది.
◆ శ్రీ వారి అర్చనలో భక్తులు మనస్సు ఏకాగ్రతను పొంది,
శ్రీ వారి పాదాల మీద కేంద్రీకరింపబడి,
ఆధ్యాత్మిక ఆనందం మరియు లక్ష్మి కటాక్షం కలుగుతుంది.
🕉 5. అభిషేకం:
శ్రీ వారి అభిషేకాన్ని దర్శిస్తే చాలు భక్తులు శారీరక, మానసిక రుగ్మతలు తొలగి ఆయురారోగ్యములు కలుగుతాయి.
🕉 6. వస్త్రాలంకరణ సేవ:
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసునకు సర్వాంగ సుందరంగా, నయనానంద కరంగా పట్టు వస్త్రాలను
అలంకరించడమే వస్త్రాలంకరణ సేవ.
🕉 7. కల్యాణోత్సవం:
శ్రీ దేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారికి ప్రతి రోజూ నిత్యం కల్యాణోత్సవం జరుగుతుంది.
★ 15వ శతాబ్దములొ తాళ్ళపాక వంశస్థులచే ఈ కల్యాణోత్సవం ఆరంభిచబడినట్లు శాసనాల వల్ల తెలుస్తుంది.
👉 సర్వ జనులు క్షేమ, స్థైర్య,
ధైర్యాదులతో ఉండాలంటే
★ మహా సంకల్పం తో శ్రీ వారికీ కల్యాణోత్సవం చేయటం పరిపాటి.
👉 ఈ నిత్య కళ్యాణం వల్లనే శ్రీ వారిని కల్యాణ చక్రవర్తి అని,
తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లు తున్నది.
🕉 8. రథోత్సవం:
"రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే..|"
◆ సకల లోకాధిపతి అయినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి ని రథోత్సవం లో దర్శించు భాగ్యం వలన మరి యొక్క జన్మ ఉండదు అని ఆగమ శాస్త్రం చెబుతుంది.
🕉 9. తిరుప్పవాడ:
ప్రతి గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రెండవ అర్చన అనంతరం జరిగే నివేదనను తిరుప్పావడ సేవ అంటారు.
తిరుప్పావడ సేవ లో
పాల్గొన్న భక్తులకు నిత్యం అన్నం సమృద్ది గా కలుగుతుంది.
పాడి పంటలు వృద్ధి చెందుతాయి.
🕉 10.సహస్ర దీపాలంకరణ సేవ:
ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి వారు, సర్వాలంకార భూషితుడై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి
విచ్చేస్తారు.
◆ అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య వున్న ఊయలలో స్వామి వారు ఉభయ దేవేరుల సమేతంగా
ఆశీనులై, భక్తులకు దర్శనమిస్తారు.
👉 ఆ సమయం లో వేద పండితులు వేద మంత్రాలతో స్వామి వారిని కీర్తిస్తారు. నాద స్వర విద్వాంసులు
సుస్వరంగా నాదస్వరాన్ని విని పిస్తారు. అనంతరం గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతో, పురందర దాసు కీర్తనలతో శ్రీ వారికి
స్వరార్చన చేస్తారు.
◆ వేద, నాద, గానాలను ఆలకిస్తూ, మలయప్ప స్వామి మెల్ల మెల్లగా ఉయ్యాల తూగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
👉 °ఈ సేవ లో దేవ దేవున్ని దర్శించిన భక్తునకు సత్సంతానం కలుగుతుంది.
🕉 11.ఏకాంత సేవ:
తిరుమల శ్రీ వారి ఆలయం లో చివరగా జరిగే సేవ ఏకాంత సేవ.
👉 ఈ సేవ లో స్వామి వారు బంగారు పట్టె మంచం లో శయన మూర్తి గా దర్శన మిస్తారు.
◆ శ్రీ వారి పరమ భక్తురాలయిన మాతృ శ్రీ వెంగమాంబ ముత్యాల హారతి ని స్వామి వారికి సమర్పిస్తారు.
🟢 అన్నమా చార్యుల
వారి జోల పాట ను పాడి ఆరోజు సేవలను ముగిస్తారు.
14, డిసెంబర్ 2021, మంగళవారం
Income Tax Notice: ఇన్‌కమ్ టాక్స్ నుంచి నోటీసు వచ్చిందా ?.. అప్పుడేం చేయాలి ?.. పూర్తి వివరాలు
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్, ఫైలింగ్, జేఎస్ఓఎన్
ఆఫ్‌లైన్ యుటిలిటీ, కామన్ ఆఫ్‌లైన్ యుటిలిటీ శాఖ నుండి నోటీసు రావాలని ఎవరూ కోరుకోరు. అక్కడి నుంచి నోటీసులు
రావొద్దనే ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న
పొరపాట్ల వల్ల ఒక్కోసారి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇబ్బందులు
వచ్చిపడుతుంటాయి.
Gemini Internet
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేటప్పుడు మీ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక చిన్న పొరపాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. దీని కారణంగా ఆ శాఖ నుంచి మీకు నోటీసులు కూడా రావొచ్చు. అయితే ఈ రకంగా నోటీసులు పొందిన వాళ్లు www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ద్వారా సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది.
సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు పన్ను ఆదా చేయడానికి వ్యక్తులు తప్పుడు సమాచారం ఇస్తారు. ఎక్కువ నష్టాన్ని చూపుతారు. అటువంటి పరిస్థితిలో తప్పుడు సమాచారాన్ని నింపినట్లు అనుమానించబడిన వ్యక్తులకు శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంటుంది.
ఇక్కడ వచ్చే సాధారణ నోటీసులు కోసం సెక్షన్ 139(9) ప్రకారం ఐటీఆర్‌లో ఏదైనా సమాచారం లేకపోయినా లేక ఐటీఆర్ ఫారమ్‌లో ఇచ్చిన సమాచారం ఐటీ డిపార్ట్‌మెంట్ డేటాతో సరిపోలకపోతే అది తప్పుడు సమాచారంగా పరిగణించబడుతుంది.
ఈ పరిస్థితిలో పన్ను చెల్లింపుదారులు దీనికి 15 రోజుల్లోగా స్పందించాలి. అలా చేయడంలో విఫలమైతే వారి ఐటీఆర్ తిరస్కరించబడుతుంది. డిపార్ట్‌మెంట్ అడిగిన ప్రశ్నకు వివరంగా సమాధానం ఇవ్వాలి. దీని వల్ల వారికి మీ సమస్యను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉండదు.
అదనపు పన్ను చెల్లించినప్పుడు, వాపసును పన్ను చెల్లింపుదారుకు నివేదించినప్పుడు లేదా అసలు పన్ను కంటే తక్కువ చెల్లించినప్పుడు పన్ను బాధ్యతల గురించి శాఖ పన్ను చెల్లింపుదారులకు తెలియజేస్తుంది. ఇందుకోసం 143(1) కింద ఒక సమాచార నోటీసు పంపుతుంది.
ఫారమ్ 16, ఫారమ్ 16A ITR, TDS సర్టిఫికేట్‌లో ఆదాయం, మినహాయింపు లేదా మినహాయింపు మధ్య ఎటువంటి సంబంధం లేనప్పుడు సెక్షన్ 143(1)(a) ప్రకారం సమాచార నోటీసు పంపిస్తారు.
ITRపై పన్ను చెల్లింపుదారు నుండి అసెస్సింగ్ అధికారికి ఏదైనా అదనపు సమాచారం అవసరమైనప్పుడు సెక్షన్ 142(1) కింద నోటీసు ఇవ్వబడుతుంది. పన్నుచెల్లింపుదారుడు ఏ సంవత్సరంలో అయినా ITR ఫైల్ చేయకపోయినా, దానిని పంపవచ్చు.
కానీ మునుపటి సంవత్సరాల ఆధారంగా, అసెస్సింగ్ అధికారి ITRని ఫైల్ చేయాలని డిమాండ్ చేస్తారు. సెక్షన్ 142(1) కింద నోటీసుకు స్పందించకపోతే రూ. 10,000 జరిమానా లేదా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు.
జరిమానా, జరిమానా లేదా పన్ను డిమాండ్ చేసినప్పుడు సెక్షన్ 156 కింద IT శాఖ డిమాండ్ నోటీసును పంపుతుంది. నోటీసు అందుకున్న 30 రోజులలోపు మీరు బకాయి మొత్తాన్ని చెల్లించాలి.
ఎవరైనా ITRలో ఆదాయం చాలా తక్కువగా ఉందని లేదా నష్టం ఎక్కువగా
నివేదించబడిందని గుర్తించినప్పుడు ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 143(2) కింద
స్క్రూటినీ ఆర్డర్ ఇస్తుంది. ఇది దర్యాప్తు కోసం ఇచ్చే ఆర్డర్.
13, డిసెంబర్ 2021, సోమవారం
EPFO: పీఎఫ్ వడ్డీ మీ ఖాతాలో జమ అయ్యిందో లేదో చెక్ చేయండిలా..
ఇంటర్నెట్ డెస్క్: పీఎఫ్ చందాదారులకు గుడ్‌న్యూస్. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ మొత్తాలపై వడ్డీని చందాదారుల ఖాతాల్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జమ చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. 8.5 శాతం చొప్పున 25 కోట్ల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. మీ ఖాతాలో వడ్డీ జమ అయ్యిందో లేదో ఓ సారి చెక్ చేసుకోండి. ఎస్సెమ్మెస్, ఉమాంగ్ యాప్, ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్, మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
ఈపీఎఫ్వో పోర్టల్: ఈపీఎవో సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు www.epfindia.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో ‘అవర్ సర్వీసెస్’లోని ‘మెంబర్ పాస్‌బుక్’ విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు యూఏఎన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయడం కోసం మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. వివరాలు ఎంటర్ చేయడం ద్వారా మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.
మిస్డ్ కాల్ సర్వీస్: ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్‌కాల్ ఇచ్చిన తర్వాత ఓ రింగ్ అయి వెంటనే కాల్ కట్ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్ వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో ప్రత్యక్షమవుతాయి.
ఉమాంగ్ యాప్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే వీలుంది. అందుకోసం ఉమాంగ్ యాప్‌లోని ఈపీఎఫ్‌వోను ఎంచుకోవాలి. అందులో ‘ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లి ‘వ్యూ పాస్‌బుక్’ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్ నంబర్‌తో పాటు మీ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కనిపించే మెంబర్ ఐడీని క్లిక్ చేయడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్‌ను పొందొచ్చు. అయితే, మీ పీఎఫ్ ఖాతాతో మొబైల్ నంబర్ ముందే జత చేసి ఉండాలి.
ఎస్సెమ్మెస్ ద్వారా: యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న చందాదారులు ఈపీఎఫ్ ఖాతాకు జత చేసిన మొబైల్ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 77382 99899 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపించాలి. ప్రస్తుతం ఈ సదుపాయం పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని ఎస్సెమ్మెస్ పంపించాల్సి ఉంటుంది.
Visit Gemini Internet for EPF withdrawals
పి ఎఫ్ లో డబ్బు విత్ డ్రా చేయాలనుకునే వారు, వారి ఒరిజినల్ బ్యాంక్ అకౌంట్, ఆధార్, ఆధార్ కు లింక్ అయిన మొబైల్, UAN నెంబర్ UAN కు లింక్ అయిన మొబైల్ నెంబరును తీసుకుని జెమిన ఇంటర్ నెట్ నందు సంప్రదించవచ్చు.
12, డిసెంబర్ 2021, ఆదివారం
LIC Scholarship 2021: విద్యార్థులకు శుభవార్త.. LIC స్కాలర్ షిప్‌కి అప్లై చేయండి.. ఏడాదికి రూ.20,000 పొందండి
LIC Scholarship 2021: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది సువర్ణవకాశమని చెప్పాలి. LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ 2020 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం గ్రేడ్‌తో X, XII లేదా తత్సమానం ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆల్ ఇండియా ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. అర్హత, ఆసక్తి ఉన్న ఆర్థికంగా బలహీన విద్యార్థులు డిసెంబర్ 31, 2021లోగా దరఖాస్తు చేసుకోవాలి. LIC స్కాలర్‌షిప్‌లలో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి LIC డివిజనల్ కేంద్రానికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌లు, ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు
LIC డివిజనల్ కేంద్రానికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌లు
LIC డివిజనల్ కేంద్రానికి మొత్తం 20 సాధారణ స్కాలర్‌షిప్‌లు ఉంటాయి. ఇందులో బాలురకు 10, బాలికలకు 10 కేటాయిస్తారు. ఆర్థికంగా బలహీన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి వీటిని అందిస్తారు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఏదైనా రంగంలో డిప్లొమా కోర్సు, ఇంటిగ్రేటెడ్ కోర్సు, ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థలు లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలోవృత్తి విద్యా కోర్సులు చదివేవారికి అవకాశం ఉంటుంది.అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.20,000 అందజేస్తారు. 2020-21 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో (లేదా తత్సమాన గ్రేడ్) XII పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులందరూ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు
అర్హత కలిగిన బాలికలకు LIC ప్రతి డివిజన్ కేంద్రానికి మొత్తం 10 ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. అర్హులైన బాలికలకు సంవత్సరానికి రూ.10,000 అందజేస్తారు. 2020-21 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో (లేదా తత్సమానమైన గ్రేడ్) పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్లపాటు 10+2 పద్ధతిలో ఉన్నత చదువులు చదువుతున్న బాలికలు పొందేందుకు అర్హులు.
LIC స్కాలర్‌షిప్ కోసం ఇతర అర్హత ప్రమాణాలు
వారి చివరి పరీక్షలో 60% మార్కులకు తగ్గకుండా సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.1,00,000 లోపు ఉండాలి. అభ్యర్థులు వారి మార్కులు, కుటుంబ ఆదాయం ఆధారంగా ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయం ఉన్న అర్హతగల విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. అభ్యర్థులు కోర్సు చివరి పరీక్షలో వరుసగా ఆర్ట్స్/సైన్స్/కామర్స్ లేదా తత్సమాన గ్రేడ్‌లో ప్రొఫెషనల్ స్ట్రీమ్స్, గ్రాడ్యుయేషన్ కోర్సులలో 55% కంటే ఎక్కువ మార్కులు సాధించాలి.
LIC స్కాలర్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు LIC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
LIC స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31, 2021
Gemini Internet
Click here for official link https://licindia.in/Home
11, డిసెంబర్ 2021, శనివారం
NEET Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్ నెలరోజులు ఆలస్యం.. అధికారికంగా ప్రకటించిన ఎంసీసీ
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test) 2021
క్వాలిఫై అయిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్
ఫలితాలను ప్రకటించి ఒక నెల దాటినా, కౌన్సెలింగ్ (Counselling), అడ్మిషన్
ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన
చెందుతున్నారు. అయితే నీట్ కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేందుకు మరో నెల రోజుల
సమయం పడుతుందని చెబుతోంది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling
Committee). దీనికి సంబంధించి సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించింది.
మెడికల్ కాలేజీ అడ్మిషన్ల (Admissions)కు సంబంధించి అధికారుల నుంచి
అధికారిక ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సుప్రీంకోర్టులో
కొనసాగుతున్న కేసు కారణంగా నీట్ కౌన్సెలింగ్ ఆలస్యమవుతోందని MCC
తెలియజేసింది. మెడికల్ అడ్మిషన్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన EWS కోటాను
పొందేందుకు రూ.8 లక్షలు పరిమితిగా ఉంచడంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతోంది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 6న జరగనుంది.
Gemini Internet
ఆ తరువాతే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రానుంది. కాబట్టి తీర్పుకు ముందు కౌన్సెలింగ్ ప్రక్రియ (Counselling Process)ప్రారంభమయ్యే అవకాశం లేదు.
కౌన్సెలింగ్ ఎందుకు ఆలస్యం అవుతోంది?
TTD: టీటీడీ పాలకమండలి సంచలన నిర్ణయం.. తెరపైకి మూడో ఘాట్ రోడ్డు.. వైకుంఠ ఏకాదశికి గుడ్ న్యూస్
9, డిసెంబర్ 2021, గురువారం
Google Scholarship: గూగుల్ నుంచి రూ.74,000 స్కాలర్‌షిప్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
1. పరిచయం అక్కర్లేని సెర్చ్ ఇంజిన్, ఇంటర్నెట్ సేవల దిగ్గజ కంపెనీ అయిన
గూగుల్ (Google) విద్యార్థినులకు స్కాలర్‌షిప్ ప్రకటించింది. 'జనరేషన్
గూగుల్ స్కాలర్‌షిప్' (Generation Google Scholarship) పేరుతో ఆర్థిక
సహకారాన్ని ప్రకటించింది. కంప్యూటర్ సైన్స్‌లో విద్యను అభ్యసిస్తున్న
విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు.
Gemini Internet
2. డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయాలి. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. విద్యార్థినులు 2021 డిసెంబర్ 10 లోగా అప్లై చేయాలి. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనవారికి 2022-23 విద్యాసంవత్సరానికి 1000 డాలర్లు అంటే సుమారు రూ.74,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.
3. ఈ స్కాలర్‌షిప్‌ను కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ లేదా సంబంధిత టెక్నికల్ ఫీల్డ్‌లో డిగ్రీ చదువుతున్న విద్యార్థినులకు మాత్రమే ప్రకటించింది గూగుల్. దరఖాస్తుదారులు నాయకత్వాన్ని ప్రదర్శించడంతో పాటు కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీలో ప్రాతినిధ్యం లేని బృందాలను మెరుగుపర్చేందుకు తమ అభిరుచిని, ఆసక్తిని ప్రదర్శించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ విద్యాసంవత్సరంలో అంటే 2021-2022 లో ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ చదువుతున్నవారు మాత్రమే అప్లై చేయాలి. ఆసక్తి గల విద్యార్థినులు buildyourfuture.withgoogle.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Scholarships+ ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
5. ఆ తర్వాత Generation Google Scholarship (Asia Pacific) ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. నియమనిబంధనలు చదివిన తర్వాత APPLY NOW పైన క్లిక్ చేయాలి. తర్వాత గూగుల్ అకౌంట్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. పేరు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత విద్యార్థినికి సంబంధించిన మరిన్ని వివరాలు, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి.
6. తర్వాతి సెక్షన్‌లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. రెజ్యూమె, అకడమిక్ ట్రాన్స్‌స్క్రిప్ట్స్, ఎస్సే ప్రశ్నలకు సమాధానాలు అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తుల్ని 2021 డిసెంబర్ 10 లోగా సబ్మిట్ చేయాలి. అప్లికేషన్స్ విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత గూగుల్ నుంచి మెయిల్ వస్తుంది. దరఖాస్తుల్ని పరిశీలించిన తర్వాత స్కాలర్‌షిప్‌కు కొందర్ని ఎంపిక చేస్తుంది గూగుల్.
7. వైవిధ్యం, సమానత్వం, విద్యాభ్యాసంలో పనితీరు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ స్కాలర్‌షిప్ ఇస్తామని గూగుల్ ప్రకటించింది. వారికి 1,000 డాలర్ల స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థినులు generationgoogle-apac@google.com మెయిల్ ఐడీలో సంప్రదించొచ్చు.
JNVST 2022: 6వ తరగతి అడ్మిషన్ అప్లికేషన్ లో సవరణ కోసం విండో డిసెంబర్ 16న navodaya.gov.in-లో మొదలవుతుంది.
6వ తరగతి దరఖాస్తు ఫారమ్ లో సరిదిద్దుకునే/కరెక్షన్ విండో డిసెంబర్ 16, 2021న తెరవబడుతుంది.
JNVST 2022 తరగతి 6 ఎంపిక పరీక్షను నవోదయ విద్యాల సమితి రెండు గంటల పాటు నిర్వహిస్తుంది.
అభ్యర్థులు navodaya.gov.inలో మరింత వివరణాత్మక సమాచారాన్ని పొందవచ్చు.
Gemini Internet
https://www.youtube.com/watch?v=9NEqnsefRP4&ab_channel=HindupurInfo.fromGemini
Javahar నవోదయ విద్యాలయ 6వ తరగతి ఎంపిక పరీక్ష 2022 ఏప్రిల్ 30, 2022న నిర్వహించబడుతుంది. నవోదయ విద్యాల సమితి లేదా NVS దరఖాస్తు ఫారమ్‌ను సవరించడానికి దిద్దుబాటు విండో తేదీలను విడుదల చేసింది. మరింత సమాచారం navodaya.gov.in లో చూడవచ్చు.
నవోదయలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 15, 2021 అని అభ్యర్థులు గమనించాలి. నవోదయ విద్యాలయ సమితి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు డిసెంబర్ 16న దిద్దుబాటు విండోను పొందగలుగుతారు. నోటీసు ప్రకారం, "6వ తరగతి JNVST 2022కి సంబంధించిన దిద్దుబాటు విండో 2021 డిసెంబర్ 16 మరియు 17 వరకు తెరిచి ఉంటుంది. VI తరగతి JNVST 2022 కోసం ఇంతకముందే అప్లై చేసుకున్న అభ్యర్థుల డేటాలో సవరణ జెండర్ అంటే స్త్రీ లేదా పురుషుడు, కేటగిరీ అంటే జనరల్/ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ, ఏరియా (రూరల్ అంటే గ్రామీణ /అర్బన్ అంటే పట్టణ లేదా నగర ప్రాంతాలు), అలాగే వైకల్యం మరియు పరీక్షా మీడియం లాంటి వివరాలను మాత్రమే కరెక్షన్ కు అనుమతించబడుతుంది.
అందువల్ల, అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వంటి వారి ఆధారాలతో లాగిన్ చేయడం ద్వారా పైన పేర్కొన్న కేటగిరీలలో మాత్రమే మార్పులు చేయగలరు. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్-navodaya.gov.inకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మొదట పేరు, ఇమెయిల్ ఐడి, చిరునామా, ఆధార్ నంబర్, మునుపటి పాఠశాల వివరాలు మరియు ఇతర వివరాలను పూరించడం ద్వారా నమోదు చేసుకోవాలని గమనించాలి. దీని తరువాత, అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించగలరు. అభ్యర్థులు భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు ఫారమ్ కాపీని ఉంచుకోవాలని సూచించారు.
JNVST 2022 తేదీ
ఈవెంట్ తేదీ
JNVST 2022 దిద్దుబాటు విండో డిసెంబర్ 16 & 17, 2021న తెరవబడుతుంది
JNVST 2022 పరీక్ష ఏప్రిల్ 30, 2022
JNVST 2022 6వ తరగతి ఎంపిక పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా వివిధ భాషల్లో నిర్వహించబడుతుంది. పరీక్ష రెండు గంటల వ్యవధిలో ఉంటుంది మరియు పరీక్షలో మొత్తం మార్కుల సంఖ్య 100. అభ్యర్థులు మానసిక సామర్థ్యం, అంకగణితం మరియు భాష నుండి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరగనుంది. OMR షీట్ రాయడానికి అభ్యర్థులు నలుపు మరియు నీలం బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలని అభ్యర్థులు గమనించాలి. అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే ముందు NVS విడుదల చేసిన మొత్తం అధికారిక నోటిఫికేషన్‌ను చూడాలని సూచించారు.
ఇవి కూడా చూడండి
PM-SYM: రోజుకు 2 రూపాయలు చెల్లించండి.. ఈ పథకం ద్వారా నెలకు 3 వేల రూపాయల పెన్షన్ పొందండి.. ఎలా అంటే.. https://speedjobalerts.blogspot.com/2021/12/pm-sym-2-3.html
పెన్షన్‌పైనా పన్ను ఉంటుందా? పన్ను పడకపోవడానికి ఛాన్స్ ఎంతంటే.. https://speedjobalerts.blogspot.com/2021/12/blog-post.html
LIC Loan: మీరు ఎల్ఐసీ పాలసీదారా.. అయితే తక్కువ వడ్డీకే రుణం తీసుకోవచ్చు.. ఎలాగంటే. https://speedjobalerts.blogspot.com/2021/12/lic-loan.html
Personal Finance: ఈ పోస్టాఫీస్ స్కీంతో అధిక రిటర్న్స్, ప్రభుత్వ హామీ https://speedjobalerts.blogspot.com/2021/12/personal-finance.html
JNVST 2022 Date
Event | Date |
JNVST 2022 Correction Window opens | December 16 & 17, 2021 |
JNVST 2022 Exam | April 30, 2022 |
PM-SYM: రోజుకు 2 రూపాయలు చెల్లించండి.. ఈ పథకం ద్వారా నెలకు 3 వేల రూపాయల పెన్షన్ పొందండి.. ఎలా అంటే..
PM-SYM: ప్రతి మనిషికీ జీవిత కాలంలో బాధ్యతల బరువులు మోసిన తరువాత వృత్తి, ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకోవడం సహజం. పదవీవిరమణ అంటే రిటైర్మెంట్ తీసుకున్న తరువాత జీవితం నడవాలంటే ప్రతి నెల కొంత ఆదాయం తప్పనిసరిగా అవసరం అవుతుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులకు.. కొన్ని ప్రైవేట్ కొలువులకు రిటైర్మెంట్ తరువాత పెన్షన్ అందే సౌకర్యం ఉంది. కానీ, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల్ ఆపరిస్థితి దీనికి భిన్నం. కాలూ..చెయ్యి పనిచేయడం మొరాయిస్తే వీరి జీవితం కష్టాల కొలిమిలో పడిపోయినట్టే. వీరికి రిటైర్మెంట్ అనే పదం అంటేనే భయం పుడుతుంది. ఎందుకంటే.. పని మానేసి ఇంటిలో కూచుంటే వారికి కాలం గడిచే పరిస్థితి ఉండదు. అందుకోసమే.. ఇటువంటి వారికి సహకరించేలా రెండేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక పధకాన్ని తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ పధకంలో చేరే వారి సంఖ్యా ఎక్కువ అవుతుంది.
కేంద్రం తెచ్చిన ఈ పథకం ఏమిటి?
ఈ పథకం పేరు ప్రధాన్ మంత్రి శ్రమయోగి మంధన్ యోజన అంటే PM-SYM. అసంఘటిత రంగ కార్మికులకు నెలవారీ పింఛను అందించేందుకు 2019లో ఈ పథకాన్ని ప్రారంభించారు. 60 ఏళ్లు నిండిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 3,000 రూపాయల పింఛను అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. PM-SYM స్కీమ్‌కు విశేష స్పందన లభించింది. ఇప్పటి వరకు అసంఘటిత రంగానికి చెందిన 45,77,295 మంది కార్మికులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు.
ప్లాన్ ఇలా ఉంది…
- ఈ పథకంలో చేరడానికి కనీస వయసు 18 సంవత్సరాలు. గరిష్ట వయసు 40 సంవత్సరాలు.
- 18 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు 55 రూపాయలు చెల్లించాలి.
- 19 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరితే నెలకు 100 రూపాయలు చెల్లించాలి.
- 40 ఏళ్ల వయసు వారు ఈ పథకంలో చేరితే నెలకు 200 చెల్లించాల్సి ఉంటుంది.
- ఈ పథకంలో చేరి ప్రతి నేలా నిర్దేశిత మొత్తం చెల్లించిన వారికి 60 ఏళ్ల వయసు వచ్చిన తరువాత నెలకు 3 వేల రూపాయలు చెల్లిస్తారు. ఇలా ప్రతినెలా ఈ పథకంలో వయోజనులకు సొమ్ము చెల్లిస్తారు.
- ఈ పథకం కార్మికులు, డ్రైవర్లు, గృహ కార్మికులు, తోలు కార్మికులు, రిక్షా పుల్లర్లు మొదలైన అసంఘటిత రంగాలకు చెందిన వ్యక్తుల కోసం ఈ పథకం ఉద్దేశించారు.
Gemini Internet
పెన్షన్‌పైనా పన్ను ఉంటుందా? పన్ను పడకపోవడానికి ఛాన్స్ ఎంతంటే..
ప్రశ్న: నా పెన్షన్ రూ. 3,60,000. సేవింగ్స్ లేవు. ఇతర ఆదాయాలు లేవు. పెన్షన్ మీద పన్ను పడుతుందా?
: యం. మంగతాయారు, రాజమండ్రి
సమాధానం: ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. పెన్షన్ కూడా జీతంలాగే పన్నుకు గురయ్యే ఆదాయం. ఎటువంటి మినహాయింపు లేదు. పన్ను భారం లెక్కించేటప్పుడు ఆదాయంలాగే పరిగణనలోకి తీసుకోవాలి. రెండో విషయం .. మీకు సంబంధించిన ఇతర ఆదాయాలు ఏవీ లేవని అంటున్నారు కాబట్టి, మీ కేసులో మీరు 60 సం.లు. దాటినట్లయితే బేసిక్ లిమిట్ రూ. 3,00,000 అవుతుంది. బేసిక్ లిమిట్ దాటినా నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంటే పన్ను భారం లెక్కించిన తర్వాత రిబేటు ఉండటం వల్ల ఎటువంటి పన్ను భారం ఉండదు. సెక్షన్ 87 అ ద్వారా రిబేటు లభిస్తుంది. పెన్షన్‌లో నుంచి రూ. 50,000 తగ్గిస్తారు. ఈ తగ్గింపును స్టాండర్డ్ డిడక్షన్ అంటారు. కానీ ఫ్యామిలీ పెన్షన్‌ని జీతంగానూ, పెన్షన్‌గానూ భావించరు. ఆ మొత్తాన్ని ‘ఇతర ఆదాయం’గా పరిగణించి, అందులో నుంచి 1/3వ భాగం లేదా రూ. 15,000 ..ఈ రెండింటిలో ఏది తక్కువైతే .. ఆ మొత్తాన్ని మినహాయింపుగా ఇస్తారు. ఏ పెన్షన్ అయినా పన్నుభారానికి గురి అవుతుంది. బేసిక్ లిమిట్ లోపల ఉన్నా .. రూ. 5,00,000 లోపల ఉన్నా రిబేటు పొందడం ద్వారా పన్ను పడకపోవచ్చు.
-----------
ప్రశ్న: నేను
గత వారం ఆదాయపు పన్ను రిటర్న్ వేసి రిఫండ్ క్లెయిమ్ చేశాను. ఈ రోజు
రిఫండ్ .. నా బ్యాంకు అకౌంట్లో జమ అయింది. ఎటువంటి సమాచారం /ఆర్డర్లు /
ఉత్తరాలు రాలేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
: యం. శంకరరావు, సికింద్రాబాద్
సమాధానం: అవును. ఇప్పుడు చాలా త్వరగా అసెస్‌మెంట్ చేస్తున్నారు. సెంట్రల్ ప్రాసెసింగ్ సెల్ ద్వారా జరుగుతోంది. అన్ని అంశాలు .. అంటే ఆదాయం, తగ్గింపులు, మినహాయింపులు, పన్ను చెల్లింపులు, బ్యాంకు అకౌంట్ వివరాలు మొదలైనవి సరిగ్గా ఉంటే సత్వరం రిఫండ్ ఇస్తున్నారు. ముందుగా 143 (1) ప్రకారం ఆర్డరు మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది. చెక్ చేసుకోండి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను మీ అసెస్‌మెంట్ అయినట్లు. ఏమీ గాభరా పడక్కర్లేదు. అయితే, కొన్ని మార్గదర్శకాలను అనుసరించి ‘‘స్క్రూటినీ’’ ఎంపిక చేస్తే మాత్రం మళ్లీ అసెస్‌మెంట్ చేస్తారు.
----------------
ప్రశ్న:2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను కాస్ట్ అప్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ ఎంత ఉంది. దీన్ని ఎలా నిర్ణయిస్తారు?
: జె.వి.యస్. యన్. మూర్తి, హైదరాబాద్
సమాధానం: 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఇండెక్స్‌ను 317గా నిర్ణయించి, ఆ మేరకు నోటిఫికేషన్ ఎప్పుడో జారీ చేశారు. ప్రతి సంవత్సరం ఇది మారుతుంటుంది. దేశంలో ఉన్న ద్రవ్యోల్బణం .. అంటే ధరల పెరుగుదల సూచికను బట్టి కేంద్ర ప్రభుత్వంలోని నిపుణులు ఈ ఇండెక్స్ లెక్కిస్తారు. ఆదాయపు పన్ను విభాగం ఒక నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది. ఈ సంవత్సరంలో జరిగే స్థిరాస్తి క్రయ విక్రయాలు, ఇతర క్యాపిటల్ ఆస్తులు, షేర్లు మొదలైన వాటికి దీన్ని వర్తింపచేస్తారు.
పన్నుకు సంబంధించిన సందేహాలు business@sakshi.com ఈ–మెయిల్ పంపించగలరు.
Gemini Internet
LIC Loan: మీరు ఎల్ఐసీ పాలసీదారా.. అయితే తక్కువ వడ్డీకే రుణం తీసుకోవచ్చు.. ఎలాగంటే.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ. ఈ సంస్థకు లక్షల్లో పాలసీదారులు ఉన్నారు. అయితే LIC తన పాలసీదారులకు రుణ సౌకర్యంతో సహా అనేక సదుపాయాలను అందిస్తుంది. మీకు ఎల్‌ఐసీ పాలసీని ఉంటే సులభంగా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. దీని వడ్డీ రేటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కంటే తక్కువగా ఉంది. వ్యక్తిగత రుణంపై ఎల్‌ఐసీ వడ్డీ రేటు 9 శాతం నుంచి ప్రారంభమవుతుంది. మీ ఎల్‌ఐసీ పాలసీపై మీరు ఎంత రుణం పొందుతారు అనేది మీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.
రుణ కాల వ్యవధి 5 సంవత్సరాలు ఉంటుంది. లోన్ మొత్తం పాలసీ సరెండర్ విలువపై ఆధారపడి ఉంటుంది. అందులో 90% వరకు లోన్ పొందవచ్చు. మీ పాలసీ సరెండర్ విలువ రూ. 5 లక్షలు అయితే మీరు దానిపై 4.5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. దీని అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే.. మీరు లోన్ కాలపరిమితికి ముందు చెల్లిస్తే ప్రత్యేక ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని ఫోర్‌క్లోజర్ ఛార్జ్ అని కూడా అంటారు.
అయితే LIC పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు ఎంత అనేది పూర్తిగా దరఖాస్తుదారు క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రొఫైల్‌లో రుణదాత ఆదాయం, అతను చేసే ఉపాధి పను, లోన్ మొత్తం ఎంత, రుణం తిరిగి చెల్లించే వ్యవధి ముఖ్యమైనవి. రుణ రేటు ఈ అంశాలన్నింటిపై ఆధారపడి ఉంటుంది. రుణంపై వడ్డీ రేటు ఫ్లాట్ రేట్ లేదా ఫ్లాట్ బ్యాలెన్స్ పద్ధతిని ఉపయోగించి లెక్కిస్తారు. దీనిలో రుణం మొత్తంపై వడ్డీ వసూలు చేస్తారు. మీరు 5 లక్షల రుణం తీసుకుని క్రమంగా దాన్ని తిరిగి చెల్లించి 2 లక్షలకు తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఆ 2 లక్షలకు మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు.
EMI ఎంత ఉంటుంది
సంవత్సరకాలానికి ఒక వ్యక్తి 9% చొప్పున రూ.1 లక్ష రుణం తీసుకుంటే అతను నెలకు రూ. 8,745 EMI చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని 2 సంవత్సరాల కాలవ్యవధికి తీసుకుంటే అప్పుడు రూ. 4,568 EMI ఉంటుంది. 3 సంవత్సరాల పాటు రుణంపై రూ. 3,180 EMI ఉంటుంది. రుణాన్ని 4 సంవత్సరాల కాలవ్యవధికి తీసుకుంటే, అప్పుడు రూ. 2,489 EMI ఉంటుంది. 5 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే, 2,076 EMI ఉంటుంది.
మీరు 5 లక్షల వ్యక్తిగత రుణం తీసుకున్నట్లయితే, 1 సంవత్సరం కాలానికి నెలకు రూ. 44,191 EMI ఉంటుంది. 2 సంవత్సరాల లోన్ కాలవ్యవధిలో 23,304 EMI ఉంటుంది.3 సంవత్సరాల కాలవ్యవధితో రుణంపై EMI రూ. 18,472 అవుతుంది. 4 సంవత్సరాలకు రూ. 15,000 EMI, 5 సంవత్సరాల కాలవ్యవధితో రుణంపై రూ. 12,917గా ఉంటుంది.
రుణం ఎలా తీసుకోవాలి
మీరు లోన్ తీసుకోవడానికి LIC వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు. మీరు ఈ వెబ్‌సైట్‌లో రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఫారమ్‌లో వివరాలు నమోదు చేసిన తర్వాత, దాన్ని డౌన్‌లోడ్ చేయండి. ఈ ఫారమ్‌ను ప్రింట్ అవుట్ తీసుకుని, సంతకం చేసిన తర్వాత స్కాన్ చేసి ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. ఇలా చేసిన తర్వాత రుణ దరఖాస్తు పూర్తవుతుంది. దీని తర్వాత, LIC మీ దరఖాస్తును ధృవీకరించి, లోన్ జారీ ప్రక్రియను ప్రారంభిస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత, లోన్ మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తారు.
Gemini Internet
Personal Finance: ఈ పోస్టాఫీస్ స్కీంతో అధిక రిటర్న్స్, ప్రభుత్వ హామీ
సురక్షిత పెట్టుబడికి చాలామంది బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్‌ను ఎంచుకుంటారు. రిస్క్‌ను ఇష్టపడని వారు ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు మొగ్గు చూపుతారు. ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పాటు పోస్టాఫీస్ పథకాలు కూడా సురక్షితమైనవి. అంతేకాదు, ఇక్కడ పలు పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే అధిక వడ్డీరేటు వస్తుంది. కరోనా కంటే ముందు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్స్ (FD) పైన అధిక వడ్డీ రేటును ఇచ్చాయి. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను భారీగా తగ్గించడంతో బ్యాంకులు కూడా FD వడ్డీ రేటును కనిష్టాలకు తీసుకెళ్లాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో 5 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు వస్తోంది.
అదే సమయంలో పోస్టాఫీస్ పథకాల్లో 5.5 శాతం నుండి 6.7 శాతం వరకు ఉంది. పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ప్రభుత్వ గ్యారెంటీతో పాటు మంచి రిటర్న్స్ ఉంటాయి. వడ్డీ రేటు ప్రయోజనం త్రైమాసికం పరంగా ఉంటుంది.
పోస్టాఫీస్ FDలో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం. పోస్టాఫీస్ FDలో ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, అయిదేళ్ల కాలపరిమితి ఉంది.

పోస్టాఫీస్ FD ప్రయోజనాలు
- పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ప్రభుత్వ హామీ ఉంటుంది.
- ఇందులో ఇన్వెస్టర్ మనీ పూర్తి సురక్షితం.
- ఆఫ్ లైన్(క్యాష్, చెక్కు రూపంలో) రూపంలోను ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. లేదా ఆన్ లైన్(నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్) రూపంలోను ఇన్వెస్ట్ చేయవచ్చు.
- ఒక FDకి మించి మీరు ఇన్వెస్ట్ చేయవచ్చు.
- జాయింట్ అకౌంట్ రూపంలోను FDని ఓపెన్ చేయవచ్చు.
- అయిదేళ్ల కాలపరిమితికి ఫిక్స్డ్ డిపాజడిట్ చేస్తే ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో పన్ను మినహాయింపు ఉంది.
- ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్‌కు fdని ట్రాన్సుఫర్ చేసుకోవచ్చు.
- కనీసం రూ.1000 నుండి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు.
- సాధారణంగా వడ్డీ రేట్లు 7 రోజుల నుండి 10 రోజుల కాలపరిమితిపై 5.50 శాతం ఉంది. మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై 6.70 శాతం వడ్డీ రేటు ఉంది.
Gemini Internet
7, డిసెంబర్ 2021, మంగళవారం
PM Mudra Yojana: ప్రజలకు అండగా నిలుస్తున్న కేంద్ర సర్కార్ పథకం.. ఇందులో దరఖాస్తు చేసుకుంటే రూ.10 లక్షల రుణం!
PM Mudra Yojana: కేంద్ర సర్కార్ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతోంది. ప్రజలు ఉపాధిని పెంపొందించేందుకు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్‌లలో ప్రధాన మంత్రి ముద్ర యోజన ఒకటి. ఇందులో మొదటి దశలో చాలా మందికి అండగా నిలిచింది ఈ పథకం. ఇప్పుడు మరో దశ ముద్ర పథకం కూడా ప్రారంభమైంది. ఈ స్కీమ్ కింద బ్యాంకులు రుణాలు పంపిణీ చేస్తున్నాయి. రుణాలు పొందడానికి అవకాశం కోసం చూస్తున్న వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి.
సులభంగా రుణాలు..
ఈ స్కీమ్ ద్వారా అర్హులైన వారు సులభంగా రుణాలు పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం ముద్రా యోజన కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం అందజేస్తారు. అయితే ఇందులో కొన్ని కేటగిరిలు ఉన్నాయి. శిశు, కిశోర్, తరుణ్ అనే మూడు కేటగిరిలు ఉన్నాయి. వీటిల్లో శిశు కేటగిరి కింద రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
అయితే నిధుల కోసం కటకటలాడే చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారికి చేయూతనిచ్చేలా 08 ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజనను ప్రారంభించారు. మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల వరకు రుణాలను అందిస్తుంది. దాదాపు 12 కోట్ల మంది వరకు ఉద్యోగాలు కల్పిస్తున్న 5.75 కోట్ల పైగా లఘు, చిన్న తరహా సంస్థల ఆర్థిక అవసరాలు తీర్చడంపై ఇది దృష్టి పెడుతుంది. పెద్ద సంస్థల్లో కేవలం 1.25 కోట్లకుపైగా ఉపాధి పొందుతుండగా, చిన్న సంస్థలు 12 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటికి తోడ్పాటునిచ్చేందుకే ముద్ర పథకాన్ని ప్రవేశపెట్టారు.
దరఖాస్తు చేసుకోండిలా..
ఈ పథకంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా, ఐడెంటిటీ ప్రూఫ్, రెండు ఫోటోలు, బిజినెస్ ప్రూఫ్ వంటివి ఉంటే ఈ రుణం పొందవచ్చు. దీని కోసం బ్యాంకు బ్రాంచుకు వెళ్లాలి. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముద్రా వెబ్‌సైట్‌కు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రుణ రేట్లు బ్యాంక్ ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. https://udyamimitra.in/ లింక్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, పౌల్ట్రీ, పశువుల పెంపకం, గ్రేడింగ్, సార్టింగ్, అగ్రిగేషన్ అగ్రో ఇండస్ట్రీస్, డైరీ, ఫిషరీ, అగ్రికల్నిక్స్, అగ్రిబిజినెస్ సెంటర్లు, ఫుడ్ అండ్ అగ్రో-ప్రాసెసింగ్ వంటి వ్యవసాయానికి సంబంధించిన వాటికి అర్హులు.
రుణ రకాలు:
► శిశు: రూ. 50,000 వరకు రుణాలు
► కిశోర్: రూ. 5 లక్షల వరకు
► తరుణ్: రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు రుణాలు అందిస్తున్నారు.
రుణం పొందేందుకు అర్హత:
► భారత పౌరుడై ఉండాలి
► ఒక వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగ ఉండాలి,
► ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగంలో.
► రుణ అవసరం రూ.10 లక్షల లోపు ఉండాలి.
► పైన పేర్కొన్న అర్హత గల వారు దగరలో ఉన్న బ్యాంక్, సూక్ష్మ ఋణ సంస్థ
(ఎంఎఫ్‌ఐ), లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)
అధికారులను సంప్రదించాలి.
Gemini Internet
27, నవంబర్ 2021, శనివారం
Kisan Vikas Patra: కిసాన్ వికాస్ పత్రలో పదేళ్లలో మీ డబ్బు రెట్టింపు
Gemini Internet
Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, అనంతపురంలో పదోతరగతి, ఇంటర్ అర్హతతో 76 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ).. అనంతపురం ఆసుపత్రుల్లో ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 76
పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్, థియేటర్ ఆర్టిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, బ్యాచిలర్ డిగ్రీ, డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్ కౌన్సిల్/పారా మెడికల్ బోర్డ్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, గత పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిస్ట్రిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(ఏపీవీవీపీ), గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాంపస్, అనంతపురం, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021
వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in
for application and notification Visit Gemini Internet, D L Road, Hindupur
Gemini Internet
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...