ఐబీపీఎస్‌లో టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేది ఫిబ్రవరి 8



ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. టెక్నికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: అనలిస్ట్ ప్రోగ్రామర్-విండోస్-01, అనలిస్ట్ ప్రోగ్రామర్-ఫ్రంట్ ఎండ్-02, ఐటీ సిస్టమ్స్ సపోర్ట్ ఇంజనీర్-01, ఐటీ ఇంజనీర్(డేటా సెంటర్)-02.
అర్హతలు:
  • అనలిస్ట్ ప్రోగ్రామర్-విండోస్: ఫుల్‌టైం బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ(ఐటీ)/ ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
  • అనలిస్ట్ ప్రోగ్రామర్-ఫ్రంట్ ఎండ్: ఫుల్‌టైం బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ (ఐటీ)/ఎమ్మెస్సీ(కంప్యూటర్ సైన్స్‌) ఉత్తీర్ణుల వ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
  • ఐటీ సిస్టమ్స్ సపోర్ట్ ఇంజనీర్: కంప్యూటర్ సైన్స్‌/ఐటీ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి, సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.
  • ఐటీ ఇంజనీర్ (డేటా సెంటర్): కంప్యూటర్ సైన్స్‌/ఐటీ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 01.01.2021 నాటికి 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఆన్‌లైన్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో వివిధ విభాగాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. సమయం 90 నిమిషాలు ఉంటుంది. ఆప్టిట్యూడ్ 50 మార్కులకు, ప్రొఫెషనల్ నాలెడ్‌‌జ 50 మార్కులకు ఉంటుంది. చివరగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆన్‌లైన్ టెస్ట్ మెరిట్ స్కోర్ ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 8, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.ibps.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)