16, జనవరి 2021, శనివారం

🕉– *తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం*


        ➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల:
 కనుమ పండుగ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం శుక్ర‌‌వారం ఘనంగా జరిగింది. మ‌ధ్యాహ్నం 1 గంట‌కు శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి పార్వేట మండపమునకు చేరుకున్నారు . పుణ్యాహవచనం తర్వాత మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదన,  హారతులు జరిగాయి.

■ శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి యాద‌వ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వెళ్ళారు. తరువాత స‌న్నిధి యాద‌వ‌ సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్పస్వామివారికి నివేదనము హారతి అయి యాద‌వ‌కు బహుమానము జరిగింది. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందుకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసి వెనుకకు వచ్చారు. ఇలా మూడుసార్లు జరిగింది. 

🟢 శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హథీ రాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు.

👉 ఈ ఉత్సవంలో అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మా రెడ్డి దంపతులు, డిఎఫ్.వో. శ్రీ చంద్ర శేఖర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఎస్.ఈ. శ్రీ నాగేశ్వర్ రావు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.* 

కామెంట్‌లు లేవు: