APSSDC ద్వారా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC ) ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడం లో భాగంగా గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో విభాగాల వారీగా ఉద్యోగాల భర్తీకి గాను ఒక ప్రకటన విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు | జనవరి 27, 2021 మరియు జనవరి 28,2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
విభాగాల వారీగా ఖాళీలు :
ఫౌండ్రి విభాగం :
ట్రైనీ ఆపరేటర్ | 500 |
మెషిన్ షాప్ విభాగం :
ట్రైనీ ఆపరేటర్ | 300 |
డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ | 200 |
అర్హతలు :
ఫౌండ్రి విభాగంలో భర్తీ చేయనున్న ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యలను పూర్తి చేసిన 18 నుండి 30 సంవత్సరాల పురుష అభ్యర్థులు హాజరు కావచ్చు.
మెషిన్ షాప్ విభాగంలో భర్తీ చేయనున్న ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు ఐటీఐ (ఎనీ ట్రేడ్ ) / డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన 18 నుండి 28 సంవత్సరాల పురుష అభ్యర్థులు హాజరు కావచ్చును.
డిప్లొమా ట్రైనీ ఆపరేటర్ ఉద్యోగాల ఇంటర్వ్యూలకు ఏదైనా విభాగంలో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన 20-28 సంవత్సరాల వయసు గల పురుష అభ్యర్థులు హాజరు కావచ్చును.
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు 50 నుండి 80 కేజీల వరకూ ఫిజికల్ ఫిట్ నెస్ ను కలిగి ఉండి, ఎత్తు 5 అడుగులు, ఐ సైట్ (-2) పైన ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.
Note:
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు విద్యా అర్హత సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ మరియు జీరాక్స్ కాపీలను, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మరియు నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
హెచ్. ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 11,300 రూపాయలు వరకూ జీతం, ప్రొవిడెంట్ ఫండ్ ( P.F ) మరియు ESI లభించడంతో పాటు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యలను కూడా కల్పించనున్నారు.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు మరియు తేదీలు :
జనవరి 27 వ తేదీన ఈ క్రింది అడ్రస్ లలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
అడ్రస్ (1) :
17/244-5, అనంతపూర్ రోడ్, గంగమ్మ మోరి ఎదురుగా, కూతగుల్లా, ఎర్ర దొడ్డి, కదిరి.
అడ్రస్ ( 2 ) :
ECHO SKILL TRAINING CENTER, 15-1149-5, ఓల్డ్ బీసీ హాస్టల్, సంజీవ నగర్, 5th రోడ్, విద్యార్థి విద్యాలయం దగ్గర, తాడిపత్రి.
జనవరి 28వ తేదీన ఈ క్రింది అడ్రస్ లలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.
అడ్రస్ ( 1 ) :
KTS గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, రాయదుర్గ్,74 ఉడే గోళం, రాయదుర్గం.
అడ్రస్ ( 2 ) :
మహాత్మా డిగ్రీ కాలేజీ, పవర్ ఆఫీస్ దగ్గర, ఉరవకొండ.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
9010039901
8247410655
9182920381
8464949408
1800-425-2422
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి