18, ఫిబ్రవరి 2021, గురువారం

TTD UPDATE

ఫిబ్రవరి 20న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 17 ఫిబ్రవరి 2021: భక్తుల సౌకర్యార్థం మార్చి నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 20న శనివారం ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా, అదేరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మార్చి నెల‌కు సంబంధించి తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల బుకింగ్ కోటాను విడుద‌ల చేస్తారు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను, గ‌దుల‌ను బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

కామెంట్‌లు లేవు: