3, మే 2023, బుధవారం

ఎడ్యుకేషన్ గ్రాంట్కు దరఖాస్తు చేసుకోండి

అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాజీ సైనిక కుటుంబాల పిల్లలకు 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎడ్యుకేషన్ గ్రాంట్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ అధికారి శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అర్హత కలిగిన మాజీ సైనిక కుటుంబాల పిల్లలు అక్టోబరు 31లోపు 'కేంద్రీయ సైనిక బోర్డు వెబ్ సైట్' ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హవల్దార్ కింది ర్యాంకులు కలిగిన మాజీ సైనికుల కుటుంబాల వారు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో పనిచేసిన వారు, మాజీ సైనికుల కుటుంబాల వారు ఈ అవకాశాన్ని సది ్వనియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్నివివరాలకు 08554-241146 నంబరులో సంప్రదించాలన్నారు.

కామెంట్‌లు లేవు: