3, మే 2023, బుధవారం

స్కిల్ హబ్లో నూతన కోర్సు | హిందూపురం

స్కిల్ హబ్ ద్వారా ప్రభుత్వం యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నూతన కోర్సులు ప్రవేశపెట్టి యువత నైపుణ్యం సాధించేలా చూస్తోంది. ఈ క్రమంలోనే హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని స్కిల్ హబ్లో 'కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ నాన్ వాయిస్' కోర్సు ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సి పల్ హరీష్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యుమ్ తెలిపారు. మే నెల 4 తేదీ నుంచి కోర్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణ, డిగ్రీ ఆపైన చదివిన యువత అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు 8297525703 నంబరులో లేదా, హిందూపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేరుగా  సంప్రదించవచ్చునన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

కామెంట్‌లు లేవు: