దూరవిద్య డిగ్రీ,పీజీ సప్లి ఫలితాల విడుదల
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ దూరవిద్య డిగ్రీ, పీజీ మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలను మంగళవారం వీసీ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ, బీకాం (కంప్యూటర్స్) కోర్సుల్లో మొత్తం 354 మంది పరీక్షలు రాయగా 226 (64 శాతం) మంది ఉత్తీర్ణత చెందారు. ఎంఏ, ఎంకాం, ఎంబీఏ మొత్తం 182 మంది పరీక్షలు రాయగా 143 మంది ఉత్తీర్ణులయ్యారు. రీవాల్యుయేషన్కు ఈ నెల 23 చివరి తేదీగా నిర్ధారించారు. డిగ్రీ, పీజీ కోర్సు రీవాల్యుయేషన్ ఫీజు రూ. 1000 చెల్లిం చాల్సి ఉంటుంది. ఫలితాలు www.skucdc.com లో చూడవచ్చు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎంవీ లక్ష్మయ్య, ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జీవీ రమణ, దూరవిద్య డైరెక్టర్ మునినారాయణప్ప, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె.శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు