19, జూన్ 2023, సోమవారం

AP DEECET: ఏపీ డీఈఈసెట్‌ ఫలితాలు విడుదల


ఏపీలో రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశానికి నిర్వహించిన డీఈఈసెట్‌ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 12, 13 తేదీల్లో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ జూన్‌ 19న విడుదల చేసింది. డీఈఈసెట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఐచ్ఛికాలను జూన్‌ 22 నుంచి 27 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్‌ లేఖలను 28 నుంచి 30 వరకు జారీ చేస్తారు. డైట్‌ల్లో ధ్రువపత్రాల పరిశీలన జులై 6 వరకు కొనసాగనుంది. అభ్యర్థులు తమ ఐడీ, పుట్టినతేదీలను ఎంటర్‌ చేయడం ద్వారా ర్యాంక్‌ కార్డు పొందొచ్చు.

ర్యాంక్‌ కార్డు క్లిక్‌ చేయండి

కామెంట్‌లు లేవు: