19, జూన్ 2023, సోమవారం

NEET: నీట్‌ మెరిట్‌ లిస్టులో మార్పులు * ఇకపై ‘ఫిజిక్స్‌’ మార్కులకు ప్రాధాన్యం


దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష ఫలితాల్లో మెరిట్‌ లిస్ట్‌ (NEET merit list)ను నిర్ణయించే ప్రక్రియలో మార్పులు చేయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) నిర్ణయించింది. ఒకే స్కోరు వచ్చిన అభ్యర్థులకు ర్యాంక్‌లు కేటాయించడంలో ఇకపై ఫిజిక్స్‌ (Physics) మార్కులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బయాలజీ (Biology) మార్కులకు ప్రాధాన్యమిస్తుండగా ఇకపై ఆ నిబంధనను సవరించాలని నిర్ణయించింది.  ఈ మేరకు గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేషన్‌-2023ను జాతీయ వైద్య మండలి ఇటీవల విడుదల చేసింది. ఒకవేళ, సబ్జెక్టుల మార్కులు కూడా ఒకే విధంగా ఉంటే.. అప్పుడు కంప్యూటర్‌ ఆధారిత డ్రా ద్వారా మెరిట్‌ లిస్ట్‌ను తయారు చేయనున్నట్లు ఎన్‌ఎంసీ తెలిపింది. ఇందులో మానవ ప్రమేయం ఏమీ ఉండదని తెలిపింది. ఈ కొత్త రెగ్యులేషన్స్‌ను వచ్చే ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీనిపై జాతీయ వైద్య మండలి (NMC), జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) త్వరలోనే మరింత వివరణ ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

టై-బ్రేకర్‌ రూల్‌
నీట్‌-యూజీ (NEET-UG) పరీక్షకు హాజరైన విద్యార్థులు ఒకే స్కోరు/మార్కులు సాధించినప్పుడు ‘టై’ అవుతుంది. నిబంధనల ప్రకారం.. అలాంటి సమయాల్లో ర్యాంకులను కేటాయించేందుకు టై-బ్రేకర్‌ రూల్‌ను పాటిస్తారు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం.. ఇలా టై అయినప్పుడు బయాలజీ మార్కులను చూస్తారు. అందులో ఎవరికి ఎక్కువ వస్తే వారికి ర్యాంక్‌ (Merit List) కేటాయిస్తారు. తక్కువ వచ్చిన వారికి ఆ తర్వాతి ర్యాంక్‌ ఇస్తారు. బయాలజీలోనూ ఒకే మార్కులు ఉంటే కెమిస్ట్రీ, ఆ తర్వాత ఫిజిక్స్‌ మార్కులు చూసి ర్యాంకులను కేటాయిస్తున్నారు. సబ్జెక్టుల్లోనూ టై ఉంటే.. అభ్యర్థి వయసు బట్టి.. పెద్దవారికి మొదట ర్యాంక్‌ కేటాయిస్తారు. అయితే, ఈ టై బ్రేకింగ్‌ రూల్స్‌ను మార్చాలని జాతీయ వైద్య మండలి తాజాగా నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం.. విద్యార్థుల స్కోరు సమానమైనప్పుడు.. తొలుత ఫిజిక్స్‌లో వచ్చిన మార్పుల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. అవి కూడా సమానంగా ఉంటే కెమిస్ట్రీ, ఆ తర్వాత బయాలజీ మార్కులను పరిగణిస్తారు. అప్పటికీ టై వీడకపోతే.. కంప్యూటర్‌తో డ్రా తీసి ర్యాంకును కేటాయించాలని నిర్ణయించింది. ఈ కంప్యూటర్‌ డ్రాలో మానవ జోక్యం ఉండదని ఎన్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు.

9 ఏళ్లలో పూర్తి చేయాలి..
మెరిట్‌ జాబితాతో పాటు మరికొన్ని నిబంధనల్లోనూ మార్పులు చేశారు. కొత్త నిబంధనల ప్రకారం.. ఎంబీబీఎస్‌ కోర్సులో చేరిన విద్యార్థులు తమ అడ్మిషన్‌ తేదీ నుంచి 9 ఏళ్లలో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక, ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించేందుకు నాలుగు ప్రయత్నాలను మాత్రమే ఇచ్చింది. అంతేగాక, నీట్‌-యూజీ మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా దేశంలోని అన్ని మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లలో గ్రాడ్యుయేషన్‌ కోర్సుల ప్రవేశాల కోసం కామన్‌ కౌన్సెలింగ్‌ ఉంటుందని ఎన్‌ఎంసీ తెలిపింది.

 

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: