సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మైనింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన తొమ్మిది యూనిట్లలో కేంద్రప్రభుత్వ రంగ సంస్థ.. ‘బ్యాంక్‌ నోట్‌ ప్రెస్‌’ (బీఎన్‌ఎస్‌) ఒకటి. దేవాస్‌ (ఎంపీ)లోని ఇది తాజాగా సూపర్‌వైజర్, జూనియర్‌ టెక్నీషియన్‌ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. పోస్టులను బట్టి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ విద్యార్హతతో అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్ష ద్వారా జరుగుతుంది. సూపర్‌వైజర్, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్, టెక్నీషియన్‌ పోస్టులకు ఆన్‌లైన్‌ పరీక్షలు వేర్వేరుగా నిర్వహిస్తారు. ‣ అర్హత: ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ


1) సూపర్‌వైజర్‌ (ప్రింటింగ్‌): 8 ఖాళీలున్నాయి. ప్రింటింగ్‌ టెక్నాలజీ/ ఇంజినీరింగ్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌ చేసినవారూ దరఖాస్తు చేయొచ్చు. 


2) సూపర్‌వైజర్‌ (కంట్రోల్‌): 3 పోస్టులున్నాయి. ప్రింటింగ్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్లాజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ/బీఎస్సీ ఇంజినీరింగ్‌ చేసినవారూ దరఖాస్తు చేయొచ్చు. 


3) సూపర్‌వైజర్‌ (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ): 1 పోస్టు. ఐటీ/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ డిప్లొమా ఫస్ట్‌క్లాస్‌లో పాసవ్వాలి. లేదా బీటెక్‌/ బీఈ/ బీఎస్సీ ఇంజినీరింగ్‌ చేసిన అభ్యర్థులూ దరఖాస్తు చేయొచ్చు. సూపర్‌వైజర్‌ పోస్టులకు గరిష్ఠ వయసు 30 ఏళ్లు. 


4) జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌: 4 పోస్టులు. 55 శాతం మార్కులతో డిగ్రీ, కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికీ 40 పదాలు/హిందీలో 30 పదాలను కంప్యూటర్‌పైన టైప్‌ చేయగలగాలి. ఈ పోస్టుకు గరిష్ఠ వయసు 28 ఏళ్లు. 


5) జూనియర్‌ టెక్నీషియన్‌ (ప్రింటింగ్‌): 27 పోస్టులు. ప్రింటింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో ఫుల్‌టైమ్‌ డిప్లొమా ఉండాలి. 


6) జూనియర్‌ టెక్నీషియన్‌ (కంట్రోల్‌): 25 పోస్టులు. హ్యాండ్‌ కంపోజింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి లేదా ప్రింటింగ్‌ టెక్నాలజీలో డిప్లొమా చేయాలి. 


7) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఇంక్‌ ఫ్యాక్టరీ): 15 పోస్టులు. అటెండెంట్‌ ఆపరేటర్‌/ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌/ మెషినిస్ట్‌ ట్రేడ్‌/ మెషినిస్ట్‌ గ్రైండర్‌ట్రేడ్‌/ ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా ఉండాలి. 


8) జూనియర్‌ టెక్నీషియన్‌ (మెకానికల్‌/ ఎయిర్‌ కండిషనింగ్‌): 3 పోస్టులు. ఐటీఐ ఫిట్టర్‌ సర్టిఫికెట్‌ లేదా మెకానికల్‌ (ఫిట్టర్‌) డిప్లొమా పాసవ్వాలి. 


9) జూనియర్‌ టెక్నీషియన్‌ (ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ): 4 పోస్టులు. ఐటీఐ ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సర్టిఫికెట్‌ లేదా ఎలక్ట్రికల్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి. 


10) జూనియర్‌ టెక్నీషియన్‌ (సివిల్‌/ ఎన్విరాన్‌మెంట్‌): 1 పోస్టు. ఐటీఐ వెల్డర్‌ సర్టిఫికెట్‌/ సివిల్‌ (వెల్డర్‌) డిప్లొమా ఉండాలి. టెక్నీషియన్‌ పోస్టులకు గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు. 


గరిష్ఠ వయసులో ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 నుంచి 8 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థులకు గరిష్ఠ వయసు లేదు. దరఖాస్తు ఫీజు ఎస్సీ/ ఎస్టీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్‌/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.200. ఇతరులకు రూ.600.


పరీక్ష ఎలా ఉంటుంది?


సూపర్‌వైజర్‌ పోస్టుకు: 

1) టెక్నికల్‌/ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలు 50 (125 మార్కులు)

2) జనరల్‌ అవేర్‌నెస్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు)

3) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు (25 మార్కులు)

4) లాజికల్‌ రీజనింగ్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు)

5) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 30 ప్రశ్నలు (30 మార్కులు)

మొత్తం 165 ప్రశ్నలకు 240 మార్కులు ఉంటాయి. వ్యవధి 120 నిమిషాలు. 


జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుకు: 

పరీక్ష రెండు ఫేజుల్లో జరుగుతుంది. ఫేజ్‌-1లో టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్, ఫేజ్‌-2లో ఆన్‌లైన్‌ పరీక్ష ఉంటుంది. టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌లో పాసైన అభ్యర్థులను ఆన్‌లైన్‌ పరీక్షకు ఎంపికచేస్తారు. టైపింగ్‌ టెస్ట్‌ ఇంగ్లిష్‌ లేదా హిందీలో ఉంటుంది. ఆన్‌లైన్‌ పరీక్షలో 

1) జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు)

2) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు)

3) లాజికల్‌ రీజనింగ్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు)

4) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలకు (50 మార్కులు)

మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు.  


జూనియర్‌ టెక్నీషియన్‌ పోస్టుకు: 

1) టెక్నికల్‌/ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 50 ప్రశ్నలు (75 మార్కులు)

2) జనరల్‌ అవేర్‌నెస్‌ 15 ప్రశ్నలు (15 మార్కులు)

3) ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 15 ప్రశ్నలు (15 మార్కులు)

4) లాజికల్‌ రీజనింగ్‌ 10 ప్రశ్నలు (10 మార్కులు)

5) క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 10 ప్రశ్నలు (10 మార్కులు)

మొత్తం 100 ప్రశ్నలకు 125 మార్కులు. వ్యవధి 120 నిమిషాలు. 


ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. నెగెటివ్‌ మార్కులు లేవు. ఆన్‌లైన్‌ పరీక్ష సెప్టెంబర్‌/ అక్టోబర్‌ నెలల్లో ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆన్‌లైన్‌ పరీక్షను హైదరాబాద్‌లో మాత్రమే  నిర్వహిస్తారు. 



సన్నద్ధత ఎలా?

సూపర్‌వైజర్, టెక్నీషియన్‌ పోస్టులకు జరిగే ఆన్‌లైన్‌ పరీక్షలో.. టెక్నికల్‌/ ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు 75 మార్కులు కేటాయించారు. ఆయా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుని, రివిజన్‌ చేసుకోవాలి.  

అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. ఇప్పటినుంచే సమయాన్ని ఏమాత్రం వృథా చేయకుండా సన్నద్ధతను ప్రారంభించాలి. రోజువారీ టైమ్‌ టేబుల్‌ వేసుకుని దాన్ని కచ్చితంగా అనుసరించాలి.  

టైమ్‌టేబుల్‌లో ప్రతి సబ్జెక్టుకూ తగిన సమయాన్ని కేటాయించుకోవాలి. క్లిష్టంగా అనిపించే అంశాలను వాయిదా వేయకుండా వాటి పైన ఎక్కువ సమయాన్ని వినియోగించాలి. 

నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ప్రశ్నకూ సమాధానాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ముందుగా సులువుగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాసి.. చివర్లో కాస్త క్లిష్టంగా ఉన్న వాటిని సాధిస్తే సమయం వృథా కాదు.  

పాత ప్రశ్నపత్రాలను జాగ్రత్తగా గమనిస్తే ప్రశ్నల సరళి అర్థమవుతుంది. ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉండే సబ్జెక్టులకు ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. 

జనరల్‌ అవేర్‌నెస్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, లాజికల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాలకు బ్యాంక్‌ పోటీ పరీక్షల పుస్తకాలనూ చదవొచ్చు. కొన్ని వెబ్‌సైట్లలో మాక్‌ టెస్టులూ అందుబాటులో ఉన్నాయి. వాటిని రాయడం మేలు. 


దరఖాస్తుకు చివరి తేదీ: 21.08.2023


వెబ్‌సైట్‌: https://bnpdewas.spmcil.com/en/

 

మీరు మా Telegram Channel లేదా Watsapp Community లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 నెంబరుకు వాట్సాప్ ద్వారా hai అని మెసేజ్ చేయడం ద్వారా జాయిన్ లింక్ లను పొంది మీరే సొంతంగా జాయిన్ అవ్వొచ్చు. For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.