RCFL: ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
RCFL: ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 157 ఖాళీలు
విభాగాలు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, సెక్రటేరియల్ అసిస్టెంట్, రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ (హెచ్‌ఆర్).
అర్హత: బీకాం, బీబీఏ, ఏదైనా డిగ్రీతో పాటు ఆంగ్ల పరిజ్ఞానం కలిగి ఉండాలి.
2. టెక్నీషియన్ అప్రెంటిస్: 115 ఖాళీలు
విభాగాలు: కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
3. ట్రేడ్ అప్రెంటిస్: 136 ఖాళీలు
విభాగాలు: అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్), బాయిలర్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్, హార్టికల్చర్ అసిస్టెంట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ (కెమికల్ ప్లాంట్), ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ).
అర్హత: ట్రేడును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.04.2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.
మొత్తం ఖాళీల సంఖ్య: 408.
స్టైపెండ్: నెలకు రూ.7000 నుంచి రూ.9000.
శిక్షణ ప్రాంతం: ట్రాంబే (ముంబయి), థాల్ (రాయ్‌గఢ్ జిల్లా).
ఎంపిక విధానం: సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 07.11.2023.
Notification InformationPosted Date: 25-10-2023
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
కామెంట్‌లు