Alerts

--------

25, అక్టోబర్ 2023, బుధవారం

UGC-NET: యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2023 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2023 (యూజీసీ- నెట్‌) పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్‌లో నిర్వహించనున్నట్టు యూజీసీ వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్షలు డిసెంబర్‌ నెల 06- 22 తేదీల్లో జరగనున్నాయి. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

UGC-NET: యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2023 

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2023 (యూజీసీ- నెట్‌) పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్‌లో నిర్వహించనున్నట్టు యూజీసీ వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది. ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్షలు డిసెంబర్‌ నెల 06- 22 తేదీల్లో జరగనున్నాయి. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

వివరాలు:

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2023

సబ్జెక్టులు: అడల్ట్‌ ఎడ్యుకేషన్‌, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్‌ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్‌, కంప్యూటర్ సైన్స్ అండ్‌, క్రిమినాలజీ, జాగ్రఫీ, ఎకనామిక్స్‌, ఇంగ్లిష్‌, హోం సైన్స్‌, హిస్టరీ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఇండియన్‌ కల్చర్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌, లింగ్విస్టిక్స్‌, మ్యూజిక్‌, సైకాలజీ, లా, తదితరాలు.

అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: జేఆర్‌ఎఫ్‌కు 01.12.2023 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు... 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్/ అన్‌రిజర్వ్‌డ్‌కు రూ.1150; జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌కు రూ.325.

ముఖ్యమైన తేదీలు.....

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 30-09-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-10-2023.

పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 29-10-2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 30-31 అక్టోబర్‌, 2023.

పరీక్ష కేంద్రాల వివరాల వెల్లడి: తర్వాత వెల్లడించనున్నారు.

అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రారంభం: తర్వాత వెల్లడించనున్నారు.

పరీక్ష తేదీలు: 06-12-2023 నుంచి 22-12-2023 వరకు.

ఫలితాల వెల్లడి: 10-01-2024.

Notification Information

Posted Date: 01-10-2023

 

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -

కామెంట్‌లు లేవు:

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...