7, నవంబర్ 2023, మంగళవారం

ఉద్యోగ సాధన | On Campus | Off Campus Interview Preparation

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-


ఆన్‌క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ 

Interview ప్రిపరేషన్‌

ఉద్యోగ సాధనకు సూచనలు


విద్యార్థులు చదువుతున్న సమయంలో క్యాంపస్‌లోనే ఉద్యోగం సాధించి బయటకు పట్టాతోపాటు ఆఫర్ లెటర్‌ కూడా తీసుకుని వెళ్తారు. అందరికీ ఇలా సాధ్యం కాదు. వీరు ఆఫ్ క్యాంపస్‌ ఇంటర్వ్యూలను లక్ష్యంగా చేసుకుంటారు. రెండు వేటికవే ప్రత్యేకం. వీటికి సన్నద్ధమయ్యే సమయంలో దేని పద్ధతి దానికే ఉంటుంది. మరి దేనికెలా ప్రిపేర్ అయితే బాగుంటుందో, ప్రధాన వ్యత్యాసాలేమిటో చూద్దామా..


ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్.. రెండు శిక్షణల్లో జరిగే ఇంటర్వ్యూలకు వేటికవే అనుకూలతలూ ప్రతికూలతలూ ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడానికి తగిన విధంగా సిద్ధం కావడం ద్వారా అభ్యర్థి అనుకున్న కొలువు దక్కించుకోవచ్చు. చదువు పూర్తవుతూ ఉద్యోగ ముఖాముఖిలు ఎదుర్కోబోయే విద్యార్థుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెంటికీ మధ్య వ్యత్యాసం, సన్నద్ధం కావాల్సిన దృష్టిలో విజయం సాధించడం తేలిక.


కాలేజీలే కంపెనీలను ఆహ్వానించే ఆన్‌ క్యాంపస్‌ ఇంటర్య్యూల్లో విద్యార్థులు తమ తోటివారితోనే పోటీ పడతారు. అందువల్ల బయట పోటీ తక్కువగా ఉంటుంది. అదే విద్యార్థి నేరుగా వెతుక్కుంటూ వెళ్లే ఆఫ్‌ క్యాంపస్‌ ఉద్యోగాల్లో కంపెనీ స్థాయిని బట్టి, ఉద్యోగాల సంఖ్యను బట్టి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను బట్టి పోటీ ఉంటుంది. ఏదైనా క్యాంపస్‌లో కంటే బయట అభ్యర్థి అధిక పోటీని తట్టుకుని నిలబడాల్సి వస్తుంది. 


అయితే క్యాంపస్‌కి వచ్చే కంపెనీలు సాధారణంగా విద్యార్థులకు తక్కువ ప్రారంభ వేతనాలు ఇస్తూ ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అత్యున్నత ప్రతిభాపాఠవాలు కలిగిన విద్యార్థులకు లక్షలాది రూపాయల జీతాలు ఆఫర్ చేసినా.. వీరి సంఖ్య చాలా తక్కువ. అధిక శాతం తక్కువ స్థాయి వేతనాలతోనే ఉద్యోగాలు ఇస్తుంటాయి. అదే ఆఫ్‌ క్యాంపస్‌ అయితే కాస్త ఎక్కువ జీతాలతో ఉద్యోగాల్లోకి తీసుకునే వీలుంటుంది.


విద్యార్థులే నేరుగా వెతుక్కునే ఇంటర్య్వూలకు హాజరయ్యేటప్పుడు మొత్తం అన్నీ వారే చూసుకోవాల్సి వస్తుంది. అయితే క్యాంపస్‌లో అయితే కళాశాల యాజమాన్యమే అన్నీ ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది. పూర్తిగా ఇంటర్వ్యూపైనే ఏకగ్రత పెట్టవచ్చు. 


కంపెనీలు కాలేజీకి రావడం అంటే విద్యార్థులకు అన్ని సంస్థల గురించి తెలిసే అవకాశం, ఇంకా మంచి ఛాన్సులు అందుకు వీలుగా ఉండవు. అదే బయట అయితే అన్ని స్థాయుల కంపెనీలపైనా ఫోకస్‌లో ఉండి నచ్చిన చోట మెచ్చిన ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే వీలుంటుంది. 


ఆన్ క్యాంపస్ తేలిక ఇంటర్య్వూలకు సాధారణంగా సన్నద్ధం కావడం కొంత వరకు. పక్కనే మెలకువలు చెప్పే అధ్యాపకులు ఉండటం, ఎంపిక ప్రక్రియ అంతా కావడం.. ఒక ఇంటర్య్వూలో తప్పు చేస్తే మరో దానిలో వాటిని సరిచేసుకునే వీలుండటం వల్ల ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అయితే ఆఫ్ క్యాంపస్‌ ఇంటర్య్వూలు పూర్తిగా అభ్యర్థి వ్యక్తిగత శ్రద్ధ, ప్రణాళిక, సన్నద్ధతపైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల వీటిలో విజయం సాధించడం కొంత కష్టమే.


సన్నద్ధత


బయట ప్రయత్నించేటప్పుడు..

బలాలపై దృష్టి:  ఇటువంటి సమయంలో అభ్యర్థి తన బలాలను, నైపుణ్యాలను సమర్థంగా ప్రదర్శించాలి. కేవలం అవతలి వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడమే కాకుండా.. మొత్తంగా తన మెరుగైన ప్రదర్శనను, కంపెనీకి తన అవసరాన్ని చూపించగలిగేలా బలాలపై దృష్టి సారించాలి. పోటీలో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి ఉద్యోగానికి సరిపోయేలా పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి.

ప్రశాంతంగా..: అవకాశాల సముద్రంలోకి మనం ఇప్పుడే అడుగుపెట్టాం. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అందువల్ల ప్రతి ఒక్కటి అవకాశంగా భావించి ప్రశాంతంగా ముఖాముఖిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. పాజిటివ్‌గా ఉండటం వల్ల మనల్ని మనం మెరుగ్గా చూపించుకునే వీలుంటుంది. 

మన గురించి చెప్పడం . అది ఉద్యోగం లభించే అవకాశాలను మెరుగుపరుస్తుంది.


క్యాంపస్‌ ఇంటర్వ్యూలో..

సాధారణంగా వీటిలో తక్కువ రౌండ్లు ఉండటమే కాకుండా ఫార్మాట్‌లో అంతా ముందుగా విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా ఉంటుంది. మొదట ఆప్టిట్యూడ్ - లాంగ్వేజ్ రౌండ్, గ్రూప్ డిస్కషన్, తర్వాత టెక్నికల్, ఆపైన హెచ్‌ఆర్‌.. సాధారణంగా ఈ విధంగా ఉంటుంది. దీనికి తగిన విద్యార్థి సన్నద్ధమైతే సరిపోతుంది. 

ఆన్ క్యాంపస్‌లో విజయంపై మంచి మార్కులు మొదట అధిక ప్రభావం చూపిస్తాయి. అదే సమయంలో కేవలం పాఠ్య పుస్తకాల అవగాహనే కాకుండా నైపుణ్యాలు కూడా చూపించుకోగలగాలి. ఈ సమయంలో థియరిటికల్‌గా కంటే ప్రాక్టికల్‌గా కనిపించేందుకు ప్రయత్నించాలి. 

ఇంటర్వ్యూలకు వచ్చే కంపెనీల గురించి తెలుసుకోవడం, మన ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టులు, సర్టిఫికేషన్‌లు, ఇతర ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ గురించి చక్కగా తెలియజెప్పడం.. ఉద్యోగం పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నామో వివరించడం.. ఇవన్నీ చేయడం ద్వారా ఇతరులకు ప్రభావవంతంగా కనిపించవచ్చు.


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: